యోగి ఆదిత్యనాథ్
యోగి ఆదిత్యనాథ్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అతను భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. భారతీయ జనతాపార్టీ నుండి ఉత్తర ప్రదేశ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు.
యోగి ఆదిత్యనాథ్ | |||
| |||
21వ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 మార్చి 19 | |||
గవర్నరు | రామ్ నాయక్ ఆనందిబెన్ పటేల్ | ||
---|---|---|---|
డిప్యూటీ | కేశవ్ ప్రసాద్ మౌర్య దినేష్ శర్మ | ||
ముందు | అఖిలేష్ యాదవ్ | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 మార్చి 10 | |||
ముందు | రాధా మోహన్ దాస్ అగర్వాల్ | ||
నియోజకవర్గం | గోరఖ్‌పూర్ అర్బన్ | ||
శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 సెప్టెంబరు 18 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1998 అక్టోబరు 5 – 2017 సెప్టెంబరు 21 | |||
ముందు | మహంత్ అవైద్యనాథ్ | ||
తరువాత | ప్రవీణ్ కుమార్ నిషాద్ | ||
నియోజకవర్గం | గోరఖ్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 జూన్ 5 పాంచుర్, పౌరీ గర్వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం (ప్రస్తుత ఉత్తరాఖండ్ లో) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
పూర్వ విద్యార్థి | హేమావతి నందన్ బహుగుణ గర్హ్వాల్ యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు సాధువు | ||
మతం | హిందూధర్మం |
యోగి ఆదిత్యనాథ్ (అజయ్ మోహన్ సింగ్ బిష్త్) (జననం: 1972 జూన్ 5) [a] ఒక భారతీయ హిందూ సన్యాసి, రాజకీయ నాయకుడు, అతను 2017 మార్చి 19 నుండి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారంలో 2024 నాటికి 7 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు.[6] వరుసగా రెండు పర్యాయాలు అధికారం చేజిక్కించురున్న ఉన్న ఏకైక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి.[7]
గతంలో, ఆదిత్యనాథ్ 1998 నుండి 2017 వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 26 సంవత్సరాల వయస్సులో, అతను 1998లో అతి పిన్న వయస్కుడైన భారతీయ పార్లమెంటేరియన్‌లలో ఒకడు అయ్యాడు. గోరఖ్‌పూర్ నుండి వరుసగా ఐదు సార్లు లోక్‍సభ సభ్యుడుగా విజయం సాధించాడు.[1][8] 2017లో, అతను సెంట్రల్ నుండి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు మారారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.[9]మొదట్లో 2017లో యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తదనంతరం, 2022లో, అతను గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికలలో గెలుపొంది రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా మారాడు.
ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠానికి మహంత్ (ప్రధాన పూజారి)గా వ్యవహరిస్తాడు. గోరఖ్‌పూర్ లోని హిందూ మఠం, అతను ఆధ్యాత్మిక గురువు మహంత్ వైద్యనాథ్ మరణం తర్వాత 2014 సెప్టెంబరు నుండి ఈ పదవిలో ఉన్నారు.[10][11]అతను హిందూ జాతీయవాద సంస్థ అయిన హిందూ యువ వాహిని స్థాపకుడు.[12][13]అతనికి హిందుత్వ జాతీయవాది, సామాజిక సంప్రదాయవాది అనే ప్రసిద్ది ఉంది.[2][14][15][16]ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన భారతదేశపు అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఆదిత్యనాథ్ 2023లో 5వ స్థానంలో, 2024లో 6వ స్థానంలో నిలిచారు.[17][18]
జీవిత విశేషాలు
మార్చుయోగి ఆదిత్యనాథ్ (అజయ్‌సింగ్ బిస్త్) 1972 జూన్ 5 న ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని పౌడీ గఢ్వాల్ జిల్లా, పాంచుర్‌లో రాజ్‌పుట్ కుటుంబంలో జన్మించారు.[19] ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గల హెచ్‌ఎన్‌బీ గర్‌వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేశారు. 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఈతలో, బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. 1998లో తొలిసారిగా గోరఖ్‌పూర్ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంటులో అతిపిన్న వయస్కుడు (26). అదే నియోజకవర్గం నుంచి అయిదుసార్లు (1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికయ్యారు.[20] ప్రస్తుతం గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతిగా సైతం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతి ఆదిత్యానాథ్ అస్తమయంతో అతని వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు.
రాజకీయ జీవితం
మార్చుచిన్ననాటి నుంచే హిందూత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.12 వ లోక్‌సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. 44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మఠాధిపతిగా ఉన్నారు. తన గురువు మహంత్ ఆదిత్యనాథ్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యోగిగా మారారు.
హిందూత్వ వాదిగా
మార్చుపార్లమెంటు సభ్యునిగా కన్నా హిందూ అతివాదిగానే ఎక్కువగా ప్రసిద్ది అయ్యారు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని చెప్తారు. 2005లో రాష్ట్రంలోని ఈటాలో 5 వేల మందిని హిందూ మతంలోకి మార్పిడి చేయించారు. ఈ సందర్భంగా భారతదేశాన్నిహిందూ జాతిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2007లో గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లలో ఓ హిందూ బాలుడు మృతి చెందాడు. దీంతో నిషేధాజ్ఞలను కాదని ఆందోళన నిర్వహించారు. సూర్య నమస్కారాలను చేయడం యోగాభ్యాసంలో భాగమని గట్టిగా వాదించారు. దీనిని విమర్శించేవారు సముద్రంలో పడి చావవచ్చునని, లేదా చీకటి గదుల్లో మగ్గిపోవాలని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.
