Jump to content

put

విక్షనరీ నుండి

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==*

(file)

క్రియ, విశేషణం, వేసుట, వుంచుట, పెట్టుట.

  • he put me four questions నాకు నాలుగుప్రశ్నలు వేసినాడు.
  • he put this story about యీ మాట పుట్టించినాడు.
  • he put the books away ఆ పుస్తకములను భద్రము చేసినాడు, చాచిపెట్టినాడు.
  • he put his wife away పెండ్లాన్ని తోసివేసినాడు.
  • his death put back our business వాడి చావు మాపనికి ఆటంకమైనది, అభ్యంతరమైనది.
  • he put by the money ఆ రూకలను భద్రముచేసినాడు.
  • she put by the curtain and looked out తెరను తొలగ దోసి చూచినది.
  • to put down కిందపెట్టుట, దించుట.
  • they put the palankeen down పల్లకీని దించిరి.
  • the soldiers put their arms down సిఫాయీలు తుపాకులను నేల పెట్టివేసిరి.
  • put this down in your account దీన్ని నీ లెక్కలో వ్రాసుకో.
  • the soldiers put down the mob or put down the tumult సోజర్లు ఆ గుంపును చెదరగొట్టిరి, ఆ గల్లత్తును అణిచిరి.
  • he put these arguments down వాడు యీ న్యాయములను ఖండించినాడు.
  • the judgeput the witnesses down న్యాయాధిపతి సాక్షులను చీవాట్లు పెట్టినాడు, అవమానముచేశినాడు.
  • he put an end to it దాన్ని నిలిపినాడు, మాన్పినాడు.
  • he put an end to their lives వాండ్లను చంపినాడు.
  • the tree put forth leaves ఆ చెట్టు చిగిరించినది.
  • the statement which he put forth or forward వాడు ప్రచురము చేసిన సంగతి.
  • he putforth his hand చెయి చాచినాడు.
  • he put his hand in his pocket తన జేబిలో చెయివేసినాడు.
  • they put the law in force ఆ చట్టమును చెల్లించినారు, జరిగించినారు.
  • he put the stones in contact ఆ రాళ్ళను చేరబెట్టినాడు, కదియబెట్టినాడు.
  • he put the plough in use ఆ నాగేటితో దున్నినాడు.
  • he has put the business in train ఆ పనినడిచేటట్టు వాడికి జ్ఞాపకము చేస్తిని.
  • these words put him in a passion యీమాటలకు వాడికి కోపము వచ్చినది.
  • he put the business in hand ఆ పనిని ఆరంభముచేయించినాడు.
  • she put the earrings in her ears చెవులు కమ్మలు పెట్టుకొన్నది.
  • the wind put the boughs in motion గాలికి కొమ్మలు కదిలినవి.
  • who put you in jail ?నిన్ను పారాలో పెట్టినది యెవరు.
  • he put the jewels in pawn వాడు ఆ సొమ్ములను కుదువపెట్టినాడు, తాకట్టు పెట్టినాడు.
  • he put the army in array దండును మోహరముగా యేర్పరచినాడు.
  • I will put you in the way to do it దాన్ని చేయడానికి నీకు దోవచూపుతాను, క్రమము చెప్పుతాను.
  • he put the statement in writing దాన్ని వ్రాసినాడు.
  • this put her in a fright దానికి యిందుకు భయమైనది.
  • he put in remarkవొక మాట అడ్డము వేసినాడు.
  • he put in his claim తన దావా చేసినాడు.
  • he putthe letter into Telugu ఆ జాబును తెనిగించినాడు.
  • I put the business into his hand ఆ వ్యవహారము అతని పరము చేస్తిని, అతనికి అప్పగిస్తిని.
  • he put himself into the hands of the enemy తానేశత్రువులకు చిక్కుపడ్డాడు.
  • he put the business off for a month ఆ పనిని నెల్లాండ్లదాకా చేయక జరిపినాడు.
  • he tried to put the goods off ఆ సరుకులను విక్రయముచేసివేయవలెనని చూచినాడు.
  • this is a mere put off or pretext అది వట్టి సాకు.
  • he putoff his clothes బట్టలు తీసివేసినాడు.
  • the snake put off its skin ఆ పాముకుసుము విడిచినది.
  • to put on వహించుట.
  • what did he put on ? యేమి తొడుక్కొన్నాడు.
  • he put his clothes on బట్టలు తొడుక్కొన్నాడు.
  • he put irons on the prisonersహండ్లకు సంకెళ్లు కొట్టినాడు.
  • he put a cover on the letter జాబుకు పైన లిఫాఫావేసినాడు.
  • he put the picture on the nail ఆ పఠాన్ని చిలుక్కు తగిలించినాడు.
  • he put on the character of a saint బుషివలె నటించినాడు, అభినయించినాడు.
  • she put on paint ముఖానికి వర్ణము పూనుకొన్నది.
  • he put varnish on the palankeen ఆ పల్లకీకివార్నీసు వేసినాడు, మెరుగునూనె పూసినాడు.
  • he was pleased but put on angerలోపల సంతోషమేగాని బయిటికి కోపము వచ్చినట్టు నటించినాడు.
