చెక్‌యూజర్ విధానం
The following page is a translation of global policy into Telugu language. Please note that in the event of any differences in meaning or interpretation between the original English version of this document and a translation, the original English version takes precedence. This page has been developed and approved by the community and its compliance is mandatory for all projects. It must not be modified without prior community approval. |
చెక్‌యూజర్ హోదా
చెక్ యూజర్ అనేది చెక్ యూజర్ అనుమతి గల వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఇంటర్ఫేస్. వికీలో చెక్ యూజర్ అనుమతి ఉన్న వినియోగదారు, ప్రత్యేకించి ఆ వికీలోని ఎవరైనా వాడుకరి, ఆ వికీలోనే ఉన్న (అన్ని వికీల్లో కాదు) మరొక వాడుకరికి సాక్‌పపెట్టా కాదా అని తనిఖీ చేయవచ్చు . దీన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కింది పనులు చేయగలరు:
- వికీమీడియా వికీలో ఏదైనా ఖాతా ఏ IP చిరునామాల నుండి లాగింగ్ చర్యలు లేదా సంకేతపదాల మార్పులను చేసిందో నిర్ణయించడం;
- ఒక నిర్దిష్ట IP చిరునామా నుండి వికీమీడియా వికీలో చేసిన అన్ని దిద్దుబాట్లు, లాగిన్ అయ్యాక చేసిన పనులు, లాగిన్ ప్రయత్నాలు, సంకేతపదాల మార్పులను నిర్థారించడం (ఖాతాతో లాగిన్ అయిన వినియోగదారులతో సహా)
- తనిఖీ చేయబడుతున్న ఖాతా మీడియావికీ ఇంటర్ఫేసును ఉపయోగించి ఇతర వాడుకరులకు ఈమెయిలు పంపారా అనేది నిర్థారించడాం. అది జరిగిన సమయాన్ని లాగ్ చేస్తుంది. గమ్యం ఈమెయిలు చిరునామా, గమ్య ఖాతాలను మసకబారుస్తుంది.
ఈ సమాచారం స్వల్ప కాలం పాటు మాత్రమే భద్రంగా ఉంటుంది (ప్రస్తుతం 90 రోజులు) కాబట్టి అంతకు ముందు చేసిన దిద్దుబాట్లను చెక్ యూజర్ సాధనం ద్వారా చూడలేరు. సాధనాన్ని ఎవరు ఉపయోగించారు అనే లాగ్ రికార్డవుతుంది. ఈ లాగ్ "Checkuser - log" అనుమతి ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది:
యూజర్ మాన్యువల్ కోసం Help:CheckUser చూడండి.
పరికరం వినియోగం
ఈ సాధనం దుశ్చర్యలను, స్పామింగునూ ఎదుర్కోడానికి, సాక్‌పప్పెట్ దుర్వినియోగాన్ని తనిఖీ చేయడానికి, ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలను పరిమితం చేయడానికీ ఉపయోగించాలి. వికీమీడియా ప్రాజెక్టులకు నష్టం జరగకుండా నిరోధించడానికి మాత్రమే దీనిని ఉపయోగించాలి.
రాజకీయ నియంత్రణ కోసము, సంపాదకులపై ఒత్తిడి తీసుకురావడానికీ లేదా కంటెంట్ వివాదంలో సంపాదకులను బెదిరించడానికీ ఈ సాధనాన్ని ఉపయోగించకూడదు. వాడుకరిపై దర్యాప్తు చేసేందుకు చెక్ యూజర్ సాధనాలను ఉపయోగించడానికి సరైన కారణం ఉండాలి. విధానాలను ఉల్లంఘించకుండా ప్రత్యామ్నాయ ఖాతాలను ఉపయోగించడం నిషిద్ధం కాదని గమనించండి (డబుల్ - ఓటింగు, ఏదైనా అభిప్రాయానికి మద్దతును పెంచడం కోసం, లేదా నిరోధాలను, నిషేధాలనూ తప్పించుకోవడం వంటివి ఉల్లంఘనల కిందికి వస్తాయి).
