Jump to content

కిటికీ

వికీపీడియా నుండి
View from window in Fort Sam Houston, Texas
Woven bamboo window of the Joan tea house in Inuyama

కిటికీ లేదా గవాక్షం (Window) అనగా ఒక ఇంటికి గల గోడలో ఉంచిన ఖాళీ ప్రదేశం. వీని ద్వారా కాంతి ప్రసరిస్తుంది. గాలి లోపలికి రావాలంటే కిటికీ తెరవాల్సి వుంటుంది. ఇవి సాధారణంగా ఫ్రేము కట్టిన అద్దాలతో కప్పబడి ఉంటాయి. ఈ ఫ్రేములు కలపతో గాని, లోహాలతో గాని తయారుచేస్తారు.

కిటికీల ముందున దోమ తెరల వంటి వలలను బిగించి కీటకాలు లోనికి రాకుండా కొంతమంది జాగ్రత్త పడతారు. వర్షం నీరు లోపలికి రాకుండా కిటికీల పైభాగంలో స్లాబు వేస్తారు. కిటికీ లో ఉన్న రకరకాల ఫీచర్స్ , సాంకేతికతతో కిటికీలను అమర్చడం లో మన్నిక , ఇంటికి

శోభను ఇస్తాయి .కొత్త కిటికీలను ఎంచుకునేటప్పుడు, ఫ్రేమ్ మెటీరియల్స్, గ్లేజింగ్ లేదా గ్లాస్ ఫీచర్లు, గ్యాస్ ఫిల్స్, స్పేసర్ లు పరిగణనలోకి తీసికొనవలెను.[1]

అవలోకనం

[మార్చు]

ఆర్కిటెక్చర్ చరిత్ర కూడా కిటికీల చరిత్రే" అని ఆధునిక వాస్తుశిల్పానికి స్విస్-ఫ్రెంచ్ మార్గదర్శకుడు లె కోర్బుసియర్ అన్నాడు. 'వాస్తుశిల్ప చరిత్ర వెలుగు కోసం జరిగిన పోరాట చరిత్ర'. అనిపేర్కొంటాడు. కిటికీలు 'ఇంటి కళ్లు' అని ఒక జర్మన్ భాష సామెత. ఆధునిక  కిటీకీల చరిత్రలో  గాజు  ఫ్రేమ్ మాత్రమే కాదు, ఒక సంక్లిష్టమైన నిర్మాణం, కేవలం దృశ్యాలను మాత్రమే అందిస్తుంది. ఆధునిక వాస్తుశిల్పంలో కిటీకీలకు  సాంకేతిక అంశాలు ప్రభావితమవుతాయి.,పురాతన చైనా, కొరియా, జపాన్ లు కాగితపు కిటికీలను విస్తృతంగా ఉపయోగించగా, రోమన్లు క్రీ.శ 100 ప్రాంతంలో కిటికీలకు గాజును ఉపయోగించారు. ఇంగ్లాండులో 17 వ శతాబ్దం ప్రారంభంలో గాజు  రాకముందు జంతు కొమ్మును వాడేవారు. కలపలో ఫ్రేమ్ లు తయారు చేసి, గాజుకు సరిపోయే విధంగా కిటికీలు చిన్నవిగా ఉండేవి. జార్జియన్ కాలంలో గాజు అద్దాలతో కిటికీలు సర్వసాధారణంగా మారాయి. ఇవి ఎక్కువగా కొన్ని చారిత్రాత్మక భవనాలలో సాష్ విండో శైలులలో ఇప్పటికీ చూడవచ్చు.

గాజుల తయారీలో ప్రారంభము లో 1848 సంవత్సరంలో ఇంజనీర్ హెన్రీ బెస్సెమర్ పేటెంట్ పొందాడు. అతను 1843 లో "ఫ్లోట్ గ్లాస్" ప్రారంభ రూపాన్ని కూడా ప్రవేశపెట్టాడు, దీనిలో ద్రవ టిన్కు గాజును పోయడం కూడా ఉంది, దీనిని పిల్కింగ్టన్ అనే సంస్థ మెరుగుపరిచింది, అతను 20 వ శతాబ్దం మధ్యలో విప్లవాత్మక ఫ్లోట్ గ్లాస్ ప్రక్రియను కూడా అభివృద్ధి చేశాడు. దీంతో మోడ్రన్ స్టైల్ ఫ్లోర్ టు సీలింగ్ కిటికీలు సాధ్యమయ్యాయి.

