హార్ముజ్ జలసంధి
హార్ముజ్ జలసంధి | |
---|---|
ప్రదేశం | పర్షియన్ సింధుశాఖ – ఒమన్ సింధుశాఖ |
అక్షాంశ,రేఖాంశాలు | 26°34′N 56°15′E / 26.567°N 56.250°E |
రకం | జలసంధి |
స్థానిక పేరు | [[[:మూస:Native name list]]] Error: {{Native name}}: missing language tag (help) (language?) |
ప్రవహించే దేశాలు | ఒమన్, ఇరాన్, యు.ఎ.ఇ |
కనిష్ట వెడల్పు | 21 nautical miles (39 కి.మీ.) |
ద్వీపములు | హార్ముజ్ ద్వీపం కెష్మ్ ద్వీపం |
ప్రాంతాలు | బందర్ అబ్బాస్ ఖసబ్ |
హార్ముజ్ జలసంధి, పర్షియన్ సింధుశాఖకు, ఒమన్ సింధుశాఖకూ మధ్య ఉన్న జలసంధి. ఇది పర్షియన్ సింధుశాఖ నుండి మహాసముద్రాల్లోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం. ఇది వ్యూహాత్మకంగా ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఛోక్ పాయింట్లలో ఒకటి. [1] దీనికి ఉత్తర తీరంలో ఇరాన్, దక్షిణ తీరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముసందమ్, ఒమన్ ఎక్స్‌క్లేవ్‌లు ఉన్నాయి. ఈ జలసంధి దాదాపు 167 కి.మీ. పొడవు, 52 నుండి 21 కి.మీ. వెడల్పు ఉంటుంది. [2]
ప్రపంచంలోని ద్రవీకృత సహజ వాయువులో మూడవ వంతు, మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 25% ఈ జలసంధి గుండా వెళ్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశం. [2] [3]
నావిగేషన్
[మార్చు]ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడానికి, జలసంధి ద్వారా ప్రయాణించే ఓడలు ట్రాఫిక్ విభజన పథకాన్ని (TSS) అనుసరిస్తాయి. లోనికి వచ్చే ఓడలు ఒక మార్గాన్ని, బయటికి వెళ్ళే ఓడలు మరొక మార్గాన్నీ ఉపయోగిస్తాయి. ఈ మార్గాలు ఒక్కొక్కటీ రెండు మైళ్ల వెడల్పుతో ఉంటాయి. ఈ రెండూ మార్గాల మధ్య దూరం రెండు మైళ్ళుంటుంది. [4]
జలసంధిని దాటడానికి, నౌకలు సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం లోని ట్రాన్సిట్ పాసేజ్ నిబంధనల ప్రకారం ఇరాన్, ఒమన్‌ల ప్రాదేశిక జలాల గుండా వెళతాయి. [5] అన్ని దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించనప్పటికీ, [6] అమెరికాతో సహా చాలా దేశాలు, [7] ఈ ఒప్పందం లోని సాంప్రదాయిక నావిగేషన్ నియమాలను అంగీకరిస్తాయి.