తనిఖీ చేయబడిన ఖాతాకు ఆ సంగతిని తెలియజేయడం చేయవచ్చు, కానీ అది తప్పనిసరి కాదు. అదేవిధంగా, చెక్ చేసినట్లు సముదాయానికి తెలియజేయడం కూడా తప్పనిసరి కాదు. కానీ గోప్యతా విధానపు నిబంధనలకు లోబడి అలా తెలియజేయవచ్చు.
కొన్ని వికీల్లో, వాడుకరి స్వీయ అభ్యర్థన మేరకే అతని/ఆమె IPలను తనిఖీ చేసే అనుమతి ఉంటుంది. ఉదాహరణకు - ఒక సాక్‌పప్పెట్ ఆరోపణకు వ్యతిరేకంగా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆధారాలు అందించాల్సిన అవసరం ఉంటే. అయితే కొందరు, ఈ పరిస్థితులలో ప్రాసెస్‌ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కూడా ఇలా చెక్ యూజర్ను అభ్యర్థించడం చేయవచ్చు.
గోప్యతా విధానం
వికీమీడియా ప్రాజెక్టుల్లో గోప్యతా విధానానికి అనన్యమైన ప్రాధాన్యత ఉంది. తమ చర్యల ద్వారా వికీపీడియా విధానాలను అతిక్రమిస్తున్న వారిని (ఉదా.. పెద్దయెత్తున బాట్ దుశ్చర్యలు లేదా స్పాము), అడ్డుకోవాలంటే వారి గురించిన సమాచారాన్ని బయట పెట్టడం ఆవశ్యకమైతే తప్ప, వారి ఐపీలు, ఎక్కడ ఉంటారు వంటి గుర్తింపులను బయటపెట్టగల ఇతర సమాచారాన్నీ వెల్లడించడం గోప్యతా విధానాన్ని అతిక్రమించడం అవుతుంది -వారే స్వయంగా ఈ సమాచారాన్ని ప్రాజెక్టులో వెల్లడించిన సందర్భంలో తప్ప,
సమాచార వెల్లడి
వాడుకరి దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ, వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడమే మంచిది.
- సాధారణంగా ఐపీలను బహిర్గతం చేయరాదు. ఒకే నెట్‌వర్కు / ఒకే నెట్‌వర్కు కాదు వంటి సమాచారం మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ వివరణాత్మక సమాచారాన్ని ఇస్తున్నట్లైతే , దానిని అందుకుంటున్న వారు విశ్వసనీయమైన వ్యక్తే అని, దానిని వారు బహిర్గతం చేయరు అనీ నిర్ధారించుకోండి.
- వాడుకరి తాను ఫలానా ప్రదేశానికి చెందినవాళ్ళమని చెప్పిన సందర్భంలో, ఐపీ చెక్ దాన్ని ధ్రువీకరిస్తే, ఆ ధ్రువీకరణను బహిర్గత పరిచినపుడు అది గోప్య సమాచారాన్ని వెల్లడించినట్లు అవదు.
- ఏదైనా సందేహం ఉంటే, వివరాలేమీ ఇవ్వరాదు.
చెక్‌యూజర్ అనుమతి
చెక్‌యూజరు హోదా పొందేందుకు అంగీకారం లభించిన అభ్యర్థులు, ఆ అనుమతులు పొందేముందు బహిరంగం కాని వ్యక్తిగత డేటా విధానానికి అనుగుణంగా ఉండే బహిరంగం కాని సమాచారం కొరకు గోప్యతా ఒప్పందంపై సంతకం చేయాలి. |
స్టీవార్డులు, ఆంబుడ్స్‌లు, వికీమీడియా ఫౌండేషన్ స్టాఫ్ సభ్యులు కొందరు, చాలా స్వల్ప సంఖ్యలో ఇతర వాడుకరులకూ మాత్రమే చెక్‌యూజర్ అనుమతులు ఉంటాయి. వాడుకరులకు చెక్‌యూజర్ అనుమతులు స్థానికంగా మాత్రమే ఉంటుంది (ఆంబుడ్స్‌కు, అనుమతులున్న కొందరు స్టాఫ్ సభ్యులకూ తప్పించి).
