ఓం ప్రకాష్ కోహ్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓం ప్రకాష్ కోహ్లీ
ఓం ప్రకాష్ కోహ్లీ


పదవీ కాలం
16 జులై 2014 – 15 జులై 2019
ముందు మార్గరెట్ అల్వా
తరువాత ఆచార్య దేవ్ వ్రత్

మధ్య ప్రదేశ్ గవర్నర్‌
పదవీ కాలం
8 సెప్టెంబర్ 2016 – 19 జనవరి 2018
ముందు రామ్ నరేష్ యాదవ్
తరువాత ఆనందిబెన్ పటేల్

పదవీ కాలం
6 ఆగష్టు 2014 – 25 ఆగష్టు 2014
ముందు మార్గరెట్ అల్వా
తరువాత మృదుల సిన్హా

వ్యక్తిగత వివరాలు

జననం (1935-08-09)1935 ఆగస్టు 9
ఢిల్లీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2023 ఫిబ్రవరి 20(2023-02-20) (వయసు 87)
వృత్తి రాజకీయ నాయకుడు, విద్యావేత్త

ఓం ప్రకాష్ కోహ్లీ (9 ఆగష్టు 1935 - 20 ఫిబ్రవరి 2023) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014 నుండి 2019 వరకు గుజరాత్‌ రాష్ట్ర 19వ గవర్నర్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఓం ప్రకాష్ కోహ్లీ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994 నుండి 2000 వరకు రాజ్యసభ సభ్యునిగా[1], 1999 నుండి 2000 వరకు ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. అతను 2014లో గుజరాత్ గవర్నర్‌గా నియమితుడై, 2019 వరకు విధులు నిర్వహించాడు. అతను గుజరాత్ గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు 2016 సెప్టెంబరు 8 నుండి 2018 జనవరి 19 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా, [2] 2014 ఆగస్టు 6 నుండి 2014 ఆగస్టు 25 వరకు గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కోహ్లీ 37 సంవత్సరాలు ఢిల్లీలోని హన్స్‌రాజ్ కళాశాల & దేశబంధు కళాశాలలో లెక్చరర్‌గా పని చేసి 1994లో పదవీ విరమణ చేశాడు. ఆయన విధ్యర్హి దశలో అఖిల భారతీయ విద్యా పరిషత్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1973-79 వరకు ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (DUTA) అధ్యక్షుడిగా, విశ్వవిద్యాలయం అకడమిక్ & ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ సభ్యుడిగా, యూనివర్సిటీ అధ్యాపకుల సంస్థ నేషనల్ డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ (ఎన్‌డిటిఎఫ్)కి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.

మరణం

[మార్చు]

ఓం ప్రకాష్ కోహ్లీ 2023 ఫిబ్రవరి 20న మరణించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Member's profile" (PDF). rajyasabha.nic.in. Retrieved 27 December 2019.
  2. India Today (8 September 2016). "OP Kohli takes charge as Governor of Madhya Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  3. "Governor Since Liberation | RAJ BHAVAN". rajbhavan.goa.gov.in.
  4. The Times of India (21 February 2023). "Former Gujarat governor Om Prakash Kohli passes away". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  5. Quint, The (2023-02-20). "Former Gujarat Governor & Delhi BJP President Om Prakash Kohli Passes Away At 87". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2024-09-09.