1959 ఏప్రిల్‌లో ఇరాన్ తన ప్రాదేశిక జలాల పరిధిని 22 కిలోమీటర్ల వరకు విస్తరించడంతో జలసంధి యొక్క చట్టపరమైన స్థితిని మార్చేసింది. కొత్తగా విస్తరించిన ప్రాంతం గుండా అమాయక ప్రయాణాన్ని మాత్రమే గుర్తిస్తామని ప్రకటించింది. [8] 1972 జూలైలో, ఒమన్ కూడా తన ప్రాదేశిక సముద్రాన్ని 22 కిలోమీటర్ల వరకు విస్తరించింది. [8] ఆ విధంగా, 1972 మధ్య నాటికి, ఇరాన్, ఒమన్‌ల సంయుక్త ప్రాదేశిక జలాలతో హార్ముజ్ జలసంధి పూర్తిగా "మూసుకుపోయింది". 1970వ దశకంలో, ఇరాన్, ఒమన్‌లు జలసంధి గుండా యుద్ధనౌకల ప్రయాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. అయితే 1980లలో, రెండు దేశాలు అమల్లో ఉన్న (పాత) చట్టానికి భిన్నమైన వాదనలు చేసాయి. 1989 ఆగస్టులో UNCLOS ని ఆమోదించిన తర్వాత, ఒమన్ తన ప్రాదేశిక సముద్రం గుండా కేవలం అమాయక ప్రయాణానికి మాత్రమే అనుమతి ఉందని 1981 నాటి రాయల్ డిక్రీని ధృవీకరిస్తూ ప్రకటనలను చేసింది. విదేశీ యుద్ధనౌకలు ఒమానీ ప్రాదేశిక జలాల గుండా వెళ్లాలంటే ముందస్తు అనుమతి అవసరమని ఆ ప్రకటనలు నొక్కిచెప్పాయి. [8] 1982 డిసెంబరులో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఇరాన్, "లా ఆఫ్ ది సీ కన్వెన్షన్‌లో చేరిన పార్టీలు మాత్రమే అందులో సృష్టించబడిన ఒప్పంద హక్కుల నుండి - అంతర్జాతీయ ప్రయాణాలకు ఉపయోగించే జలసంధుల ద్వారా రవాణా హక్కుతో సహా - ప్రయోజనం పొందేందుకు అర్హులు" అని పేర్కొంటూ ఒక ప్రకటన చేసింది. 1993 మేలో ఇరాన్, సముద్ర ప్రాంతాలపై సమగ్ర చట్టాన్ని రూపొందించింది, వీటిలో అనేక నిబంధనలు UNCLOS నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇందులో యుద్ధనౌకలు, జలాంతర్గాములు, అణుశక్తితో నడిచే నౌకలు ఇరాన్ ప్రాదేశిక జలాల గుండా అమాయక ప్రయాణానికి ముందస్తు అనుమతి పొందాలనే నిబంధన కూడా ఉంది. ఒమన్, ఇరాన్ చేసిన దావాలలో దేనినీ అమెరికా గుర్తించలేదు. వాటిని సవాలు చేసింది. [8]
చమురు వాణిజ్య ప్రవాహం
[మార్చు]సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వారి 2007 నివేదిక ప్రకారం, పర్షియన్ సింధుశాఖ నుండి ప్రతిరోజూ 1.7 కోట్ల బారెళ్ళు జలసంధి ద్వారా రవాణా అవుతోందని పేర్కొంది. ఇది, ప్రవహించే మొత్తం ప్రపంచ-వాణిజ్య చమురులో దాదాపు 40% ఉంది. [9]
US ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, 2011 లో పర్షియన్ సింధుశాఖ నుండి రోజుకు సగటున 14 ట్యాంకర్లు 1.7 కోట్ల బ్యారెళ్ళ ముడి చమురు తీసుకుని జలసంధి గుండా ప్రయాణించాయి. ఇది ప్రపంచంలోని సముద్రపు చమురు రవాణాలో 35%. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారమయ్యే చమురులో ఇది 20%. ఈ క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో 85% కంటే ఎక్కువ ఆసియా మార్కెట్లకు వెళ్లాయని, జపాన్, భారతదేశం, దక్షిణ కొరియా, చైనాలు అతిపెద్ద గమ్యస్థానాలనీ ఆ నివేదిక పేర్కొంది. [10] ఒక్క 2018 లోనే, రోజుకు 2.1 కోట్ల బ్యారెళ్ళు జలసంధి గుండా వెళ్ళాయి - అంటే 2019 సెప్టెంబరు ధరల ప్రకారం ఇది రోజుకు $1170 కోట్ల విలువైన చమురు. [11]
