అచలా సచ్దేవ్
స్వరూపం
అచలా సచ్దేవ్ | |
---|---|
జననం | పెషావర్ (ప్రస్తుత పాకిస్తాన్) | 1920 మే 3
మరణం | 2012 ఏప్రిల్ 30 పుణే | (వయసు 91)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1938–2012 |
జీవిత భాగస్వామి | క్లిఫోర్డ్ డగ్లస్ పీటర్స్ |
పిల్లలు | 1 |
అచలా సచ్దేవ్ (3 మే 1920 – 30 ఏప్రిల్ 2012) ప్రముఖ హిందీ నటి. ఈమె 250కి పైగా చిత్రాలలో నటించారు. బాల్యనటిగా నటనావృత్తిని ప్రారంభించిన అచల అనేక ప్రసిద్ధ హిందీ సినిమాలలో నటించింది. ఆ తర్వాత కాలంలో తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఈమె పోషించిన ప్రముఖ పాత్రలలో 1965లో విడుదలైన వఖ్త్ చిత్రంలో బల్రాజ్ సహ్నీ భార్య పాత్ర, 1995లో విడుదలైన దిల్వాలే దుల్హనియా లేజాయింగే చిత్రంలో కాజోల్ తల్లిపాత్ర గుర్తుండి పోయే పాత్రలు.
జీవితం
[మార్చు]ఈమె తన జీవితంలోని ఆఖరి సంవత్సరాలలో అతి కష్టం మీద బ్రతికారు. 2 మే, 2011న ఈమె తన తుదిశ్వాస విడిచారు.
సినీ ప్రస్థానం
[మార్చు]ఈమె దిల్వాలే దుల్హనియాఁ లేజాయేంగే చిత్రంలో కాజల్ కు అమ్మగా, కభీ ఖుషీ కభీ ఘమ్ చిత్రంలో అమితాభ్ బచ్చన్ కు తల్లిగా నటించారు. తెర మీద ఆఖరి సారిగా 2002లో వచ్చిన హ్రితిక్ రోషన్ సినిమా నా తుం జానో నా హం లో కనిపించారు.[1]
ముఖ్యమయిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | వ్యాఖ్య |
---|---|---|---|
1974 | పరిణయ్ | రేఖ తల్లి, పత్రికా సంపాదకురాలు | |
1974 | కోరా కాగజ్ | శ్రీమతీ గుప్తా | |
1962 | అప్నా బనాకే దేఖో |
గుర్తింపు, పురస్కారాలు
[మార్చు]వనరులు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-04. Retrieved 2014-03-06.