మన్సూర్ అమ్జాద్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మన్సూర్ అమ్జాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్ | 1986 డిసెంబరు 25|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 170) | 2008 జూన్ 29 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 23) | 2008 ఏప్రిల్ 20 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004–2005 | Zarai Taraqiati Bank Limited | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004–present | Sialkot | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–present | National Bank of Pakistan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006–2007 | లీసెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–2013 | Sialkot Region Cricket Association | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2018 | వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2020 | Galle Cricket Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2013 నవంబరు 28 |
మన్సూర్ అమ్జాద్ (జననం 1987, డిసెంబరు 14) పాకిస్తానీ క్రికెటర్.[1] పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు,ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. అమ్జాద్ తన చిన్నతనంలో వీధిలో టేప్-బాల్ క్రికెట్ ఆడాడు. ఇతని స్వగ్రామంలో బ్యాట్, బాల్ బాయ్‌గా పేరు పొందాడు. చిన్న వయస్సులోనే సాగా స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్ కోసం క్రికెట్ ఆడాడు. 1998-99లో లాహోర్‌లోని హబీబ్ బ్యాంక్ మొబైల్ క్యాంప్‌కు ఆడాడు. అమ్జాద్ లెగ్ స్పిన్ బౌలర్‌గా ప్రారంభించాడు. కుడిచేతి బ్యాట్స్‌మన్‌గా చక్కటి ఆటతీరును కనబరచాడు. 2000లో అమ్జాద్ అండర్-15 క్యాంపుకు ఎంపికయ్యాడు.
తొలి జీవితం
2001లో లాహోర్‌లోని పాకిస్థాన్ జూనియర్ క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. మరుసటి సంవత్సరం, మొదటి అంతర్జాతీయ పాకిస్తాన్ అండర్-15కి ఎంపికయ్యాడు.[2] అబుదాబిలో పాకిస్తాన్ వారి మొట్టమొదటి జూనియర్ అండర్-15 ఆసియా కప్‌ను గెలుచుకుంది.[3] అమ్జాద్ తన మొదటి అండర్-15 మ్యాచ్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులకు ఐదు వికెట్లు తీసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.[4] 2003 పాకిస్తాన్ అకాడమీ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు, నాలుగు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఆ సంవత్సరం వీడియోకాన్ ఆసియన్ ఎమర్జింగ్ ట్రోఫీని పాకిస్తాన్ గెలుచుకుంది,[5] ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన జట్టులో అమ్జాద్ సభ్యుడిగా ఉన్నాడు.[6]
పాకిస్తాన్ 2004 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా, ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు తీసుకున్నాడు. ఐర్లాండ్‌పై 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసిన అమ్జాద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.[7] దాదాపు 13 సంవత్సరాలపాటు అత్యుత్తమ అండర్-19 రికార్డులను నెలకొల్పాడు.[8]
అంతర్జాతీయ క్రికెట్
2005లో, ఆస్ట్రేలియా ఎ క్రికెట్ జట్టు పర్యటనలో రెండు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ఆ తరువాత గ్రీన్ టీమ్ తరపున పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైడ్ మ్యాచ్ ఆడాడు, రెండు వికెట్లు తీయడంతోపాటు 29 పరుగులు చేశాడు.[9] అమ్జద్ 2005లో ఇంగ్లాండ్‌తో పాకిస్తాన్ ఎ తరపున ఒక సైడ్ మ్యాచ్ ఆడాడు.[10]
2006లో జరిగిన యురేషియా క్రికెట్ సిరీస్‌లో పాకిస్తాన్ ఎ జట్టు తరపున భారత్‌పై నాలుగు వికెట్లు తీశాడు.[11] ఐదు మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో అమ్జాద్ బౌలర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు.[12] లీసెస్టర్‌షైర్ ఫాక్స్‌లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్‌ను గెలుచుకున్నాడు.[13]
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగులతో పాకిస్తాన్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.[14]
2008 ఏప్రిల్ లో కరాచీలో బంగ్లాదేశ్‌తో జరిగిన ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. పదహారవ ఓవర్ లో రెండవ, ఐదవ, ఆరవ బంతుల్లో వికెట్లు తీశాడు. మొత్తం 1-0-3-3తో మహ్మదుల్లా, మష్రఫే ముర్తాజాను అవుట్ చేశాడు.[15] 2008 జూన్ లో, ఆసియా కప్‌లో వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు; శ్రీలంకపై తనకు కేటాయించిన ఎనిమిది ఓవర్లలో 44 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.[16]
మూలాలు
- ↑ "Mansoor Amjad | Pakistan Cricket Team | Official Cricket Profiles | PCB". www.pcb.com.pk. Retrieved 2023-09-05.
- ↑ "Team Pakistan Under-15s ODI Batting Bowling Stats | Live Cricket Scores | PCB". www.pcb.com.pk2023-09-05. Retrieved 2023-09-05.
- ↑ "Under-15 Asia Cup (UAE) 2002". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Super League Group A: Oman Under-15s vs Pakistan Under-15s at Abu Dhabi |Cricket Scorecard | Live Results | PCB". www.pcb.com.pk2023-09-05. Retrieved 2023-09-05.
- ↑ "Emerging Team Trophy - Cricket Schedules, Updates, Results | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Full Scorecard of SL Emerg vs PAK Emerg Final 2003/04 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Full Scorecard of Ireland U19 vs Pakistan U19 Group D 2003/04 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Records | Under-19s Youth One-Day Internationals | Bowling records | Best career bowling average | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-09-05.
- ↑ "Pakistan Cricket Board Greens v Pakistan Cricket Board Whites: Pakistan Cricket Board Greens vs Pakistan Cricket Board Whites at Lahore |Cricket Scorecard | Live Results | PCB". www.pcb.com.pk2023-09-05. Retrieved 2023-09-05.
- ↑ "Pakistan A v England XI: England XI vs Pakistan A at Lahore |Cricket Scorecard | Live Results | PCB". www.pcb.com.pk2023-09-05. Retrieved 2023-09-05.
- ↑ "Full Scorecard of Pakistan A vs India A Final 2006 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "EurAsia Cricket Series, EurAsia Cricket Series 2006 score, Match schedules, fixtures, points table, results, news". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Leicestershire County Cricket Club". www.leicestershireccc.co.uk. Retrieved 2023-09-05.
- ↑ "Full Scorecard of Sth Africans vs PCB XI Tour Match 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Full Scorecard of Pakistan vs Bangladesh Only T20I 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Full Scorecard of Sri Lanka vs Pakistan 8th Match, Super Four 2008 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.