Jump to content

నేహా శర్మ

వికీపీడియా నుండి
నేహా శర్మ
జయంతాభాయ్ కి లవ్ స్టోరీ ప్రోమో లాంచ్‌లో నేహా శర్మ
జననం (1987-11-21) 1987 నవంబరు 21 (వయసు 37)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007 – ఇప్పటి వరకు
తల్లిదండ్రులుఅజిత్ శర్మ (తండ్రి)
బంధువులుఆయిషా శర్మ (సోదరి)

నేహా శర్మ (జననం 1987 నవంబరు 21) ప్రముఖ భారతీయ నటి, మోడల్. నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రాం చరణ్ సరసన నటించింది ఇది 2007లో విడుదల అయింది. నేహా శర్మ కుర్రాడు (2009) సినిమాలో కూడా నటించింది. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నేహా శర్మ 1987, నవంబరు 21 న బీహార్ లోని భాగల్పూర్లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. భగల్పుర్ అసంబ్లీ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఎ గా ఎన్నిక అయ్యాడు. నేహా శర్మ బీహార్ లోని మౌంట్ కర్మెల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది[2][3]. ఈమె చిన్నప్పుడు ఆస్తమ వ్యాధితో బాధపడింది, అప్పుడు హైదరాబాద్ కి చెందిన కుటుంబం ఆ వ్యాధి నయం అవడానికి సహాయపడింది.

చిత్ర సమాహారం

[మార్చు]
సంవత్సరం చలన చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతరములు
2007 చిరుత[4] సంజన తెలుగు
2009 కుర్రాడు హేమ తెలుగు
2010 క్రూక్: ఇట్స్ గుడ్ టు బి బ్యాడ్ సుహాని హిందీ
2012 తేరి మేరి కహాని మీరా హిందీ అతిథి పాత్ర
2012 క్యా సూపర్ కూల్ హై హం సిమ్రన్ హిందీ
2013 జయన్తభాయ్ కి లవ్ స్టొరీ సిమ్రన్ హిందీ
2013 యమల పగల దీవానా 2 సుమన్ ఖాన్ హిందీ
2014 యన్గిస్తాన్ అన్వితా చౌహాన్ హిందీ
2016 క్రిటి క్రిటి హిందీ చిన్నచిత్రం
2016 క్షుఅన్జమ్గ్ హిందీ, మాండరిన్
2016 తుం బిన్ II తారన్ హిందీ
2017 ముబారకన్ అతిథి పాత్ర హిందీ చిత్రం

మూలాలు

[మార్చు]
  1. "Acting and looks don't help, only box office does: Neha Sharma". Retrieved 18 January 2014.
  2. Sharma, Neha (9 September 2012). "Neha Sharma Albums". Neha Sharma. Archived from the original on 16 సెప్టెంబరు 2012. Retrieved 9 September 2012.
  3. Kashyap, Pooja (2 October 2010). "'Serial kisser' arrives in city to promote crook". The Times of India. Retrieved 31 May 2016.
  4. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.

ఇతర లింకులు

[మార్చు]