Jump to content

కప్ప

వికీపీడియా నుండి

కప్ప
White's Tree Frog (Litoria caerulea)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
అనూర

Merrem, 1820
Suborders

Archaeobatrachia
Mesobatrachia
Neobatrachia
-

ప్రపంచంలో కప్పల విస్తరణ (నలుపు రంగు)

కప్ప లేదా మండూకం శాలూకము (ఆంగ్లం: frog) అనూర (గ్రీకు భాషలో "తోక-లేకుండా", an-, లేకుండా oura, తోక), క్రమానికి చెందిన ఉభయచరాలు.

కప్ప లేదా మండూకం శాలూకము (ఆంగ్లం: frog) అనూర (గ్రీకు భాషలో "తోక-లేకుండా", an-, లేకుండా oura, తోక), క్రమానికి చెందిన ఉభయచరాలు.

కప్ప

కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు, తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో గుడ్లు పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి. అభివృద్ధి చెందిన కప్పలు సర్వభక్షకాలు (carnivorous) గా జీవిస్తూ ఆర్థ్రోపోడా, అనెలిడా, మొలస్కా జీవులను తిని జీవిస్తాయి. కప్పలను వాటి యొక్క బెకబెక శబ్దాల మూలంగా సుళువుగా గుర్తించవచ్చును.

కప్పలు ప్రపంచమంతటా ముఖ్యంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలో ఎక్కువగా విస్తరించాయి. అయితే ఎక్కువ జాతులు అరణ్యాలలో కనిపిస్తాయి. కప్పలలో సుమారు 5,000 జాతులు గుర్తించారు. సకశేరుకాలు (vertebrate) అన్నింటిలోను విస్తృతమైన జీవన విధానం కలిగివుండే జీవులు ఇవి. వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి.

సామాన్య లక్షణాలు

[మార్చు]
కప్ప "అటెలోపస్ ఫ్రాన్సిస్కస్" తల, ఉపరితల రెండరింగ్, చెవి భాగాలు హైలైట్ చేయబడ్డాయి.
మగవారి ప్రకటన కాల్ అటెలోపస్ ఫ్రాన్సిస్కస్
కామన్ టోడ్ స్విమ్మింగ్
కామన్ టోడ్ (బుఫో బుఫో) ఈత.
  • ప్రౌఢదశలో తోక లోపించిన విజయవంతమైన ప్రత్యేక ఉభయచరాలు.
  • పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. అంగుళ్యాంతజాలం గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
  • ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
  • కర్ణభేరి, కనురెప్పలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  • తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
  • బాహ్య ఫలదీకరణ.

వర్గీకరణ

[మార్చు]