ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
స్వరూపం
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | World Day Against Child Labour (WDACL) |
జరుపుకొనేవారు | ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు |
ప్రాముఖ్యత | బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని ప్రతి యేటా నిర్వహిస్తున్నారు. |
జరుపుకొనే రోజు | జూన్ 12 |
వేడుకలు | ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.[1][2]
ప్రారంభం
[మార్చు]బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంను ప్రారంభించింది.
లక్ష్యాలు
[మార్చు]- అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడం.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం.[3]
కార్యక్రమాలు
[మార్చు]ప్రతి సంవత్సరం జూన్ 12న, బాల కార్మికుల దుస్థితిని హైలైట్ చేసి వారికి ఏమి సహాయం చేయవచ్చో చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రభుత్వాలు, యజమానులు, కార్మికుల సంస్థలు, పౌర సమాజం, అలాగే లక్షలాది ప్రజలను ఏకవేదిక మీదికి తెస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, మహబూబ్ నగర్ (12 June 2017). "బాల్యం.. ఛిద్రం!". Archived from the original on 12 June 2019. Retrieved 12 June 2019.
- ↑ సాక్షి, జాతీయం (12 June 2016). "బలవుతున్న బాల్యం." Archived from the original on 12 June 2019. Retrieved 12 June 2019.
- ↑ https://www.jagranjosh.com/current-affairs/telugu-world-day-against-child-labour-observed-globally-1434352618-3[permanent dead link]