సీల్డ్ డబుల్ గ్లేజ్డ్ యూనిట్ కోసం మొదటి పేటెంట్ 1930 లలో యుఎస్ లో ఉంది. 1973 లో యూరోపియన్ చమురు సంక్షోభం తరువాత, ప్రభుత్వాలు భవన నిబంధనలను మార్చాయి, కొన్ని దేశాలు భవన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి గ్రాంట్లు, చౌకైన రుణాలను అందిస్తున్నాయి, వీటిలో డబుల్ గ్లేజ్డ్ కిటికీలు ఉన్నాయి.

ప్రస్తుతం డబుల్ గ్లేజ్డ్ కిటికీలు ,తలుపులు సాధారణం, ట్రిపుల్ గ్లేజింగ్ ఆస్ట్రేలియా దేశం లో కూడా వాడుతున్నారు. బలంగా కిటికీలు, తలుపుల కొరకు ఫ్రేమ్ మెటీరియల్స్ కలప, కరిగిన అల్యూమినియం, యుపివిసి, కలప-అల్యూమినియం ముడిసరుకుల మిశ్రమాలతో కిటీకిలను తయారు చేస్తున్నారు.

సాంకేతికంగా అభివృద్ధి చెందిన టిల్ట్ అండ్ టర్న్ కిటికీలు , లిఫ్ట్-స్లైడ్ డోర్లు జర్మనీలో రావడం జరిగింది. అవి బ్రిటన్ కు , ఇతర దేశాలతో పాటు యుఎస్, చైనాలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. 1990 లో ఆస్ట్రేలియా లో మొదటి ట్రిపుల్ గ్లేజ్డ్ కిటీకీలు, టర్న్ విండోస్ ను తయారు చేసారు. ఈ ట్రిపుల్ గ్లేజ్డ్ విండోలు ఆస్ట్రేలియాలో ఎక్కువగా స్థానిక పదార్థాలతో స్థానికంగా తయారు చేయబడినవి , అవి ఏ కిటీకాలకైనా అత్యధిక శక్తి సామర్థ్యం ను కలిగి ఉంటాయి.[2]

అభివృద్ధి

[మార్చు]

ఒక  ఇంటి కిటికీలను ఉత్తమంగా అలంకరించే వాటిలో  గాజు ను పెట్టడం, కలప తో కిటికీ సరిఅయిన దిశలలో పెట్టడం తో ఆ ఇంటి ఎత్తు, రూపకల్పన( డిజైన్), నిర్మాణ సామగ్రి వంటి పై ఆధారపడి ఉంటాయి.గృహమునకు  అంతటా వేర్వేరు కిటికీల కోసం వివిధ రకాలవాటిని ( గ్లేజింగ్ను)  ఎంచుకోవడం ద్వారా ఆ ఇంటి వారు  ప్రయోజనం పొందవచ్చు. కిటికీలు  ఆ ఇంటిలో వారిని బయటి ప్రపంచంతో అనుసంధానిస్తాయి. వాటితో  స్ఫూర్తి , ప్రకృతిని ఆస్వాదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటికి ప్రక్కృతి పరంగా వచ్చే వెలుతురు పొంది , విద్యుత్ వినియోగం తగ్గించి , పర్యావరణమును రక్షించ వచ్చు.  సహస్రాబ్దాలుగా  కిటికీలను ప్రజలు వివిధ నిర్మాణ శైలిలో వాడటం జరిగింది, అవి వివిధ రూపాల్లో కొందరు గాజు, కలప కిటికీలను వాడటం జరిగింది.[3]

క్రీ.శ 43 నుండి 409 వరకు ఇంగ్లాండులో రోమన్లు కిటికీలలో చిన్న గాజు ముక్కలను ఉపయోగించారు.