ఘటనలు
[మార్చు]ట్యాంకర్ యుద్ధం
[మార్చు]1984 ప్రారంభంలో ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపం వద్ద చమురు టెర్మినల్, చమురు ట్యాంకర్లపై ఇరాక్ దాడి చేయడంతో ఇరాన్-ఇరాక్ యుద్ధపు ట్యాంకర్ యుద్ధ దశ ప్రారంభమైంది. [12][13] ఇరానియన్ వ్యాపారంపై దాడి చేయడంలో సద్దాం హుస్సేన్ లక్ష్యం - ఇతర విషయాలతోపాటు, హార్ముజ్ జలసంధిని అన్ని సముద్ర ట్రాఫిక్‌లకు మూసివేయడం వంటి తీవ్ర చర్యలతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరానియన్లను రెచ్చగొట్టడం, తద్వారా అమెరికా జోక్యం చేసుకునే పరిస్థితి తీసుకురావడం. [14] కానీ, ఇరాన్ తన ప్రతీకార దాడులను ఇరాకీ వాణిజ్య ఓడల వరకే పరిమితం చేసి, జలసంధిని తెరిచే ఉంచింది. [15]
ఆపరేషన్ ప్రేయింగ్ మాంటిస్
[మార్చు]1988 ఏప్రిల్ 18న, US నావికాదళం జలసంధిలోను, ఆ చుట్టుపక్కల ఇరాన్ దళాలకు వ్యతిరేకంగా ఒక-రోజు యుద్ధం చేసింది. 1988 ఏప్రిల్ 14 న యుఎస్‌ఎస్ <i id="mwpA">శామ్యూల్ బి. రాబర్ట్స్</i> నౌకను ఛానెల్‌లో వేసిన ఇరాన్ మందుపాతర దాడి చేసినందుకు ప్రతీకారంగా యునైటెడ్ స్టేట్స్ ఈ యుద్ధం చేసింది. దీన్ని ఆపరేషన్ ప్రేయింగ్ మాంటిస్ అని అన్నారు. US దళాలు ఒక ఫ్రిగేట్, ఒక గన్‌బోట్, ఆరు సాయుధ స్పీడ్ బోట్‌లను ముంచేసాయి. అలాగే మరొక ఫ్రిగేట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఇరాన్ ఎయిర్ 655 విమానం కూల్చివేత
[మార్చు]1988 జూలై 3 న, యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన క్రూయిజర్ USS <i id="mwsQ">విన్సెన్స్</i> (CG-49) క్షిపణి దాడి చేసి ఇరాన్ ఎయిర్‌బస్ A300 ని జలసంధిపై కూల్చివేయగా, అందులో ప్రయాణిస్తున్న 290 మంది మరణించారు. అమెరికా ఈ విమానాన్ని జెట్ ఫైటర్ అని పొరబడి ఈ దాడి చేసింది.
2008 అమెరికా-ఇరాన్ నౌకాదళ వివాదం
[మార్చు]2007 డిసెంబరు - 2008 జనవరిలో హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్‌లు, అమెరికా యుద్ధనౌకల మధ్య వరుస నౌకాదళ ప్రతిష్ఠంభనలు సంభవించాయి. అమెరికా అధికారులు ఇరాన్ తమ నౌకాదళ నౌకలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. అయితే ఇరాన్ అధికారులు ఆరోపణలను ఖండించారు. ఇరాన్ పడవలు సమీపిస్తున్నప్పుడు అమెరికా నౌకలు కాల్పులు జరిపబోయాయని పెంటగాన్ చెప్పగా, అమెరికా నేవీ ప్రాంతీయ కమాండర్, వైస్ అడ్మిరల్ కెవిన్ కాస్గ్రిఫ్, ఇరానియన్ల వద్ద "యాంటీ-షిప్ క్షిపణులు లేదా టార్పెడోలు లేవు" అని, " యుఎస్ 5వ నౌకాదళం ఈ చిన్న పడవలకు భయపడలేద"నీ అన్నాడు. [16]
2018 జలసంధి మూసివేత బెదిరింపులు
[మార్చు]2018 జూలైలో జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరించింది. సంవత్సరం ప్రారంభంలో JCPOA ఒప్పందం నుండి అమెరికా వైదొలిగిన తర్వాత అమెరికా ఆంక్షలను ఉటంకిస్తూ ఇరాన్ ఈ ప్రకటన చేసింది. [17] అవసరమైతే చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. [18]
2018 ఆగస్టులో ఇరాన్ ఆ సంవత్సరపు తొలి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నౌకా విధ్వంసక ఫతే-110 మోడ్ 3 ఇరాన్ ఎడారిలోని టెస్ట్ రేంజ్‌కు హార్ముజ్ జలసంధి మీదుగా 100 మైళ్లకు పైగా దూరం ప్రయాణించింది. "ఇది తీరం నుండి తీరానికి" చేసిన ప్రయోగమని వివరిస్తూ ఒక అమెరికా అధికారి చెప్పారు. [19]
2019 జలసంధి మూసివేత బెదిరింపులు
[మార్చు]2019 ఏప్రిల్ 22 న, అమెరికా ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షలను ముగించింది. ఆర్థిక జరిమానాలు లేకుండా ఇరాన్ నుండి చమురును దిగుమతి చేసుకోవడానికి కొంతమంది వినియోగదారులను అనుమతించింది. 2019 ఏప్రిల్‌లో జలసంధిని మూసివేస్తామనే ఇరాన్ బెదిరింపులు చేసినందున, ఇది జరిగింది. [20]
అల్‌జజీరా ఇరాన్ సాయుధ దళాలకు చెందిన మేజర్ జనరల్ మొహమ్మద్ బఖేరీని ఉటంకిస్తూ, "హార్ముజ్ జలసంధిని మూసివేయాలనేది మా ఉద్దేశం కాదు, కానీ శత్రువుల శత్రుత్వం పెరిగితే, మేము అలా చేయగలం" అన్నట్టు పేర్కొంది. "మా చమురు వెళ్ళకపోతే, ఇతరుల చమురు కూడా హార్ముజ్ జలసంధిని దాటదు" అని కూడా బఖేరీ అన్నాడు.
నౌకాయానానికి ఆటంకం కలిగించగల ఇరాన్ సామర్థ్యం
[మార్చు]మిలీనియం ఛాలెంజ్ 2002 అనేది 2002లో యునైటెడ్ స్టేట్స్ సాయుధ దళాలు నిర్వహించిన ఒక ప్రధాన యుద్ధక్రీడ. 2012 లో ది క్రిస్టియన్ సైన్స్ మానిటర్‌లో వచ్చిన కథనం ప్రకారం, జలసంధిని మూసివేయడానికి ఇరాన్ చేసిన ప్రయత్నాన్ని ఇందులో సిమ్యులేట్ చేసారు. ఈ ఊహలు, వాటి ఫలితాలూ వివాదాస్పదమయ్యాయి. ఇరాన్ వ్యూహం భౌతికంగా ఉన్నతమైన US సాయుధ దళాలను ఓడించిందని ఆ వ్యాసంలో రాసారు. [21]
ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో 2008లో వచ్చిన ఒక కథనం, జలసంధిలో ఒక నెలపాటు ట్రాఫిక్‌ను ఇరాన్ మూసివేయవచ్చని లేదా అడ్డుకోవచ్చని, దానిని తిరిగి తెరవడానికి అమెరికా చేసే ప్రయత్నంలో సంఘర్షణ పెరిగే అవకాశం ఉందనీ రాసింది. [22] అయితే, ఆ తరువాతి సంచికలో, పత్రిక ప్రచురించిన ఒక ప్రతిస్పందనలో, ఈ వ్యాసంలో ఉన్న కొన్ని కీలకమైన అంచనాలను ప్రశ్నించారు. తిరిగి తెరవడానికి చాలా తక్కువ సమయం పడుతుందని కూడా ఆ స్పందనలో రాసారు.
