Jump to content

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్

వికీపీడియా నుండి
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్
సంకేతాక్షరంNIC
స్థాపన1976 (48 సంవత్సరాల క్రితం) (1976)
రకండిజిటల్ సమాచారం
ప్రధాన
కార్యాలయాలు
న్యూఢిల్లీ
కార్యస్థానం
  • పాన్ ఇండియా
సేవా ప్రాంతాలుభారతదేశం
అధికారిక భాషఇంగ్లీష్
డైరెక్టర్ జనరల్రాజేష్ గేరా[1]
మాతృ సంస్థమినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
బడ్జెట్11.5 బిలియను (US$140 million) [2]
సిబ్బంది4500 (May 2018)[3]
జాలగూడుwww.nic.in

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (నిక్ లేదా ఎన్ఐసి) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) ఆధ్వర్యం లో నడిచే సంస్థ.[4]

ప్రభుత్వానికి ఐటి సేవలను అందించడం, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను నిర్వహించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించడం నిక్ ప్రధాన బాధ్యత.[5]

చరిత్ర

[మార్చు]

NIC ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1976 లో స్థాపించబడింది.[6] 1990లలో భారత ప్రభుత్వానికి సమాచార సాంకేతికతను అందిచడం కోసం ఈ సంస్థ కృషి చేసింది.[7] ఇ-గవర్నెన్స్‌ ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియచెప్పడం కూడా ఈ సంస్థ చేస్తున్న పనులలో ఒకటి.[8]

దీని వార్షిక బడ్జెట్‌ (2018–19 సంవత్సరానికి) 1150 కోట్ల రూపాయలు.[9]

మౌలిక సదుపాయాల నిర్మాణము

[మార్చు]

జాతీయ నెట్ వర్క్

[మార్చు]

NIC ను 1976లో భారత ప్రభుత్వ ప్రణాళికా సంఘం స్థాపించినప్పుడు, అప్పట్లో అదనపు కార్యదర్శి దివంగత డాక్టర్ ఎన్. శేషగిరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా "నిక్నెట్" (NICNET) అనే నెట్‌వర్క్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.[10] నిక్నెట్ 1990 లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో , కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశ జిల్లా పరిపాలనల మంత్రిత్వ శాఖలు / విభాగాలతో సంస్థాగత సంబంధాలను సులభతరం చేసింది[10]

NIC ఇ-గవర్నెన్స్‌ కు సంబంధించిన అనేక సదుపాయాలను, అప్లికేషన్లను అందుబాటులోనికి తెచ్చింది.[11]

డేటా సెంటర్లు

[మార్చు]

NIC కొత్త ఢిల్లీ, హైదరాబాదు, పూనా, భువనేశ్వర్ లలో నాలుగు ప్రధాన డేటా సెంటర్లను నిర్వహిస్తుంది. 2018 లో భువనేశ్వర్ లో ప్రారంభమైన డేటా సెంటర్ అన్నింటిలోనూ నూతనమైనది. ఇవి కాకుండా 36 స్టేట్ సెంటర్లను అన్ని రాష్త్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహిస్తుంది.[12][5] దీనికి 708 జిల్లా కార్యాలయాలు అనుబంధంగా ఉన్నాయి.[5]

జాతీయ పోర్టల్

[మార్చు]

NIC India.gov.in భారత దేశ జాతీయ పోర్టల్ ను నిర్వహిస్తుంది. ఈ పోర్టల్‌లో భారత రాజ్యాంగం, ఇతర భారత ప్రభుత్వ సమాచారం, ప్రభుత్వ సేవలను పొందటానికి కావల్సిన ఏకగవాక్ష (సింగిల్ విండో) సదుపాయాలు లభ్యం అవుతాయి.

మూలాలు

[మార్చు]
  1. "Shri Rajesh Gera joins as Director General, National Informatics Centre (NIC)". Press Information Bureau. 1 June 2022. Retrieved 1 June 2022.
  2. Government (2019), p. 324.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; DC4 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Malwad, N. M. (1996). Digital Libraries: Dynamic Storehouse of Digitized Information : Papers Presented at the SIS '96 15th Annual Convention and Conference 18-20 January, 1996 Bangalore. Taylor & Francis. ISBN 978-81-224-0898-0.
  5. 5.0 5.1 5.2 "District offices | National Informatics Centre". www.nic.in. Retrieved 2020-04-24.
  6. May 29, Bangalore; May 29, 2013UPDATED:; Ist, 2013 02:00. "Padma Bhushan N. Seshagiri, founder director-general of NIC, dies at 73". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-04-24. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  7. "Digital India over the decades". Voice&Data. 2017-03-22. Retrieved 2020-04-24.
  8. Bhattacharya, Jaijit (2006). Technology In Government, 1/e. Jaijit Bhattacharya. ISBN 978-81-903397-4-2.
  9. "Wayback Machine" (PDF). web.archive.org. 2019-11-05. Archived from the original on 2019-11-05. Retrieved 2020-04-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. 10.0 10.1 M.R., Bhagavan (1997). New Generic Technologies in Developing Countries. London & New York:: Macmillan & St. Martin. ISBN 978-0-333-65049-3.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  11. Desk, Alt News (2017-08-11). "Is GOI's National Informatics Centre also culpable for Abhinav Srivastav's Aadhaar data hack incident?". Alt News. Archived from the original on 2019-03-28. Retrieved 2020-04-24.
  12. "Ravi Shankar Prasad inaugurates NIC Command & Control Centre to support cloud, data infra". Express Computer. 2019-01-14. Retrieved 2020-04-24.

వనరులు

[మార్చు]