భువనేశ్వరి కుమారి
భువనేశ్వరి కుమారి భారతదేశానికి చెందిన మాజీ మహిళా స్క్వాష్ ఛాంపియన్. పద్మశ్రీ, అర్జున అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. వరుసగా 16 సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఆమె అల్వార్ మాజీ రాజకుటుంబానికి చెందినవారు.[1]
జీవితం తొలి దశలో
మార్చుప్రిన్సెస్ కాండీగా పిలువబడే కుమారి 1960 సెప్టెంబర్ 1 న న్యూఢిల్లీలో యశ్వంత్ సింగ్, బృందా కుమారి దంపతులకు జన్మించింది. ఆమె అల్వార్ మహారాజా తేజ్ సింగ్ ప్రభాకర్ బహదూర్ మనుమరాలు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు.[2]
కెరీర్
మార్చుఆమె 1977 నుండి 1992 వరకు వరుసగా 16 సంవత్సరాలు మహిళల జాతీయ స్క్వాష్ ఛాంపియన్. [3]
ఆమె 41 స్టేట్ టైటిళ్ళు ,రెండు అంతర్జాతీయ టైటిళ్ళు (కెన్యా ఓపెన్ 1988 ,1989) విజేత.
ఆమె సాధించిన విజయాలకు గాను 1982లో అర్జున అవార్డు, 2001లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.
సైరస్ పొంచాతో కలిసి భారత మహిళల స్క్వాష్ జట్టుకు కోచ్ గా ఉన్నారు. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్ 2018 కోసం వారు జట్టుకు శిక్షణ ఇచ్చారు.[4]
గుర్తింపు
మార్చు- 1982లో అర్జున అవార్డు
- 2001లో పద్మశ్రీ [5]
- ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డు (ఉత్తమ క్రీడా మహిళ 1983)
- రాజస్థాన్ స్పోర్ట్స్ అవార్డ్ కౌన్సిల్ 1984
- మహారాణా మేవార్ ఫౌండేషన్ "అరవళి అవార్డు" (1990 సంవత్సరపు అత్యుత్తమ క్రీడాకారిణిగా)
- క్రీడలకు కె కె బిర్లా ఫౌండేషన్ అవార్డు (1991లో అత్యుత్తమ ప్రదర్శనకు)
- బాంబే స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డు (1992 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారిణిగా)
- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ (స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 1992, భారతీయ క్రీడలలో అత్యధిక టైటిళ్లు గెలిచినందుకు) లో జాబితా చేయబడింది.
- రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ అవార్డు - ఉత్తమ మహిళా క్రీడాకారిణి 1993-94
- క్రీడల్లో రాణించినందుకు మహారాజా సవాయ్ మాధో సింగ్ పురస్కారం
మూలాలు
మార్చు- ↑ "ALWAR". 2002-07-24. Archived from the original on 2002-07-24. Retrieved 2019-01-01.
- ↑ "Alwar".
- ↑ "Squash Rackets Federation of India". Archived from the original on 2 January 2019. Retrieved 2019-01-01.
- ↑ "Indian squash players question role of coaches Cyrus Poncha and Bhuvneshwari Kumari in Asian Games contingent". The Indian Express (in Indian English). 2018-08-14. Retrieved 2019-11-23.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.