2011 డిసెంబరులో, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నౌకాదళం జలసంధి వెంట అంతర్జాతీయ జలాల్లో పదిరోజుల కసరత్తు ప్రారంభించింది. ఇరానియన్ రియర్ అడ్మిరల్ హబిబొల్లా సయ్యారీ ఈ కసరత్తుల సమయంలో జలసంధి మూసివేమని చెప్పాడు. ఇరాన్ దళాలు ఆ పనిని సులభంగా చేయగలవనీ, అయితే అలాంటి నిర్ణయం రాజకీయ స్థాయిలో తీసుకోవాలనీ అతడు చెప్పాడు. [23] [24]
అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ అయిన జనరల్ మార్టిన్ డెంప్సే 2012 జనవరిలో, ఇరాన్ "వాస్తవానికి, హార్ముజ్ జలసంధిని కొంత కాలం పాటు నిరోధించగల సామర్థ్యాన్ని సాధించింది" అని అన్నాడు. "అదే జరిగితే, మేము దానిని ఓడించగలమని నిర్ధారించుకునేందుకు అవసరమైన సామర్థ్యాన్ని మేము సాధించాం" అని కూడా అతను పేర్కొన్నాడు. [25]
ప్రత్యామ్నాయ మార్గాలు
[మార్చు]జూన్ 2012లో, సౌదీ అరేబియా, సౌదీ అరేబియా - ఇరాక్ పైప్‌లైన్‌ను తిరిగి తెరిచింది. దీన్ని 2001లో ఇరాక్ నుండి సౌదీ అరేబియా జప్తు చేసింది. ఇరాక్ నుండి సౌదీ అరేబియా మీదుగా ఎర్ర సముద్రపు ఓడరేవుకు ఈ పైపులైను ప్రయాణిస్తుంది. దీని ద్వారా రోజుకు 16.5 లక్షల బ్యారెళ్ల రవాణా చెయ్యగల సామర్థ్యం ఉంది. [26]
2012 జూలైలో, UAE అబుదాబిలోని హబ్షాన్ క్షేత్రాల నుండి ఒమన్ సింధుశాఖ లోని ఫుజైరా ఆయిల్ టెర్మినల్ వరకు కొత్త హబ్షాన్-ఫుజైరా చమురు పైప్‌లైన్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది హార్ముజ్ జలసంధిని తప్పిస్తుంది. 2012 లో రోజుకు 20 లక్షల బ్యారెల్స్ సామర్థ్యమున్న UAE ఉత్పత్తిలో ఇది మూడు వంతుల కంటే ఎక్కువ. UAE ఫుజైరా లోని నిల్వ, ఆఫ్-లోడింగ్ సామర్థ్యాలను కూడా పెంచుతోంది. [27] [28] ప్రపంచ చమురు వాణిజ్య స్థావరంగా ఫుజైరా అభివృద్ధిని పెంపొందించడానికి UAE 1.4 కోట్ల బ్యారెళ్ళ నిల్వ సామర్థ్యంతో ఫుజైరాలో ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వ కేంద్రాన్ని నిర్మిస్తోంది. [29] హబ్షాన్ - ఫుజైరా మార్గం UAE యొక్క ఇంధన భద్రతను పెంపొందిస్తుంది. చమురు రవాణాలో చౌకైన రూపంగా భూమార్గ చమురు పైప్‌లైనును పరిగణిస్తారు. చమురు ట్యాంకర్లు పర్షియన్ సింధుశాఖ లోకి వెళ్ళే అవసరం లేనందున బీమా ఖర్చులు కూడా తగ్గుతాయి. [30]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Viktor Katona. "How Iran Plans To Bypass The World's Main Oil Chokepoint". Oilprice.com. Archived from the original on 11 September 2018. Retrieved 2018-09-11.
- ↑ 2.0 2.1 "The Strait of Hormuz is the world's most important oil transit chokepoint". U.S. Energy Information Administration. 4 January 2012. Archived from the original on 11 September 2018. Retrieved 11 September 2018.
- ↑ "2 oil tankers were damaged in possible attacks in the Gulf of Oman". Vox. 13 June 2019.
- ↑ "World Oil Transit Chokepoints" (PDF). U.S. Energy Information Administration. 25 July 2017. Retrieved 13 June 2019.
- ↑ Alejandra Roman & Administration. "Strait of Hormuz". The Encyclopedia of Earth. Retrieved 2015-06-02.
- ↑ "Chronological lists of ratifications of, accessions and successions to the Convention and the related Agreements as at 26 October 2007". Division for Ocean Affairs and the Law of the Sea. UN.
- ↑ . "Presidential Proclamation 5030".
