Jump to content

పెళ్ళి (సినిమా)

వికీపీడియా నుండి
16:09, 16 జూలై 2024 నాటి కూర్పు. రచయిత: 2001:1a10:182b:2101:c11:c838:a830:6190 (చర్చ)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
పెళ్ళి
దర్శకత్వంకోడి రామకృష్ణ [2]
రచనశ్రీనివాస చక్రవర్తి (కథ), జి. సత్యమూర్తి (మాటలు)
నిర్మాతఎన్. రామలింగేశ్వరరావు
తారాగణంవడ్డే నవీన్,
మహేశ్వరి
ఛాయాగ్రహణంకోడి లక్ష్మణరావు
కూర్పుతాతా సురేష్
సంగీతంఎస్.ఎ. రాజకుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఆగస్టు 1, 1997 (1997-08-01)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

పెళ్ళి చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1997 లో విడుదలైన ఒక సినిమా. ఇందులో వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఎన్. రామలింగేశ్వరరావు, శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాసారు.

నవీన్ కు బ్యాంకు మేనేజరుగా హైదరాబాదులో ఉద్యోగం వస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని అతని కోరిక. ఒక బట్టల షాపులో మహేశ్వరి అనే అమ్మాయిని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. ఆమెతో మాట్లాడాలకునే లోపే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె కోసం వెతికి ఒక కాలనీలో ఆమెను కనిపెడతాడు. ఆమె కోసం అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. ఆమె తన అత్తగారైన జానకమ్మతో కలిసి ఉంటుంది. తన కొడుకు ప్రవర్తన బాగాలేకపోతే కోడల్ని అతన్నుంచి దూరంగా తీసుకువచ్చి గుట్టుగా బతుకుతుంటుంది. కోడలికి మరో పెళ్ళి చేయాలని ఆమె ఆశ. నవీన్ నెమ్మదిగా వారిద్దరికీ దగ్గరవ్వాలని నానా రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. నవీన్ ఉద్దేశ్యం గ్రహించిన జానకమ్మ అతన్ని పెళ్ళి చేసుకోమని కోడలిని ప్రోత్సహిస్తుంది కానీ ఆమె అందుకు ఒప్పుకోదు. జానకమ్మ కొడుకు పృథ్వీ తన కోడలిని వేధింపులకు గురి చేస్తుంటే అది చూసి ఆమె తట్టుకోలేక తన కుమారుణ్ణి తల మీద స్పృహ తప్పేలా చేసి అతని దగ్గర్నుంచి దూరంగా వచ్చేసి జీవనం సాగిస్తుంటారు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించగా సిరివెన్నెల సీతారామాశాస్త్రి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, జేసుదాస్, మనో పాటలు పాడారు.

వ.సం పాట గాయకులు నిడివి
1 "రుక్కు రుక్కు రుక్మిణి" మనో 04:23
2 "ఓ యవ్వన వీణ" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 04:33
3 "జాబిలమ్మ నీకు అంత కోపమా" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 03:53
4 "అనురాగమే మంత్రంగా" కె. జె. యేసుదాసు 04:21
5 "పైటకొంగు ఎంతో మంచిది" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 04:30
6 "ఊగే ఊగే " ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 04:54

మూలాలు

[మార్చు]
  1. "Pelli (1997)". Indiancine.ma. Retrieved 2021-06-17.
  2. "Prominent Telugu film director Kodi Ramakrishna passes away". The New Indian Express. Retrieved 2021-02-12.