ఏదైనా ప్రాజెక్టులో స్థానికంగా చెక్‌యూజర్లుంటే, చెక్‌లు సాధారణంగా వాళ్ళే చెయ్యాలి. అత్యవసర పరిస్థితుల్లో గానీ, బహుళ ప్రాజెక్టుల్లో చెక్‌యూజర్ చెక్‌లు చెయ్యాల్సినపుడు గానీ (క్రాస్-వికీ దుశ్చర్యల వంటి సందర్భాల్లో) స్టీవార్డులు స్థానిక చెక్‌లు చేస్తారు. ఆ చెక్ పూర్తయ్యాక స్టీవార్డులు, స్థానిక ప్రాజెక్టులో పొందిన అనుమతిని తిరిగి తీసేసుకోవాలి. ఆ సంగతిని స్థానిక చెక్‌యూజర్లకు గానీ, చెక్‌యూజర్ ఈమెయిలు జాబితాకు గానీ తెలియజేయాలి.
ఒకవేళ ప్రాజెక్ట్ కోసం స్థానిక చెక్‌యూజర్లు లేనట్లయితే , చెక్‌లు చేయడానికి స్టీవార్డులను అభ్యర్థించ వలసి ఉంటుంది (ఉదాహరణకు "వాడుకరి1 వాడుకరి2 కు సాక్‌పపెట్టా"). అలా చేయడానికి, Steward requests/Checkuser లో ఆయా వాడుకరిపేర్లను ఇస్తూ అభ్యర్థన చేర్చాలి. చెక్ చెయ్యాల్సిన అవసరాన్ని వివరించాలి (సంబంధిత లింకులతో సహా). అభ్యర్థన స్వభావాన్ని బట్టి , స్టీవార్డు దానిని తిరస్కరించవచ్చు, మరింత సమాచారం అడగవచ్చు లేదా ఆయా వాడుకరులు ఒకే ఐపీ, లేదా ఒకే ప్రాక్సీ, లేదా ఒకే నెట్‌వర్కు, లేదా ఒకే దేశానికి లేదా పూర్తిగా సంబంధం లేని వారా అనే దాని గురించి సమాధానం ఇవ్వవచ్చు (మరింత ఖచ్చితత్వం ఉండేలా స్టీవార్డు ఏం చెప్పాలి అనే విషయమై చర్చ చూడండి).
స్థానికంగా చెక్‌యూజర్లను నియమించడం
ఏ వికీలోనైనా చెక్ యూజర్ అనుమతి ఉన్న వాడుకరులు కనీసం ఇద్దరు ఉండాలి లేదా అసలు ఉండకూడదు. ఆ విధంగా వారి చర్యలపై పరస్పర నియంత్రణ ధృవీకరణ ఉంటుంది. వికీలో ఒక చెక్ యూజర్ మాత్రమే మిగిలి ఉన్న సందర్భంలో (మరొక వ్యక్తి పదవీ విరమణ చేసినప్పుడు గానీ, లేదా తొలగించబడినప్పుడు గానీ) సముదాయం వెంటనే ఓ కొత్త చెక్ యూజర్ను నియమించాలి (తద్వారా చెక్ యూజర్లు కనీసం ఇద్దరుంటారు).
మధ్యవర్తిత్వ మండలి (ArbCom) ఉన్న వికీల్లో, దాని సభ్యులు కనీసం 25–30 మంది స్థానిక సముదాయ సభ్యుల మద్దతుతో ఎన్నికై ఉంటే, మధ్యవర్తులే నేరుగా చెక్‌యూజర్లను నియమించవచ్చు. ఒప్పందం అయ్యాక, మండలి లోని సభ్యులెవరైనా ఒకరు ఆ అభ్యర్థి పేరును Steward requests/Permissions లో చేరిస్తే చాలు.