- ↑ 8.0 8.1 8.2 8.3 Groves, Steven (2011-08-24). "Accession to the U.N. Convention on the Law of the Sea Is Unnecessary to Secure U.S. Navigational Rights and Freedoms". The Heritage Foundation. Retrieved 2017-04-09.
- ↑ Anthony H. Cordesman (26 March 2007). "Iran, Oil, and the Strait of Hormuz" (PDF). Center for Strategic and International Studies. Archived from the original (PDF) on 19 మార్చి 2012. Retrieved 14 జూన్ 2022.
- ↑ Alejandra Roman & Administration. "Strait of Hormuz". The Encyclopedia of Earth. Retrieved 2015-06-02.
- ↑ "The Strait of Hormuz Explained". Archived from the original on 2022-06-14. Retrieved 2022-06-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Karsh, Efraim (25 April 2002). The Iran–Iraq War: 1980–1988. Osprey Publishing. pp. 1–8, 12–16, 19–82. ISBN 978-1-84176-371-2.
- ↑ "Strait of Hormuz - Tanker War". The Strauss Center (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-06.
- ↑ Karsh, Efraim (25 April 2002). The Iran–Iraq War: 1980–1988. Osprey Publishing. pp. 1–8, 12–16, 19–82. ISBN 978-1-84176-371-2.
- ↑ Karsh, Efraim (25 April 2002). The Iran–Iraq War: 1980–1988. Osprey Publishing. pp. 1–8, 12–16, 19–82. ISBN 978-1-84176-371-2.
- ↑ Isenberg, David (10 January 2008). "A game of chicken in the, Persian Gulf". Asia Times Online. Archived from the original on 14 May 2008. Retrieved 8 January 2012.
{{cite news}}
: CS1 maint: unfit URL (link) - ↑ Dehghan, Saeed Kamali (5 July 2018). "Iran threatens to block Strait of Hormuz over US oil sanctions". the Guardian (in ఇంగ్లీష్).
- ↑ "Iran's Guards say Strait of Hormuz is for all or". Reuters. Reuters. Retrieved 6 July 2018.
- ↑ "Iran test-fires ballistic missile for first time in 2018, officials say". FoxNews. Retrieved 12 August 2018.
- ↑ |https://www.aljazeera.com/news/2019/04/iran-business-usual-strait-hormuz-blacklisting-190428133314213.htmlAljazeera.|Aljazeera . "Business as usual in Strait of Hormuz after blacklisting". Aljazeera, 2019.
- ↑ Peterson, Scott (26 January 2012). "How Iran could beat up on America's superior military". csmonitor.com.
- ↑ Closing Time: Assessing the Iranian Threat to the Strait of Hormuz Archived 21 ఆగస్టు 2008 at the Wayback Machine, by Caitlin Talmadge, International Security, Harvard Kennedy School
- ↑ "Iranian navy begins exercise in waters near strategic oil route". China Daily. 26 December 2011. Retrieved 8 January 2012.
- ↑ "Shutting Off Gulf 'Very Easy': Iran Navy Chief". CNBC. Reuters. 28 December 2011. Archived from the original on 24 September 2015. Retrieved 8 January 2012.
- ↑ Hunter, Kathleen; Gienger, Viola (8 January 2012). "Iran Has Ability to Block Strait of Hormuz, U.S. General Dempsey Tells CBS". Bloomberg. Retrieved 9 January 2012.
- ↑ Luft, Gal (19 July 2012). "Choke Point". foreignpolicy.com. Archived from the original on 23 జూలై 2012. Retrieved 6 August 2012.
- ↑ Luft, Gal (19 July 2012). "Choke Point". foreignpolicy.com. Archived from the original on 23 జూలై 2012. Retrieved 6 August 2012.
- ↑ "New UAE pipeline bypasses Strait of Hormuz". aljazeera.com. 15 July 2012. Retrieved 27 July 2012.
- ↑ "World's largest crude oil storage facility to be built in UAE". Khaleej Times. 27 February 2019.
- ↑ Gulf News (6 March 2019). "The UAE's longer term approach on energy security".