Jump to content

శాంతాదేవి

వికీపీడియా నుండి
శాంతాదేవి
జననం
దమయంతి

1927 (1927)
కోజికోడ్, కేరళ
మరణం2010 నవంబరు 20
కోజికోడ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1954–2010
జీవిత భాగస్వామిబాలకృష్ణన్‌ (విడాకులు)
కోజికోడ్ అబ్దుల్ కాదర్‌

శాంతాదేవి (1927 - 2010 నవంబరు 20) కేరళ రాష్ట్రానికి చెందిన నాటకరంగ, సినిమా నటి.[1] సుమారు అరవై ఏళ్ళ నటనా జీవితంలో 1000 కంటే ఎక్కువ నాటకాలు, సుమారు 480 సినిమాలలో నటించింది.[2] ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు, కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డులతోపాటు పలు అవార్డులు అందుకుంది.

జననం, విద్య

[మార్చు]

శాంతా దేవి కోజికోడ్‌లో అప్పటికి ప్రసిద్ధి చెందిన తొట్టతిల్ అనే తరవడులో 1927లో తొట్టతిల్ కన్నక్కురుప్పు - కార్తియాయని దంపతులకు 10 మంది పిల్లలలో ఏడవ కుమార్తెగా జన్మించింది. సభా పాఠశాల, తరువాత బిఈఎం పాఠశాల నుండి తన విద్యను అభ్యసించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

18 ఏళ్ళ వయసులో రైల్వేగార్డు, తన మేనమామ కుమారుడైన బాలకృష్ణన్‌తో శాంతాదేవి వివాహం జరిగింది. వారికి కుమారులు పుట్టిన తరువాత వారు విడాకులు తీసుకున్నారు.[3] ఆ తరువాత, ప్రముఖ మలయాళ సినీ గాయకుడు కోజికోడ్ అబ్దుల్ కాదర్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు (సురేష్ బాబు, దివంగత సత్యజిత్).[4]

అవార్డులు, సన్మానాలు

[మార్చు]
  • 1978: కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు
  • 2003: కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్[5][6]
  • 1992: యమనం సినిమాకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు[7]
  • 1968: కుదుక్కుకల్‌ నాటికలో తన పాత్రకు కేరళ రాష్ట్ర ఉత్తమ రంగస్థల నటిగా అవార్డు
  • 1968: త్రిస్సూర్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అవార్డు
  • 1973: ఉత్తమ నటి అవార్డు
  • 1978: ఇటు భూమియను, ఇంక్విలాబింటే మక్కల్‌ లలో నటనకు ఆమె కేరళ సంగీత నడక అకాడమీ ఉత్తమ నటి అవార్డు
  • 1979: కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
  • 1983: దీపస్తంభం మహాశ్చర్యం నాటకం రాష్ట్ర నాటకాలలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డు[8]
  • 1992: ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
  • 2005: కేరళ సంగీత నాటక అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం
  • :శాంతాదేవికి ప్రేమ్‌జీ అవార్డు
  • :కర్నాటక నుండి అత్తిమబ్బే బహుమతి

టెలివిజన్ (కొన్ని)

[మార్చు]
  1. మానసి (డిడి మలయాళం)
  2. పెన్నూరిమై (డిడి మలయాళం)
  3. మిన్నుకెట్టు (సూర్య టీవీ)
  4. మనస్సరియతే (సూర్య టీవీ)
  5. కాయంకుళం కొచ్చున్ని (సూర్య టీవీ)
  6. అలీ మంత్రికన్
  7. ఎన్నపదం
  8. శకునం (డిడి మలయాళం)
  9. వధు - టెలిఫిల్మ్
  10. విద్యారంభం - టెలిఫిల్మ్
  11. పుతియాప్లక్కుప్పాయమ్ - టెలిఫిల్మ్
  12. కన్నుకల్ - టెలిఫిల్మ్
  13. కుంచతుమ్మ - టెలిఫిల్మ్

నాటకాలు (కొన్ని)

[మార్చు]
  • కుడుక్కుకల్
  • స్మారకం
  • దీపస్తంభం మహాఆశ్చర్యం
  • ఇంక్విలాబింటే మక్కల్
  • ఇటు భూమియన్ను
  • పెడిస్వప్నం

మరణం

[మార్చు]

శాంతాదేవి 2010 నవంబరు 20న సాయంత్రం కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Manorama Online | Movies | Nostalgia |". Archived from the original on 2 December 2013. Retrieved 26 November 2013.
  2. "നടി കോഴിക്കോട് ശാന്താദേവി അന്തരിച്ചു". Malayala Manorama. Archived from the original on 7 March 2012. Retrieved 2010-11-21.
  3. "Mathrubhumi Eves - features,articles,ഒറ്റപ്പെടലിന്റെ വേദനയില്‍ ശാന്താദേവി". Archived from the original on 11 August 2010. Retrieved 2013-12-11.
  4. "ശാന്താദേവി വൃദ്ധസദനത്തിന്റെ തണലില്‍ - articles,features - Mathrubhumi Eves". Archived from the original on 19 January 2014. Retrieved 2013-12-11.
  5. "Kerala Sangeetha Nataka Akademi Award: Drama". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
  6. "Kerala Sangeetha Nataka Akademi Fellowship: Drama". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 25 February 2023.
  7. "Friday Review Thiruvananthapuram / Interview : Natural actor". The Hindu. 2007-06-08. Archived from the original on 2010-11-23. Retrieved 2010-08-23.
  8. "നടി കോഴിക്കോട് ശാന്താദേവി അന്തരിച്ചു". Malayala Manorama. Archived from the original on 7 March 2012. Retrieved 2010-11-21."നടി കോഴിക്കോട് ശാന്താദേവി അന്തരിച്ചു". Malayala Manorama. Archived from the original on 7 March 2012. Retrieved 21 November 2010.
  9. "Veteran Malayalam actress Shanta Devi dies". .bombaynews.net. 20 November 2010. Archived from the original on 22 November 2010. Retrieved 20 November 2010.

బయటి లింకులు

[మార్చు]