పైన పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉండే మధ్యవర్తిత్వ కమిటీ లేని వికీల్లో లేదా స్వతంత్ర ఎన్నికలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రాజెక్టులో, సముదాయమే స్థానిక చెక్ యూజర్లను ఏకాభిప్రాయం ద్వారా ఆమోదించవచ్చు. స్టీవార్డులను స్థానిక చెక్ యూజర్లుగా లెక్కించరు. అభ్యర్థి స్థానిక సముదాయంలో చెక్ యూజర్ స్థితిని అభ్యర్థించి, ఈ అభ్యర్థనను సముచితమైన పద్ధతిలో ప్రచారం చేసుకోవాలి (రచ్చబండ, మెయిలింగ్ జాబితా, ప్రత్యేక అభ్యర్థన పేజీ మొదలైన వాటి ద్వారా). అభ్యర్థికి తప్పనిసరిగా గోప్యతా విధానం గురించి తెలిసి ఉండాలి. స్థానిక సముదాయంలో ఏకాభిప్రాయం పొందిన తరువాత (సమర్థకుల/వ్యతిరేకుల ఓటింగులో కనీసం 70 - 80% సమర్థన గానీ, లేదా బహుళ ఎంపిక ఎన్నికలలో అత్యధిక సంఖ్యలో ఓట్లు పొందడం ద్వారా గానీ). కనీసం 25 - 30 మంది సంపాదకుల ఆమోదం పొంది విజయవంతమైన అభ్యర్థి, చెక్‌యూజరు అనుమతి కోసం Steward requests/Permissions వద్ద అభ్యర్థించాలి. అక్కడ, సముదాయం నిర్ణయం ప్రకటించిన పేజీకి లింకును ఇవ్వాలి. కనీసం ఇద్దరు చెక్ యూజర్లకు తగినన్ని ఓట్లు లేకపోతే చెక్ యూజరు అనుమతి ఇవ్వరు.
Mailing list
There is a closed mailing list (CheckUser-l) to which all stewards and CheckUsers should have access. Email the list moderators to gain access. Use this mailing list to ask for help, ideas and second opinions if you're not sure what the data means.
IRC channel
There is a private IRC channel (#wikimedia-checkuserconnect) to which all stewards and CheckUsers who use IRC should have access. This channel serves the same purpose as the mailing list, but in real-time. Contact any channel member to gain access; a channel manager will grant permanent access. Ask a steward if you need help gaining access.
అనుమతుల తీసివేత
చెక్ యూజర్ హోదా ఉన్న ఖాతా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు క్రియారహితంగా ఉంటే, వారి చెక్ యూజర్ అనుమతిని తీసేస్తారు.
సాధనాన్ని దుర్వినియోగం చేసిన సందర్భంలో, స్టీవార్డ్ గానీ చెక్ యూజర్ అధికారం ఉన్న వాడుకరి గానీ వెంటనే వారి అనుమతిని తీసేస్తారు. చెడు ప్రవర్తన ఆరోపణలు గానీ, అలాంటి ఉద్దేశాలు గానీ లేని వాడుకరులపై తనిఖీలు చేస్తూ ఉంటే, అలాంటి చెక్‌యూజర్లపై ఈ చర్య తీసుకుంటారు (చెడు ప్రవర్తనకు సంబంధించిన లింకులు, రుజువులను చూపించాలి).
చెక్ యూజర్ అనుమతిని దుర్వినియోగం చేసారన్న అనుమానంపై స్థానిక వికీలో చర్చ జరగాలి. ఆమోదించబడిన మధ్యవర్తిత్వ సంఘం ఉన్న వికీల్లో అనుమతి తీసివేతపై ఈ సంఘమే నిర్ణయం తీసుకోవచ్చు. ఆ సంఘం లేని వికీల్లో సముదాయం ఆ నిర్ణయం తీసుకోవాలి.
పబ్లిక్ కాని సమాచార విధానాన్ని, గోప్యతా విధానాన్నీ, లేదా చెక్‌యూజర్ అనుమతులనూ ఉల్లంఘించిన సందర్భాల్లో వికీమీడియా ప్రాజెక్టులన్నిటికీ సంబంధించిన ఫిర్యాదులను Ombuds commission దర్యాప్తు చేస్తుంది.
చెక్‌యూజర్ అనుమతి ఉన్న వాడుకరులు
- Edit (last updated: 2024-10-29)
Everywhere
- Stewards - upon request or their own initiative, stewards use it by briefly granting the right to themselves; this is logged.
- Some members of the Staff of the Wikimedia Foundation (see global group)
- Members of the Ombuds commission (see automatically generated list):
Arabic Wikipedia
Automatically generated checkusers list
Bengali Wikipedia
Automatically generated checkusers list
Local policy mandates that only users who gain at least 25 votes in favor and 80% support can be appointed (applications will open for no fewer than 30 days).
Catalan Wikipedia
Automatically generated checkusers list
Czech Wikipedia
Automatically generated checkusers list
Danish Wikipedia
Automatically generated checkusers list
Dutch Wikipedia
Automatically generated checkusers list
- Appointed by Arbcom
English Wikibooks
Automatically generated checkusers list
Local policy mandates that Stewards are explicitly allowed to process non-emergency CheckUser requests.
English Wikinews
Automatically generated checkusers list
English Wikipedia
Automatically generated checkusers list
- Alison
- AmandaNP
- Aoidh
- Barkeep49
- Blablubbs
- Bradv
- Cabayi
- Callanecc
- CaptainEek
- DatGuy
- Dreamy Jazz
- Drmies
- EdJohnston
- Ferret
- Firefly
- Girth Summit
- Guerillero
- HJ Mitchell
- Ivanvector
- Izno
- Joe Roe
- Jpgordon
- KrakatoaKatie
- Ks0stm
- L235
- Mailer diablo
- Materialscientist
- Mkdw
- Moneytrees
- Mz7
- NinjaRobotPirate
- Oshwah
- PhilKnight
- Ponyo
- Primefac
- Reaper Eternal
- RickinBaltimore
- Risker
- RoySmith
- SQL
- ST47
- Salvio giuliano
- Sdrqaz
- Stwalkerster
- ToBeFree
- Vanamonde93
- Versageek
- Yamla
- Zzuuzz
- Z1720
English Wiktionary
Automatically generated checkusers list
Finnish Wikipedia
Automatically generated checkusers list
French Wikipedia
Automatically generated checkusers list
Under the local policy, CheckUsers are elected for six-month terms.
German Wikipedia
Automatically generated checkusers list
Under the local policy, CheckUsers are elected for one- or two-year terms.
Hebrew Wikipedia
Automatically generated checkusers list
Hungarian Wikipedia
Automatically generated checkusers list (requests and policy)
Indonesian Wikipedia
Automatically generated checkusers list
Italian Wikipedia
Automatically generated checkusers list
Japanese Wikipedia
Automatically generated checkusers list (policy)
Korean Wikipedia
Automatically generated checkusers list (policy and requests)
Malayalam Wikipedia
Automatically generated checkusers list (policy and requests)
Persian Wikipedia
Automatically generated checkusers list
Polish Wikipedia
Automatically generated checkusers list
Due to a new local policy, users who gain 85% of votes in favor may become CheckUsers.
Portuguese Wikipedia
Automatically generated checkusers list
Under the local policy, CheckUsers are elected for two-year terms.
Russian Wikipedia
Automatically generated checkusers list
- Appointed by ArbCom
Serbian Wikipedia
Automatically generated checkusers list
Simple English Wikipedia
Automatically generated checkusers list
Slovene Wikipedia
Automatically generated checkusers list
Spanish Wikipedia
Automatically generated checkusers list
Local policy mandates that only users who gain at least 30 votes in favor and 80% support can be appointed.
Swedish Wikipedia
Automatically generated checkusers list
Thai Wikipedia
Automatically generated checkusers list
Turkish Wikipedia
Automatically generated checkusers list
Ukrainian Wikipedia
Automatically generated checkusers list
- Appointed by ArbCom
Vietnamese Wikipedia
Automatically generated checkusers list
Wikimedia Commons
Automatically generated checkusers list · (information page and requests page)
Wikispecies
Automatically generated checkusers list
Meta
Automatically generated checkusers list · (information page and requests page)
Wikidata
Automatically generated checkusers list · (information page and requests page)
ఇవి కూడా చూడండి
- గోప్యతా విధానం
- ఆంబుడ్స్ కమిషను (గోప్యత అతిక్రమణపై ఫిర్యాదులను విచారిస్తుంది)
- చెక్‌యూజర్ సమాచారం, చెక్‌యూజర్ హోదా కోసం అభ్యర్థనలు
- ప్రాజెక్టుల్లో స్థానిక విధానాలు
- Help:CheckUser యూజర్ మాన్యువల్
- [Foundation-l] CheckUser (thoughts), by Anthere on April 22, 2006, includes a historic background