WhatsApp స్టేటస్‌లో మీ ప్రియమైన వ్యక్తులతో ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్లు మరియు టెక్స్ట్ మెసేజ్‌లను షేర్ చేయండి. స్టిక్కర్లు, GIFలు మొదలైనవాటిని యాడ్ చేయడం ద్వారా వాటిని వ్యక్తిగతీకరించండి. అవి 24 గంటల తర్వాత కనిపించకుండా అదృశ్యమవుతాయి.
స్టిక్కర్లు, అవతార్లు, GIFలు మరియు ఓవర్లే టెక్స్ట్‌తో, మీ భావాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకంగా ఉండటానికి మరియు మీ గురించి నిజమైన విషయాలను పంచుకోవడానికి అవసరమైన అన్ని సృజనాత్మక ఎంపికలు మీకు ఉన్నాయి.
మీరు ఎంతో ప్రేమించే ప్రతి ఒక్కరినీ లూప్‌లో ఉంచండి, అలాగే మీరు పోస్ట్ చేసే దేన్నైనా వారు చూడాలని మీరు కోరుకున్నప్పుడు, మీ స్టేటస్‌లో వారిని ప్రస్తావించండి. వారు దాన్ని లైక్ చేయవచ్చు, అలాగే సంభాషణను ప్రారంభించడానికి దానికి రిప్లై ఇవ్వవచ్చు.
మీరు మీ స్టేటస్‌ను నచ్చిన విధంగా షేర్ చేయవచ్చు. మీరు పోస్ట్ చేసినప్పుడు, దాన్ని ఎవరు చూడగలరనే నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉంటుంది, తద్వారా మీరు మీ తెర వెనుక జరిగే సన్నివేశాలను మరింత ఎక్కువ మనశ్శాంతితో షేర్ చేయవచ్చు.