ముఖ్యమంత్రిగా
మార్చుఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ ను బిజెపి ఎంపిక చేసింది. 18-3-2017 శనివారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతరులు నిర్వహించిన చర్చల్లో యోగి ఆదిత్యనాధ్ వైపు మొగ్గుచూపడంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 19-3-2017 ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ సహా పలువురు ఈశ్వరుడి పేరున ప్రమాణం చేశారు. ప్రస్తుతం 50 మందితో ఈయన కేబినెట్ కొలువు తీరుతోంది.ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 21 వ ముఖ్యమంత్రి.[21][22]
రెండో సారి (2022–ప్రస్తుతం)
మార్చు2022 మార్చి 10 న, శాసనసభ ఫలితాల ప్రకటనతో, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 273 స్థానాలను కైవసం చేసుకుంది, ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి రెండవసారి అధికారంలోకి వచ్చాడు.యోగి, అతని పార్టీ పూర్తి 5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్రను లిఖించారు. 37 ఏళ్ల తర్వాత వరుసగా అధికారంలోకి వచ్చిన తొలి పార్టీ కూడా బీజేపీయే. [23] [24]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Member Profile: 16th Lok Sabha". Lok Sabha. Archived from the original on 4 October 2022. Retrieved 4 October 2022.
- ↑ 2.0 2.1 Ellen Barry (18 March 2017). "Firebrand Hindu Cleric Yogi Adityanath Picked as Uttar Pradesh Minister". The New York Times. Archived from the original on 29 March 2017. Retrieved 25 March 2017.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;HT
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Barry, Ellen; Raj, Suhasini (12 July 2017). "Firebrand Hindu Cleric Ascends India's Political Ladder". The New York Times. ISSN 0362-4331. Archived from the original on 29 December 2017. Retrieved 10 March 2022.
Adityanath, born Ajay Singh Bisht, found his vocation in college as an activist in the student wing of the Rashtriya Swayamsevak Sangh, a right-wing Hindu organization.
- ↑ "Who's the Hindu hardliner running India's most populous state?". BBC. Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
The son of a forest ranger, Yogi Adityanath was born in 1972 in Garhwal (which was then in Uttar Pradesh but is now in Uttarakhand state) and was named Ajay Singh Bisht.
- ↑ "Yogi Adityanath Became the Longest Serving Chief Minister of Uttar Pradesh". Drishti IAS. Archived from the original on 6 April 2023. Retrieved 6 April 2023.
- ↑ "Yogi Adityanath now CM with longest unbroken tenure in UP". The Times of India. 1 March 2023. ISSN 0971-8257. Archived from the original on 12 May 2024. Retrieved 12 May 2024.
- ↑ "In Lok Sabha, Yogi Adityanath takes a dig at Rahul-Akhilesh partnership", The Times of India, 21 March 2017, archived from the original on 22 March 2017, retrieved 22 March 2017
- ↑ Singh, Akhilesh (22 March 2017). "Yogi, Parrikar and Maurya to stay MPs till President polls in July". The Times of India. Archived from the original on 24 March 2017. Retrieved 22 March 2017.
- ↑ Mukul, Sushim (22 June 2024). "Chief Minister Yogi, Gorakhnath and Ram Lalla- A history of 75 years". India Today. Archived from the original on 12 May 2024. Retrieved 12 May 2024.
- ↑ "Yogi Adityanath, Hindutva Firebrand, Is The New CM Of UP". Huffington Post India. 18 March 2017. Archived from the original on 22 March 2017. Retrieved 6 July 2017.
- ↑ Jha, Prashant (1 January 2014). Battles of the New Republic: A Contemporary History of Nepal. Oxford University Press. p. 110. ISBN 9781849044592.
- ↑ Violette Graff; Juliette Galonnier (20 August 2013). "Hindu-Muslim Communal Riots in India II (1986-2011)". Online Encyclopedia of Mass Violence; Sciences Po.: 30, 31. CiteSeerX 10.1.1.692.6594.
- ↑ Jha, Dhirendra K. (27 June 2017). "The fall and rise of India's Yogi Adityanath". www.aljazeera.com. Archived from the original on 11 August 2020. Retrieved 20 September 2020.
- ↑ Wildman, Sarah (20 March 2017). "India's prime minister just selected an anti-Muslim firebrand to lead its largest state". Vox. Archived from the original on 13 April 2017. Retrieved 12 April 2017.
- ↑ "Wag the dog: On Yogi Adityanath as UP CM". The Hindu. Editorial. 20 March 2017. Archived from the original on 19 March 2017. Retrieved 6 July 2017.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "IE 100 2023: Who are the top 10 most powerful Indians?". 31 March 2023.
- ↑ "Most powerful Indian 2024". 29 February 2024.
- ↑ Sakshi (11 March 2022). "యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు తెలుసా?". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
- ↑ "యూపీలో సవాళ్లు: దటీజ్.. యోగి ఆదిత్యనాథ్, బీజేపీయే మోకరిల్లింది! | Yogi Adityanath, a Maths graduate who became a sanyasi - Telugu Oneindia".
- ↑ Andhra Jyothy (10 March 2022). "యోగి ఆదిత్యనాథ్ 7 రికార్డులు". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ Mana Telangana (10 March 2022). "యోగి...7 రికార్డులు". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ "Yogi Adityanath makes history amid BJP's big win in Uttar Pradesh - 10 points". Zee News. 11 March 2022. Retrieved 11 March 2022.
- ↑ "Yogi Adityanath — 'curious boy' who became firebrand leader makes history with 2nd term as UP CM". ThePrint. 10 March 2022. Retrieved 11 March 2022.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు