1937
స్వరూపం
1937 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరం.
సంవత్సరాలు: | 1934 1935 1936 - 1937 - 1938 1939 1940 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- జనవరి 2: చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
- జనవరి 2: మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు.
- జనవరి 7: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (మ. 1987)
- జనవరి 14: శోభన్ బాబు, తెలుగు కథానాయకుడు. (మ.2008)
- జనవరి 14: రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1994)
- ఫిబ్రవరి 5: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్. (మ.2016)
- మార్చి 8: ఒట్టోహాన్, ఆటంబాంబు సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- మార్చి 14: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు.
- మార్చి 15: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007)
- ఏప్రిల్ 5: చేగొండి వెంకట హరిరామజోగయ్య, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత.
- మే 12: జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (మ.2008)
- మే 26: మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015)
- జూలై 1: పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (మ.2015)
- జూలై 27: రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2006)
- ఆగష్టు 30: జమున, తెలుగు సినిమా నటి.
- సెప్టెంబరు 14: ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015)
- సెప్టెంబర్ 15: రాబర్ట్ లుకాస్, ఆర్థికవేత్త.
- అక్టోబరు 31: నరిశెట్టి ఇన్నయ్య, హేతు వాది,, రచయిత.
- నవంబర్ 3: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. (మ.2004)
- నవంబర్ 7: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (మ.2016)
- నవంబర్ 30: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005)
- డిసెంబర్ 2: మనోహర్ జోషి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేనకు చెందిన రాజకీయ నాయకుడు. (మ.2024)
- డిసెంబర్ 6: సావిత్రి, తెలుగు సినీ మహానటి.
- డిసెంబర్ 15:పింగళి వెంకట రమణారావు, ఎలెక్ట్రాన్ అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన కథా రచయిత.
- డిసెంబర్ 31: ఆంథోనీ హాప్కిన్స్, నటుడు.
మరణాలు
- జూన్ 23: కొంపెల్ల జనార్ధనరావు, భావకవి, నాటక రచయిత. (జ.1907)
- జూలై 20: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874)
- అక్టోబరు 15: నెమిలి పట్టాభి రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్. (జ.1862)
- అక్టోబర్ 17: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (జ.1877)
- అక్టోబర్ 19: రూథర్ఫర్డ్, రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- నవంబర్ 23: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (జ.1858)
- తేదీ వివరాలు తెలియనివి
- పూడిపెద్ది వెంకటరమణయ్య, తెలుగు కథా రచయిత (జ.1893)