ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు | |
స్థాపితం | 1973 |
---|---|
స్థానం | బెంగళూరు, భారతదేశం |
జాలగూడు | https://www.iimb.ac.in/ |
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యానేజ్మెంట్ బెంగళూరు ఒక ప్రభుత్వ బిజినెస్ స్కూల్, ఈ సంస్థ భారతదేశంలోని బెంగళూరు నగరంలో ఉంది. దీనిని 1973లో స్థాపించడం జరిగింది.
ఈ సంస్థలో పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టోరల్, ఎగ్జిక్యూటివ్ అలాగే విద్యలను అందిస్తారు. ఈ సంస్థ ఎంబీఏ విద్య అందించడంలో పేరుగాంచింది.[1]
చరిత్ర
[మార్చు]1972లో ఐఐఎం అహ్మదాబాదు అలాగే ఇర్మా కళాశాలలను స్థాపించిన రవి జె.మత్తయి, అంతకు ముందే స్థాపించి ఉన్న ఐఐఎం కలకత్తా, అహ్మదాబాదులలో విద్యార్థుల సంఖ్య పెరగటం గమనించి మరిన్ని ఐఐఎంలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించడమైనది. అలా ప్రతిపాందించిన వాటిల్లో బెంగళూరు కూడా ఒకటి. ప్రభుత్వ రంగ వ్యవస్థలలో మ్యేనేజిమెంటు తెలిసిన నిపుణులను పెంచడానికి ఈ సంస్థ స్థాపన ఉంద్దేశించబడింది. దీనికి మద్దతు ప్రకటిస్తూ కర్ణాటక ప్రభుత్వం వంద ఎకరాల భూమిని కేటాయించి 30 లక్షల పెట్టుబడిని అందించింది. 1973 అక్టోబరు 28న అప్పటి దేశ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ కళాశాలను ప్రారంభించింది.[2]
కళాశాల ప్రాంగణం
[మార్చు]100 ఎకరాల విశాల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాశాల ప్రాంగణం బెంగళూరు నగరానికి దక్షిణాన ఉన్న బన్నేరుఘట్ట రోడ్డులో ఉంది. కళాశాలకు దగ్గర్లో ఉన్న బెంగళూరు నమ్మ మెట్రో పింక్ లైన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ కళాశాల నిర్మాణ రూపాన్ని ప్రిట్జర్ ప్రైజ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి.వి జోషి రూపొందించారు.[3]
ఈ కళాశాల ప్రాంగణంలో అకడమిక్ బ్లాక్లు, గ్రంథాలయం ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Technical Education - Centrally funded Institutions - Management Education". web.archive.org. 2011-08-06. Archived from the original on 2011-08-06. Retrieved 2022-09-11.
- ↑ "You are being redirected..." www.iimb.ac.in. Retrieved 2022-09-11.
- ↑ "BV Doshi's masterpiece IIM-B inspired by gardens, temples". The New Indian Express. Retrieved 2023-01-27.