Jump to content

బొగ్గు

వికీపీడియా నుండి
(నేలబొగ్గు నుండి దారిమార్పు చెందింది)
బొగ్గు
బొగ్గు రసాయనిక నిర్మాణం.
సింగరేణి ఉపరితల బొగ్గు గని, మణుగూరు

బొగ్గులో రెండు రకాలు ఉన్నాయి: (1) నేలబొగ్గు (coal). నేలబొగ్గుని రాతిబొగ్గు, రాక్షసిబొగ్గు అని కూడ అంటారు. ఇది భూమిలో అంతర్గతమైన వృక్ష అవశేషాల రూపాంతరము. ఒక రకమైన రాక్షసిబొగ్గు రాయిలాగా గట్టిగా ఉంటుంది. ఈ బొగ్గుని గనుల నుండి తవ్వి తీస్తారు. (2) కర్రబొగ్గు (charcoal). దీనిని కర్రలను కాల్చి తయారు చేస్తారు. ఇక్కడ ప్రస్తావనలో ఉన్నది ముఖ్యంగా నేల బొగ్గు.

నేల బొగ్గు

[మార్చు]

తరిగిపోయే ఇంధన వనరుల్లో నేల బొగ్గు ఒకటి. ఇది శిలాజ ఇంధనం. ఈ శిలాజ ఇంధనాలు జీవుల నుండి యేర్పడ్డాయి. సుమారు మూడు వందల మిలియన్ల సంవత్సరాల పూర్వం భూభాగం పైనున్న తేమ నేలల్లోని మహా వృక్షాలు భూగర్భంలో కూరుకు పోయి నేలబొగ్గుగా మారాయి.

భూపటలంలోని మార్పులు, భూగర్భంలోని అత్యధిక ఉష్ణం, పీడనాల వల్ల నేలబొగ్గు క్రమేపి "పీట్, లిగ్నైట్(38% కర్బనం),బిటుమినస్ బొగ్గు(65% కర్బనం), చివరికి ఆంత్రసైటు(96% కర్బనం)" గా మారాయి.

నేల బొగ్గు ప్రధానంగా కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువుల్ని, స్వల్ప పరిమాణంలో గంధకము పరమాణువుల్ని కల్గి ఉంటుంది.

బిట్యుమినస్ బొగ్గు నుండి కోక్ ను తయారుచేస్తారు. ఇది ఒక ఉత్తమ ఇంధనం. ఉత్తమ శ్రేణి కోక్ బ్లాస్ట్ కొలిమికి తగిన ఇంధనం.

కోక్ చాలా ఖరీదైన ఇంధనం. 10 టన్నుల బిట్యూమినస్ కోల్ నుండి 7 టన్నుల కోక్ లభిస్తుంది. నేలబొగ్గు నిల్వలు చాలా పరిమితం. నేలబొగ్గును మండించటం వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యము యేర్పడుతుంది.

జర్మనీలోని గార్జ్‌వీలర్‌లో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని. అధిక రిజల్యూషన్ పనోరమా.

ఉపయోగాలు

[మార్చు]
  • బొగ్గును వంట కోసం వాడుకోవచ్చు.
  • బొగ్గును ఉపయోగించి నీటి ఆవిరిని తయారు చేసి, రైలు బండిని నడిపిస్తున్నారు.
  • బొగ్గును ఇంధనంగా విద్యుత్తును తయారుచేస్తున్నారు.
  • బొగ్గును ఘన ఇంధనాన్ని మండించే (ఉదాహరణకు కొక్రేన్,లాంకషైర్ బాయిలర్లలో) ఇంధనంగా వాడెదరు.

బొగ్గుతో విద్యుత్ ఉత్పాదన

[మార్చు]

(అమెరికాలో అయితే ఒకొక్క ఇంటికి సగటున 1,000 వాట్‌లు అవసరం ఉంటుందని ఊహించుకుంటున్నాను.) ఒక టన్నులో పది లక్షల గ్రాములు ఉన్నాయి కనుక, ప్రతి ఇంటి అవసరాలకి 7 క్షణాలకి ఒక గ్రాము బొగ్గు ఖర్చు అవుతోందన్నమాట. ఒక గిగా వాట్ సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రం పది లక్షల ఇళ్లకి సరిపడే విద్యుత్తుని పుట్టించగలదు. ఈ విద్యుత్ కేంద్రం ప్రతి 2 క్షణాలలో 1 టన్ను బొగ్గు పులుసు (carbon dioxide) వాయువుని గాలిలోకి విడుదల చేస్తోంది. అంటే ప్రతి 7 క్షణాలలో 1 టన్ను బొగ్గుని కాల్చి, 3 టన్నుల బొగ్గు పులుసు వాయువుని గాలిలోకి విడుదల చేస్తోంది.

తెలుగు దేశంలో బొగ్గు గనులు

[మార్చు]
గోండ్వానా లోయలో ఒక ముఖ్యమైన లోయ గోదావరి నదీ పరివాహక ప్రాంతం. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే అపారమైన బొగ్గు సంపద బయటపడింది. సుమారు 17 వేల చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేలింది. సింగరేణి బొగ్గు తొలిసారిగా..

డబ్ల్యూ.టీ. బ్లేన్‌ఫోర్డ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1871లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ‘కామ్తి సముదాయం’కు చెందిన ఇసుక రాతి పొరలను పరీక్షించి బొగ్గు లభించే అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. సా. శ. 1872-88 మధ్య కాలంలో సర్‌ విలియం కింగ్ అనే భూ విజ్ఞాన శాస్త్రవేత్త గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే చేసి భూగర్భంలో ఉన్న గోండ్వానా కాలపు రాతి పొరలను గుర్తించారు. ఆ తర్వాత జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గోండ్వానా ప్రాంతంలో దశాబ్దాలుగా అన్వేషించి బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1889లో ఖమ్మం జిల్లా ఇల్లెందులోని సింగరేణి గ్రామంలో ప్రప్రథమంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరుతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారత దేశానికి సింగరేణి విద్యుత్ వెలుగులు ప్రసాదిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.

బొగ్గు దిగుమతులు

[మార్చు]

విద్యుత్ ఉత్పాదన కొరకు

భారతదేశం బొగ్గుని  ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం రేవు ద్వారా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది.

బొగ్గు రూపాంతరం

[మార్చు]

భుకంపాలు, తుఫానుల వల్ల నెలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తరువాత బొగ్గుగా రూపాంతరం చెందుతాయి. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామ క్రమంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను పీట్ గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అర మిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు పీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక మీటర్ పీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది.

ఈ విధంగా తయారైన పీట్ భూమిలోని పీడనం, ఉష్ణోగ్రత వల్ల క్రమంగా లిగ్నైట్ గా మారుతుంది. ఆ తర్వాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. సుమారు 20 మీటర్ల వృక్ష పదార్థాలు ఆరు మీటర్ల పీట్ గా మారి ఆ తర్వాత మూడు మీటర్ల లిగ్నైట్‌గా రూపాంతరం చెందుతాయి. కొన్నేళ్ల తర్వాత లిగ్నైట్ ఒక మీటర్ బొగ్గుగా ఏర్పడుతుంది. ఒక మీటర్ బొగ్గుగా మారడానికి సుమారు 6 వేల నుంచి 9 వేల సంవత్సరాలు పడుతుంది. లిగ్నైట్ కన్నా ఎక్కువ కార్బన్ కలిగిన బొగ్గు బిటుమినస్. బిటుమినస్ బొగ్గు రూపాంతరం వలన ఆంత్రసైట్ బొగ్గు ఏర్పడును.

గోండ్వానా ప్రాంత విస్తీర్ణం .. దేశంలో గోండ్వానా ప్రాంతం 63 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇందులో 15 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం బొగ్గు అన్వేషణకు అనువైన ప్రాంతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలోని గోదావరిలోయ బొగ్గు క్షేత్ర వైశాల్యం 17 వేల చదరపు కిలోమీటర్లుగా గుర్తించి 11 వేల చదరపు కిలోమీటర్లలో బొగ్గు అన్వేషణ జరపడానికి అనువైన ప్రాంతంగా నిర్ధారించారు.

చెట్ల నరికివేత-బొగ్గు బట్టీ(Kiln) నిబంధనలు

[మార్చు]
  • సొంత స్థలంలోనే పెద్ద వృక్షాన్ని నరకాలంటే 'నీరు-నేల-చెట్టు' చట్టం ప్రకారం అనుమతి ఉండాలి. మరో మొక్క నాటాకే దాన్ని నరికేందుకు అనుమతి ఉంటుంది.
  • ప్రభుత్వ స్థలాల్లోని అడవుల నరికివేత పెద్ద నేరం. అటవీ చట్టాల ప్రకారం అనుమతి లేకుండా నరికితే చెరసాలే.
  • బొగ్గు అమ్మకాలు జరపాలన్నా అడితీ(Timber Depot)ల నిర్వాహకులకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి.
  • బొగ్గు తయారీకైతే అనుమతి లేకపోతే నేరమే.
  • ఏ చెట్టును నరికి బొగ్గు తయారు చేస్తున్నారనేది అనుమతి పత్రంలో చూపాలి. అవి కాక మరేమైనా చెట్లు నరికితే చట్టాన్ని ఉల్లంఘించినట్లే.

కూడా చూడండి

[మార్చు]