పారుపల్లి కశ్యప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పారుపల్లి కశ్యప్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంపారుపల్లి కశ్యప్
జననం (1986-09-08) 1986 సెప్టెంబరు 8 (వయసు 38)
నివాసముహైదరాబాద్
ఎత్తు5 అ. 8 అం. (1.73 మీ.)
దేశంభారతదేశం
వాటంకుడి
పురుషుల సింగిల్స్
అత్యున్నత స్థానం6 (14 మార్చి 2013)
ప్రస్తుత స్థానం14 (15 ఆగస్టు 2013)
BWF profile

పారుపల్లి కశ్యప్ (జననం: 08-09-1986) భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇతని తల్లిదండ్రులు ఉదయ్ శంకర్, సుభద్ర. ఇతను గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు, ఈ అకాడమీ భారత అథ్లెట్స్ ఒలింపిక్ గోల్డ్ సాధించాలనే ఉద్దేశ్యంతో స్థాపించబడినది.

కెరీర్

[మార్చు]

ప్రారంభ కెరీర్ (1997-2004)

[మార్చు]

11 ఏళ్ల క్రితం పారుపల్లి కశ్యప్ హైదరాబాద్ లో ఎస్.ఎం.ఆరిఫ్ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో మొదట చేరాడు. కశ్యప్ తండ్రి ఉద్యోగస్తుడు, ఆయన బదిలీ అయినప్పుడు వారి కుటుంబం కూడా మారుతూ ఉండేది. వీరు బెంగుళూర్ కి మారినపుడు కశ్యప్ "పడుకొనే అకాడమీ"లో చేరాడు. 2004 లో వారు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కొద్దికాలం కశ్యప్ ఆస్తమాకు గురై కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. 2000-03 సమయంలో బెంగుళూరులో వీరు ఉన్నప్పుడు ఇతనికి ఆ వాతావరణం పడక ఇలా అయ్యుంటుందని భావించారు. రోగనిర్ధారణతో తను విస్మయానికి గురై తన క్రీడా జీవితం ముగిసిపోతుందేమోనని భావించాడు, కానీ ఈ సమస్యను అధిగమించాలని సంకల్పించుకొని చాలా చాలా ప్రయత్నాలు చేశాడు. తగిన మందులు ఉపయోగించడంతో తన పరిస్థితి సమూలంగా మెరుగయ్యింది. తరువాత పూర్వ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బాడ్మింటన్ ఛాంపియన్ పుల్లెల గోపీచంద్ చే నిర్వహించబడుతున్న "గోపిచంద్ అకాడమీ"లో తన శిక్షణను కొనసాగించాడు.

ప్రొఫెషనల్ కెరీర్ (2005-ప్రస్తుతం)

[మార్చు]

2005లో కశ్యప్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించి నేషనల్ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో బాలుర సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. 2006 నుండి ఇతను అంతర్జాతీయ టోర్నమెంట్లలో కనిపించటం ప్రారంభమైంది. ఆ సంవత్సరం హాంగ్ కాంగ్ ఓపెన్ లో ఇతను ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో అప్పటి ప్రపంచ నెంబర్ 19 "ప్రీజీమీస్లా వాచ" ను ఓడించాడు, అయినప్పటికి ఇతను తదుపరి రౌండ్లో ఓడిపోయాడు. కొన్ని నెలల తరువాత ఇతను సెమీఫైనల్స్ కు చేరుకొని బిట్‌బర్గర్ ఓపెన్ లో మళ్ళీ వాచ ను ఓడించాడు. 2006లో తన ప్రపంచ ర్యాంకింగ్ 100 నుండి 64 కు అభివృద్ధి చెందింది.

2014 కామన్వెల్త్ గేమ్స్

[మార్చు]

32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో కశ్యప్ 21-14, 11-21, 21-19తో డెరెక్ వోంగ్ (సింగపూర్) పై గెలిచాడు. 1982లో సయ్యద్ మోడీ తరువాత కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారుడిగా కశ్యప్ ఘనత సాధించాడు.[1] ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా కశ్యప్ కు 25 లక్షల రూపాయల నగదును నజరానా గా ప్రకటించాడు. అలాగే హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) తరపున కశ్యప్ కు లగ్జరీ కారును బహుమతిగా అందించనున్నట్లు హెచ్‌డీబీఏ అధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించాడు.

గురువును మించిన శిష్యుడు

[మార్చు]

కశ్యప్ గురువు పుల్లెల గోపిచంద్, 1998 కౌలాలంపూర్ గేమ్స్ లో గోపిచంద్ కాంస్యం సాధించగా 2014 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల సింగిల్స్ లో కనక పతకాన్ని నెగ్గి తన కోచ్ ఆశయాన్ని నిజం చేస్తూ పురుషుల సింగిల్స్ లో స్వర్ణ పతకాన్ని నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 04-08-2014 మొదటి పేజి (కశ్యప్.. గోల్డెన్ రికార్డు)