మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. కంగ్రాట్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్ (పోస్ట్)

by Hamsa |
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. కంగ్రాట్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: హీరోయిన్ స్వాసిక విజయ్(Swasika Vijay) ‘వైగై’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఫిడల్, కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, నోరింజు మరియమ్ జోస్, చతరం, వాసంతి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు సీరియల్స్(Serials), టీవీ షోస్‌లోనూ మెరిసింది. ఈ క్రమంలోనే.. నటుడు ప్రేమ్‌తో ప్రేమలో పడింది. పెద్దలను ఒప్పించి గత ఏడాది పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది. చివరగా ‘లబ్బర్ పందు’(Lubber Pandhu) నటించిన ఆమె పూర్తిగా పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, స్వాసిక మరోసారి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఏడాది పూర్తయిన సందర్భంగా నేడు తమిళ సాంప్రదాయ ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఫొటోలు షేర్ చేసింది. ‘‘చూస్తుండగానే ఏడాది అయిపోయింది. మేము తమిళ సాంప్రాదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని నిజమైన పెళ్లిలా అందంగా, అద్భుతంగా జరిపారు’’ అని రాసుకొచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ అని కామెంట్లు పెడుతున్నారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed