Jump to content

చెట్టు

వికీపీడియా నుండి
(వృక్షాలు నుండి దారిమార్పు చెందింది)
తాటిచెట్టు మీద మొలిచిన చిన్న మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును.

మధ్యలో మాను పక్క కొమ్మలు కలిగి కనీసం ఇరవై (20) అడుగుల ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు రెండు వందల (200) అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొన్ని చెట్లు వేయి సంవత్సరాలు పైన జీవిస్తాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ, పుష్పిస్తూ, కాయలు, పండ్లు అందించేవాటిని చెట్లు అంటారు. ఒక్కసారి కాచి చనిపోయే వాటిని మొక్కలు అంటాము. చెట్లు నేల పటుత్వాన్ని,భూసారాన్ని చక్కగా కాపాడతాయి.ప్రకృతికి అందాలను చేకూర్చడంలోను, వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్ల రకాలు చాలా వరకు చెట్లనుండి లభిస్తాయి.మామిడి, సపోటా, బత్తాయి, దానిమ్మ మొదలైన పండ్లు చెట్ల నుండి లభిస్తాయి.

మతములో చెట్లు

[మార్చు]

మతపరమైన నమ్మకాలు చెట్లు ఆధారంగా అనేకం ఉన్నాయి. మహా విష్ణువు బాలకృష్ణుడుగా మర్రి ఆకు మీద పవళించినట్లు వర్ణనలు పురాణాలలో ఉన్నాయి. పోలేరమ్మకు వేపచెట్టుకు అవినాభావ సంభంధం విడదీయరానిది. శివుడికి మారేడు చెట్టు, వినాయక పూజలో ఏకంగా అనేక పత్రాలను సేకరించి చేసే ఆచారం ఉంది.వాటి గురించిన విషయ సేకరణ అవసరాన్ని, వాటిని పెంచి పోషించి రక్షించవలసిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి.

మనిషిలాంటిదే చెట్టు

[మార్చు]

చెట్టంత మనిషి అని, చెట్టంత ఎదిగాడు అంటారు.ఈ విశ్వం అంతా పంచ భూతాత్మకమైనదే. చెట్లు తదితరాలలో కూడా మనిషిలో ఉన్నట్లే పంచభూతాలూ ఉన్నాయి. వాటిక్కూడా మనిషికిలాగే వినటం, వాసన చూడటం, రసం, స్పర్శ, దృష్టి అనే ఐదు ఇంద్రియాలూ ఉన్నాయి. అవి ఇతర జంతువులకులాగా పైకి కనిపించక పోవచ్చు. అంతమాత్రం చేత వాటిని లేవు అని అనటానికి వీలు లేదు. వృక్షాల్లోనూ ఆకాశమనేది ఉంది. చెట్లకు స్పర్శను పొందే లక్షణం ఉంది. అలాగే గాలి వీచినప్పడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు రాలిపడుతుంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి ఆ చెట్లకుంది.తీగలు చెట్లను చుట్టుకొని, లేదంటే పందిరికి ఎగబాకుతూ ముందుకు సాగిపోతుంటాయి. ముందుకు పోవాలంటే, ముందు ఏముందో అర్థం కావాలంటే ఎంతో కొంత దృష్టి ఉండాలి. ఈ తీగలు సాగే స్థితిని చూస్తే దృష్టి కూడా ఉంది అనే విషయం అర్థమవుతుంది. పవిత్రమైన గంధం కానీ, ధూపం కానీ ఆ చెట్లకు సోకినప్పుడు అవి చక్కగా ఎదుగుతుంటాయి.సుఖ దుఃఖాలను పొందే లక్షణాన్ని అవి కలిగి ఉన్నాయి . మనిషిలో ఎలా పరిణామ క్రమం ఉంటుందో వాటిలోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తటం, పెరిగి పెద్దవ్వటం, పుష్పించి ఫలాలను ఇవ్వటం, కొంత కాలానికి వయస్సుడిగి నశించటం ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది. వాయువును గ్రహించటం, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం, ఆహారం మారినప్పుడు తరగటం, పెరగటం ఇవన్నీ చెట్లలో కనిపిస్తుంటాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే చీడపీడలు సోకిన చెట్టు కూడా బాధ పడుతున్నట్లు నీరసించినట్టు కనపడుతుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషి లాగే నవనవలాడుతూ మళ్ళీ ఆ చెట్టు కనపడుతుంది.దయచేసి ప్రకృతి అందాలకు.. పరాకాష్ట అయిన ఈ పృధ్విని వృక్షాలతో నింపేద్దాం.గో సంరక్షణకు ప్రభుత్వాలు ఏ విధమైన చట్టాలు తెచ్చాయో..చెట్టు విషయం లోనూ అవే చట్టాలు తేవాలి.అందుకు కొన్ని ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం మనందరిపై వున్నది.