క్రీ.శ 410 - 1065 మధ్య యుగాలు కిటికీల గురించి ఎక్కువ ఆధారాలను అందించలేదు, కాని ప్రారంభ గాజు సాంకేతికతను ఉపయోగించిన కాలానికి చెందిన సాక్సన్ చర్చిలు ఉన్నాయి.

క్రీ.శ 1066 నుండి 1215 వరకు చర్చిలు, కొన్ని బలమైన భవనాలు, కోటలు మొదలైన వాటిలో గాజును వాడారు.

క్రీ.శ. 1216-1398 మధ్య యుగాలలో గోతిక్ ,ప్రారంభ ఆంగ్ల చర్చి వాస్తుశిల్పం ప్రవేశపెట్టబడింది, ఇందులో చిన్న సీసం అద్దాలతో కూడినవి, పెద్ద కిటికీల వరకు ఉన్నాయి.

క్రీ.శ. 1399 - 1484 మధ్య యుగాల చివరిలో లంబ గోతిక్, బారోక్ శైలులను ప్రవేశపెట్టారు, ఇవి అత్యంత అలంకరణ, సంక్లిష్టమైన శైలులు గా ఉండేవి, దీని పైభాగంలో తోరణాల రూపంలో ఇవి మునుపటి కిటికీలకు భిన్నంగా ఉంటాయి. ప్రారంభ గోతిక్ ఆర్చ్ లు 'రెండు కేంద్రీకృత' పొడవైన తోరణాలు కాగా, తరువాతి లంబ రూపం తక్కువ 'నాలుగు కేంద్రీకృత' ఆర్చ్ ను కలిగి ఉంది.

క్రీ.శ. 1485 - 1602, కాలంలో, చర్చి / రాజ / సైనిక ప్రాంతాల నుండి దేశీయ భవనాల వైపు గణనీయమైన భవన విస్తరణ లో కిటికీలను పెట్టే వారు. .

1603 - 1713, సమయం లో తక్కువ నిర్మాణ అభివృద్ధిని చూపించింది, ఇందుకు కారణం  ఈ యుగం  ప్రధానంగా యుద్ధంపై దృష్టి పెట్టడం.  1666 లో గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ పెద్ద ఎత్తున పునర్నిర్మాణం అవసరమైంది, నియో-క్లాసికల్ శైలిని ప్రవేశపెట్టింది, దీనికి  ఉదాహరణ, క్రిస్టోఫర్ రెన్ (సెయింట్ పాల్స్ కేథడ్రల్) నిర్మాణం .

క్రీ.శ 1714 - 1836 వరకు నియో క్లాసికల్ శైలులు కొనసాగాయి. కలప జాలిక (ఆస్ట్రగల్స్) లో పెద్ద  స్పష్టంగా ఉండే  అద్దాలను ఉపయోగించే వారు

క్రీ.శ 1837-1901 వరకు విక్టోరియన్ కిటికీలు, పెద్ద అద్దాలతో,  తక్కువ ఆస్ట్రగల్స్ ను ఉపయోగించారు.  జార్జియన్,విక్టోరియన్ కాలంలో, కిటికీలు కలిగిన గృహ నివాసాల సంఖ్యలో  పెరుగుదల కనిపించింది.[4]


కిటికీలలో రకాలు

[మార్చు]
  • గోడలకు బిగించే కిటికీలు:
  • డాబాకు బిగించే కిటికీలు:

Blind with horizonal slats

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Window Types and Technologies". Energy.gov (in ఇంగ్లీష్). Retrieved 2021-07-19.
  2. Doors, Paarhammer Windows and. "Paarhammer - History of Windows". www.paarhammer.com.au (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  3. Team, The Lifetime (2022-05-31). "A Brief History Of Home Windows - Lifetime Windows". Lifetime Windows & Siding (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  4. "A Brief History of Windows". British Plastics Federation (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.