Jump to content

ఇక్బాల్ సికిందర్

వికీపీడియా నుండి
ఇక్బాల్ సికిందర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ ఇక్బాల్ సికిందర్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 4
చేసిన పరుగులు 1
బ్యాటింగు సగటు
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు 1*
వేసిన బంతులు 210
వికెట్లు 3
బౌలింగు సగటు 49.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a
అత్యుత్తమ బౌలింగు -/- 1/30
క్యాచ్‌లు/స్టంపింగులు -/- -/-
మూలం: [1], 2006 మే 3

మొహమ్మద్ ఇక్బాల్ సికిందర్, పాకిస్తానీ మాజీ క్రికెటర్. ఇతను నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. పాకిస్తాన్ గెలిచిన 1992 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టులో భాగమయ్యాడు. ఆ తరువాత మళ్ళీ ఇతను టెస్టులు లేదా వన్డేలలో పాకిస్థాన్‌కు ఎంపిక కాలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

జననం, విద్య

[మార్చు]

మొహమ్మద్ ఇక్బాల్ సికిందర్ 1958, డిసెంబరు 19న పాకిస్తాన్, సింధ్‌లోని కరాచీలో జన్మించాడు. ఇతను కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్‌లో చదువుకున్నాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

1991 జనవరిలో, ఒక-రోజు మ్యాచ్‌లో పెషావర్‌తో కరాచీ వైట్స్ తరపున ఆడాడు. 6.2–3–7–7 అసాధారణ బౌలింగ్ ఘనతను నమోదు చేశాడు; లిస్ట్ ఎ క్రికెట్ లో మరే ఇతర క్రికెటర్ కూడా తక్కువ పరుగులకే ఏడు వికెట్లు తీయలేదు.

ఇక్బాల్ ఇంగ్లీష్ లీగ్ క్రికెట్‌లో ఎక్కువకాలం ఉన్నాడు. 2001లో, లివర్‌పూల్ పోటీలో లీ క్రికెట్ క్లబ్ తరపున 100 లీగ్ వికెట్లు తీశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Notable Alumni – St. Patrick's High School". stpats.edu.pk. Archived from the original on 2018-08-02.