వైద్యంలో చెట్లు

[మార్చు]

చెట్ల వేళ్ళు, బెరడు, ఆకులు, పూలు, కాయలు, పుల్లలు, పండ్లు, విత్తనాలు మొత్తంగా అన్నిభాగాలను ఆయుర్వేదం, సిద్ద, యునానీ వైద్య విధానాలలో ఉపయోగిస్తారు. వీటి నుంచి అనేకరకాల మందులను తయారు చేస్తారు. పొలాలకు క్రిమి సంహారక మందులు కూడా చెట్ల ఆధారంగా తయారు చేస్తారు.ప్రకృతిలో ప్రాణం పురుడు పోసుకున్న రోజునే.తరువు కూడా పురుడు పోసుకుంది.ప్రకృతికి వికృతి వికృతికి ప్రకృతి అనుసంధానమైనట్లు..ఈ ప్రకృతి లో..ఎటువంటి ఎంతటి కఠినమైన.. దీర్ఘకాలిక రోగాలకు కూడా ఈ ప్రకృతి లో..ఔషదీకృత మొక్కలు వృక్షాలు వున్నాయి. ఈ విషయం లోనే..చక్కని పరిశోధనలు..ఎన్నో జరగవలసి వున్నాయి. కానీ మిగిలిన వైద్య విధానం లో వున్న సంపూర్ణత లేని పరిశోధనలుకన్నా..ఈ ఆయుఃర్వేదంలో సరైన పరిశోధనలు జరగడంలేదు.శాశ్వత పరిష్కారం వెతకడం లేదు.ప్రకృతి పై సరైన గౌరవభావం ఆరాధన లేదని నా అభిప్రాయం.

చెట్టు భాగాలు

[మార్చు]
  • మొక్కల వేళ్ళు కన్నా చెట్ల వేళ్ళు చొచ్చుకుపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. భూమిలోని సారాన్ని నీటిని చెట్టు లోని అన్ని భాగాలకు అందించటం వీటిపని.
  • కాండం లే క మాను, కొమ్మలు మిగిలిన అన్నిభాగాలకు ఆధారం. ఇది ఒక్కక్క సంవత్సరం ఒక్కొక్క చుట్టూ పెరుగుతూ ఉంటుంది. దీని అడ్డకోత చెట్టు వయసుని తెలుపుతుంది. కొమ్మలు ఇవి ఉన్నప్పుడే మొక్క చెట్టుగా గురింప బడుతుంది. బెరడు మానుని వాతావరణం నుండి, క్రిముల బారినుండి కాపాడుతుంది.
  • ఆకులు చిగురిస్తూ, పండిపోతూ, రాలిపోతూ ఉండటం వీటి లక్షణం. వసంతకాలంలో చిగురించిన చెట్లు ఆకర్షణీయంగా కొత్త అందాలను సంతరించుకుంటాయి. సూర్యరశ్మి నుండి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్ర హరితం సంపాదించి చెట్టుకి అందించటం వీటి పని. చెట్ల ఆకులు చాలావరకు చిన్నవిగా ఉండి క్రిమలనుండి చెట్లని రక్షిస్తూ వాటి జీవిత కాలాన్ని పెంచేదానికి దోహద పడతాయి.
  • పూలు వీటి ఆకర్షణ ప్రకృతి అందాలను ఇనుమడింప చేయడమేకాక చెట్ల తేనెటీగలు, సీతాకోకచిలుకలు మకరంద సేవనం చేసే కీటకాలను ఆకర్షించి సంతానోత్పత్తికి తోడ్పడుతాయి. తేనెటీగలు సేకరించిన మకరందం తేనెగా మారి ఔషధాలలోను, నేరుగా ఆహారంగాను మనం ఉపయోగిస్తూ ఉంటాము.
  • కాయలు పండ్లుగా మారి సంతానోత్పత్తికి కావలసిన విత్తనాలను అందిస్తాయి. ఈ పండ్లు నేరుగాను, కాయలను వివిధ రూపాలలోను ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాము.
  • విత్తనాలు చెట్ళు తమ సంతానాన్ని విత్తనాల రూపంలో భద్రపరచుకుంటాయి. ఈ విత్తనాలను మనం ఆహారంగా వాడుకుంటాము. ఉదాహరణగా డ్రై ఫ్రూట్స్ కోవలోకి చెందిన బాదం, పిస్తా, జీడిపప్పు ఎండిన రూపంలో వాడటం అందరికి తెలిసినవే.

వివిధరకాల చెట్లు వాటి పేర్లు

[మార్చు]

మద్ది, వేప, చింత, మామిడి, చందనం, మర్రి, రావి, పనస, జామ, కానుగ, ఉసిరి

వృక్షో రక్షతి రక్షితః

[మార్చు]
వృక్షో రక్షతి రక్షితః’అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.

వృక్షో రక్షతి రక్షితః’అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.

హిందూ దేవాలయాలలో ఒక మంత్రం వలె ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. అంతేకాక దేవాలయాలలో వృక్షాలను పెంచి వాటిని కూడా దేవతలను పూజించినట్లే పూజిస్తారు. చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి అనే భావన ఈ వాక్యంతో మానవుల మనసులలో దృఢ పడుతుంది. స్వార్థం కోసం అక్రమంగా చెట్లను నరికే వారిని ఈ వాక్యం సక్రమ మార్గంలో నడిచేలా చేస్తుంది. మానవాళి మనుగడకు అవసరమైన సంపదలలో వృక్ష రక్షణ అవశ్యకతను ఈ వాక్యం తెలియజేస్తుంది.

వాతావరణ కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యమునకు ఈ వాక్యం యొక్క ప్రచారం చాలా ఉపయోగపడింది.

వివిధ రకాల చెట్ల బొమ్మలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]