  • he put the baggage on a cart సామానులు బండిమీది కెక్కించినాడు.
  • he put a bold face on it పయికి బహుధైర్యముగా వున్నట్టు నటించినాడు.
  • he put a good face on the matter ` సంగతినిగురించి బయిటికి సహజముగానే వున్నట్టు అగుపరచినాడు.
  • this piety is merely put onయిది పట్టి దొంగభక్తి.
  • they put a slight upon him వాణ్ని అలక్ష్యము చేసినారు.
  • he putout the fire ఆ నిప్పును చల్లార్చినాడు.
  • they put his eyes out వాడి కండ్లనుపొడిచివేసిరి.
  • put out the light ఆ దీపాన్ని ఆర్పివేయుము.
  • మలిపివేయుము,నిలిపివేయుము.
  • he put this matter out of view ఆ సంగతిని దాచినాడు, మరుగుచేసినాడు.
  • If you talk to me while I am writing you will put me out నేనువ్రాసేటప్పుడు మాట్లాడితివంటే నాకు తప్పిపోను.
  • Your coming at that moment putthe matter out of my head ఆ సమయములో నీవు వచ్చినందున ఆ సంగతి నాకుమరిచిపోయినది.
  • he fell and put out his shoulder వాడు పడి భుజము తొలిగినది,కీలు వూడినది.
  • Putting that out of the question దాన్ని విడిచిపెట్టి, దాన్నివిచారించక.
  • he was put out of countenance at this అది వాడికి తలవంపైనది.
  • why do you put yourself out of your way to abuse them ? వాండ్లను తిట్టడానికినీవెందుకు పైన వేసుకొని పోతావు,వాండ్లను తిట్టడానికి నీకేమి పట్టినది.
  • he put himself out of his way to abuse them తాను పైన వేసుకొని పోయి వాండ్లను తిట్టినాడు.
  • heput himself out of his way to serve me నాకు సహాయము చేయడానికి తాను పైనవేసుకొని వచ్చినాడు.
  • he put out his hand చెయి చాచినాడు.
  • he put the money out at interest ఆ రూకలను వడ్డికి వేసినాడు.
  • I put him out in his story వాడు చెప్పే కథనుకలవర పెట్టినాను.
  • he put she cord through the ring ఆ వలయములో తాటినిదూర్చినాడు.
  • he put the horses he put the horses to గుర్రాలను బండికి వేసినాడు,కట్టినాడు.
  • she put her hand to her cheek చెక్కిటచెయి పెట్టుకొన్నది.
  • she put the child to bed but could not put it to sleep ఆ బిడ్డను పండబెట్టినది, దాని నిద్రబుచ్చలేదు.
  • he put the enemy to flight శత్రువులను తరమగొట్టినాడు.
  • పలాయనమయ్యేటట్టు చేసినాడు.
  • he put them to death వాండ్లను చంపినాడు.
  • I put it to you whether this is right యిది న్యాయమో అన్యాయమో సివే చెప్పు.
  • he put them to the sword వాండ్లను నరికినాడు.
  • he put them to the sword వాండ్లను నరికినాడు heput them to silence వాండ్లను నోరెత్తకుండా చేసినాడు, నోరు మూసుకొనేటట్టు చేసినాడు.
  • these words put me to a stand యీ మాటలకు నాకు వొకటీ తోచక మానైపోతిని.
  • when I put all these acts together వీటినంతా కూడా ఆలోచించేటప్పటికి.
  • he put up his sword కత్తిని వరలో వేసినాడు.
  • I could not put up with his conduct వాడి నడక నాకు సరిపడదు.
  • they put him up to do thisదీన్ని చేసేటట్టు వాడికి పుల్లలు పెట్టినారు, పురికొలిపినారు.
  • he put the silk up in paper ఆ పట్టుకు పైన కాకితను వేసి కట్టినాడు.
  • he put up daily prayers for their good వాండ్ల క్షేమమును గురించి నిత్యమున్నుప్రార్థిస్తూ వచ్చినాడు.
  • they put this up to auction దీన్ని వేలానికి పెట్టినారు.
  • they put up a fox నక్కను లేపినారు.
  • they put him upon his trail వాణ్ని విచారణకు తెచ్చిరి.
  • he was much put to it for food అన్నానికి లేక మహా కష్టపడ్డాడు.

క్రియ, నామవాచకం, నడచుట, కదలుట.

  • they put forward బయిలుదేరిరి.
  • the ship put forth or put out to sea ఆ వాడ, లోన సముద్రములోకి పోయినది.
  • the ship put back పోయిన వాడ మళ్ళీ తిప్పుకొని వచ్చినది.
  • where did you put up ? యెక్కడ దిగినావు.
  • I put up with your brothers మీ అన్న యింట్లో దిగితిని.
  • the ship put into this port ఆ వాడ యీ రేవుకు వచ్చినది, యీ రేవును పట్టినది.

నామవాచకం, s, a word of scorn, like fellow, or rascal, bumpkin. క్రియ, విశేషణం, (add,) to put out of pain (meaning) to kill దుఃఖనివారణచేసుట, అనగా చంపుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).