రంజిత్, సౌమ్యమీనన్, ఆలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వెల్లువ’. మైల రామకృష్ణ దర్శకుడు. ఎం.కుమార్, ఎం.శ్రీనివాసులు నిర్మాతలు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఆలీ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సందేశాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. ఇందులో నేను ఓ పాటను పాడాను’ అని తెలిపారు. ‘జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే పాయింట్‌తో రూపొందిస్తున్నాం. ప్రస్తుతం రంజిత్, ఆలీలపై హైదరాబాద్‌లో ‘చెప్పకురా మామా నువ్వు చెప్పకు సారీ’ అనే గీతాన్ని చిత్రీకరిస్తున్నాం. ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ నెలలోనే సినిమాను విడుదలచేస్తాం’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ.