Jump to content

దక్షిణ భారత కరువు 1876–1878

వికీపీడియా నుండి
11:46, 4 మే 2024 నాటి కూర్పు. రచయిత: Chaduvari (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
1876 – 1878 నాటి మహా కరువుతో ప్రభావితమైన వివిధ ప్రావిన్సులు, స్థానిక రాజ్యాలను చూపించే బ్రిటిష్ భారతదేశపు మ్యాపు (1880).

1876-1878లో బ్రిటిషు భారతదేశంలో పెద్ద కరువు వచ్చింది. దాన్ని దక్షిణ భారత కరువు అనీ, 1877 మద్రాసు కరువు అనీ కూడా అంటారు. 1876 లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి తర్వాత, దక్కన్ పీఠభూమిలో పంట నష్టం జరిగింది. ఇది దక్షిణ, నైరుతి భారతదేశాన్ని (మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలు, మైసూరు, హైదరాబాద్ సంస్థానాలు) రెండు సంవత్సరాల పాటు ప్రభావితం చేసింది. రెండవ సంవత్సరంలో కరువు ఉత్తర ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలకు, వాయవ్య ప్రావిన్సులకు, పంజాబ్‌లోని కొంత ప్రాంతానికి కూడా వ్యాపించింది. చివరికి కరువు 6,70,000 చ.కి.మీ మేర వ్యాపించి, మొత్తం 5,85,00,000 మందిని కష్టాల పాలు చేసింది. [1][2] ఈ కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య 55 నుండి 103 లక్షల వరకు ఉంటుందని అంచనా.

మునుపటి సంఘటనలు

[మార్చు]
మద్రాసు బీచ్‌లలో ఎగుమతి కోసం సిద్ధంగా ఉన్న ధాన్యం. (1877 ఫిబ్రవరి)

పాక్షికంగా, దక్కన్ పీఠభూమిలో తీవ్రమైన బెట్ట పరిస్థితుల వలన పంటలు లేక, మహా కరువు ఏర్పడి ఉండవచ్చు. బలమైన ఎల్ నినో, క్రియాశీల హిందూ మహాసముద్ర ద్విధ్రువం మధ్య పరస్పర చర్య కారణంగా భారతదేశం, చైనా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కలిగిన వర్షాభావం, పంట వైఫల్యాల్లో ఇది భాగం. ఇది 1.9 నుండి 5 కోట్ల మత్రణాలకు కారణమైంది. [3]

వలస ప్రభుత్వం మాత్రం ధాన్యం ఎగుమతిని కొనసాగించింది; కరువు సమయంలో, వైస్రాయ్ లార్డ్ రాబర్ట్ బుల్వెర్-లిట్టన్, రికార్డు స్థాయిలో 3,20,000 టన్నుల గోధుమలను ఇంగ్లండ్‌కు ఎగుమతి చేయించాడు. ఇది ఈ ప్రాంతాన్ని మరింత దుర్బలంగా మార్చింది. ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల సాగు, ధాన్యాన్ని సరుకుగా చేయడంతో ఈ సంఘటనలలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. [4][5]

వలస ప్రభుత్వం ప్రజాసంక్షేమ ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కరువు సంభవించింది. అంతకుముందు, 1873-74 బీహార్ కరువులో, బర్మా నుండి బియ్యం దిగుమతి చేసుకుని పెద్దయెత్తున మరణాలు సంభవించకుండా నివారించారు. ఆ సమయంలో ఉచిత కరువు సహాయక చర్యలు= కోసం డబ్బు ఖర్చు పెట్టినందుకు గాను బెంగాల్ ప్రభుత్వం పైన, దాని లెఫ్టినెంట్-గవర్నర్ సర్ రిచర్డ్ టెంపుల్ పైనా విమర్శలొచ్చాయి. 1876లో ఇదే టెంపుల్, భారత ప్రభుత్వ కరువు కమీషనర్‌గా ఉన్నాడు. [6] మళ్ళీ కొత్తగా ఆరోపణలు వస్తాయనే భయంతో అతను, ధాన్యం వ్యాపారానికి సంబంధించి లైసెజ్ ఫెయిర్ విధానాన్ని పాటించడం మాత్రమే కాకుండా, [7] ప్రజలకు ఉపశమనం కోసం ఇచ్చే రేషన్‌ల విషయంలో కఠినమైన ప్రమాణాలు పెట్టుకున్నాడు. [8] రెండు రకాల ఉపశమనాలు అందించారు: సమర్ధులైన పురుషులు, మహిళలు, పని చేసే పిల్లలకు "ఉపశమన పనులు" చిన్న పిల్లలు, వృద్ధులు, నిరుపేదలకు ఉచిత (లేదా స్వచ్ఛంద) ఉపశమనం అందించారు.

కరువు, ఉపశమనం

[మార్చు]
ది గ్రాఫిక్ నుండి చెక్కడం, 1877 అక్టోబరు. మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్లారి జిల్లాలో విడిచిపెట్టబడిన ఇద్దరు పిల్లలను చూపుతుంది.
ది గ్రాఫిక్ నుండి చెక్కడం, 1877 అక్టోబరు. బళ్లారి జిల్లాలో జంతువులతో పాటు మనుషుల దుస్థితిని చూపుతుంది.
బెంగుళూరులో కరువు ఉపశమనం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ (1877 అక్టోబరు 20) నుండి.
మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్లారిలో సహాయ పంపిణీని చూపుతున్న సమకాలీన ముద్రణ. ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ (1877) నుండి.
బెంగుళూరులో 1876-78 కరువు సమయంలో కరువు బారిన పడ్డ ప్రజలు

ఉపశమనాలు పొందేందుకు ఉండాల్సిన అర్హతలపై మరింత కఠినంగా ఉండడం, బొంబాయి ప్రెసిడెన్సీలో "ఉపశమన కార్మికుల" సమ్మెలకు దారితీసింది. 1877 జనవరిలో టెంపుల్, మద్రాసు, బొంబాయి ల్లోని సహాయ శిబిరాల్లో ఒక రోజు కష్టపడి పనిచేసేందుకు వేతనాన్ని తగ్గించాడు —ఈ 'టెంపుల్ వేతనం ప్రకారం, "నీడ లేదా విశ్రాంతి లేకుండా రోజంతా కష్టపడి పనిచేస్తే" పురుషునికి 450 గ్రాముల ధాన్యంతో పాటు ఒక అణా, స్త్రీకి, పని చేసే పిల్లలకు కొంచెం తక్కువ గానూ ఇచ్చారు. వేతన తగ్గింపుకు ప్రభుత్వం చెప్పిన హేతువు ఏమిటంటే, ఏదైనా అధిక చెల్లింపు కరువు-బాధిత జనాభాలో 'ఆధారపడటం' ఎక్కువౌతుంది లేదా "నిరుత్సాహం" కలిగిస్తుంది. [9]

టెంపుల్ సిఫార్సులను విలియం డిగ్బీ, మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించిన శానిటరీ కమీషనర్ అయిన WR కార్నిష్‌తో సహా కొంతమంది అధికారులు వ్యతిరేకించారు. [10] కార్నిష్ కనీసం 680 గ్రాముల ధాన్యంతో పాటు కూరగాయలు, మాంసకృత్తుల సప్లిమెంట్లు, ప్రత్యేకించి సహాయక చర్యలలో శ్రమిస్తున్నవారికి ఇవ్వాలని వాదించాడు. [11] అయితే లిట్టన్ టెంపుల్‌కు మద్దతుగా నిలబడ్డాడు. అతను "అతి తక్కువ డబ్బును పంపిణీ చేసే ఆర్థికపరమైన పరిశీలనకు అందరూ కట్టుబడి ఉండాలి" అని వాదించాడు. [12]

1877 మార్చిలో మద్రాస్ ప్రావిన్షియల్ ప్రభుత్వం రేషన్‌ను 570 గ్రాముల ధాన్యం, 43 గ్రాముల పప్పులుకు పెంచి కోర్నిష్ సిఫార్సులను కొంతవరకూ అమలు చేసింది. [13] అప్పటికే, కరువు కారణంగా చాలా మంది ప్రజలు చనిపోయారు. [14] యునైటెడ్ ప్రావిన్స్‌ల వంటి ఇతర ప్రాంతాలలో, ఉపశమనం తక్కువగానే ఉంది. ఫలితంగా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. 1878 రెండవ భాగంలో ప్రబలిన మలేరియా అంటువ్యాధి కారణంగా, అప్పటికే పోషకాహార లోపంతో బలహీనపడిన అనేక మంది చనిపోయారు. [15]

1877 ప్రారంభంలో, "కరువు నియంత్రణలోనే" ఉన్నట్లు టెంపుల్ ప్రకటించాడు. డిగ్బీ "కరువును సరిపడా నియంత్రించామని ఎంత మాత్రం చెప్పలేం, దీని వలన నాలుగింట ఒక వంతు మంది ప్రజలు మరణించారు." [12]

మొత్తం మీద ప్రభుత్వం రూ. 8.130 కోట్లు ఖర్చు పెట్టి 70 కోట్ల యూనిట్లు (1 యూనిట్ = 1 వ్యక్తికి 1 రోజుకు ఇచ్చిన ఉపశమనం), అదనంగా మరో రూ. 72 లక్షలతో  మైసూర్, హైదరాబాద్ సంస్థానాల్లో 7.2 కోట్ల యూనిట్ల ఉపశమనాన్ని ప్రజలకు కలిగించింది. రూ. 60 లక్షల మేరకు పన్ను వసూలు చేయలేదు, లేదా తరువాతి సంవత్సరం వరకు వాయిదా వేసారు. గ్రేట్ బ్రిటన్ నుండి, ఇతర వలస రాజ్యాల నుండీ వచ్చిన విరాళాలు మొత్తం రూ. 84 లక్షలు. [16] అయితే, తలసరి ఖర్చు ప్రకారం చూస్తే ఈ ఖర్చు చాలా స్వల్పం. ఉదాహరణకు, బొంబాయి ప్రెసిడెన్సీలో చేసిన ఖర్చు 1873-74 బీహార్ కరువులో చేసిన ఖర్చులో ఐదవ వంతు కంటే తక్కువ. బీహారు కరువు చాలా చిన్న ప్రాంతాన్ని ప్రభావితం చేసింది, ఎక్కువ కాలం కొనసాగలేదు.

మైసూరు రాష్ట్రంలో కరువు

[మార్చు]

1876 కరువుకు రెండు సంవత్సరాల ముందు, భారీ వర్షాల వలన కోలార్, బెంగుళూరులలో రాగుల పంట నాశనమైంది. మరుసటి సంవత్సరం తక్కువ వర్షపాతం కారణంగా చెరువులు ఎండిపోయి, ఆహార నిల్వలపై ప్రభావం చూపింది. కరువు ఫలితంగా, రాష్ట్ర జనాభా 8,74,000 మేర తగ్గింది (1871 జనాభా లెక్కలతో పోలిస్తే).

కరువును ఎదుర్కోవడానికి , మైసూర్ ప్రభుత్వం ఉపశమన వంటశాలలను ప్రారంభించింది. ఉపశమనం లభించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బెంగళూరుకు వెళ్లారు. ఈ ప్రజలు ఆహారం, ధాన్యాల కోసం బెంగళూరు-మైసూర్ రైలు మార్గంలో పని చేయాల్సి వచ్చింది. మైసూర్ ప్రభుత్వం పొరుగున ఉన్న బ్రిటిష్ పాలిత మద్రాసు ప్రెసిడెన్సీ నుండి పెద్ద మొత్తంలో ధాన్యాన్ని దిగుమతి చేసుకుంది. అడవులలో మేసేందుకు పశువులను తాత్కాలికంగా అనుమతించారు. కొత్త చెరువులు నిర్మించారు. పాత చెరువులకు మరమ్మతులు చేసారు. మైసూరు సంస్థానానికి చెందిన దివాన్, సివి రంగాచార్లు తన దసరా ప్రసంగంలో 80 లక్షల అప్పులతో పాటు రాష్ట్రానికి మొత్తం 1.60 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాడు. [17]

అనంతర పరిణామాలు

[మార్చు]

కరువులో మరణాల సంఖ్య 55 లక్షల దాకా ఉంది. అధిక మరణాలు, దాని నేపథ్యంలో "ఉపశమనం, రక్షణ" పట్ల లేవనెత్తే ప్రశ్నల కారణంగా నేరుగా 1880 నాటి కరువు కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి, చివరికి భారతీయ కరువు కోడ్‌లను ఆమోదించడానికి దారితీసాయి. కరువు తర్వాత, దక్షిణ భారతదేశంలోని పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్మికులు, చేనేత కార్మికులు తోటలలో ఒప్పంద కార్మికులుగా పనిచేయడానికి బ్రిటిష్ ఉష్ణమండల వలస రాజ్యాలకు వలస వెళ్లారు. కరువులో అధిక మరణాల కారణంగా, 1871, 1881ల మధ్య ఉన్న దశాబ్ద కాలంలో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలలో సహజంగా ఉండాల్సిన జనాభా పెరుగుదల ఆగిపోయింది. తమిళం, ఇతర సాహిత్యాలలో కరువు చోటు చేసుకుంది. [18] ఈ కరువును వివరించే కుమ్మి జానపద పాటలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. [19]

మహా కరువు భారతదేశంలోని సంఘటనలపై శాశ్వత రాజకీయ ప్రభావాన్ని చూపింది. కరువుపై అధికారిక ప్రతిచర్యలను, ప్రత్యేకించి కరువు ఉపశమనం గురించి జరిగే అధికారిక చర్చను అణచివేయడాన్నీ చూసిన వారిలో బ్రిటిషు అధికారులు విలియం వెడ్డర్‌బర్న్, AO హ్యూం లు ఉన్నారు. ఆ తరువాత ఒక దశాబ్దం లోపే, వారు భారత జాతీయ కాంగ్రెస్ఉకు పునాది వేసారు. అది ఒక తరం జాతీయవాదులను ప్రభావితం చేసింది. తరువాతి వారిలో దాదాభాయ్ నౌరోజీ, రొమేష్ చందర్ దత్ ఉన్నారు. గొప్ప కరువు బ్రిటిష్ రాజ్ ఆర్థిక విధ్జానాలపై వచ్చిన విమర్శకు మూలస్తంభంమైంది. [20]

తన పుస్తకం లేట్ విక్టోరియన్ హోలోకాస్ట్స్‌లో, మైక్ డేవిస్, కరువును గ్రేట్ బ్రిటన్ చేసిన "వలసవాద మారణహోమం " అని పేర్కొన్నాడు. ఆడమ్ జోన్స్‌తో సహా మరి కొందరు దాన్ని ధృవీకరించారు.  నియాల్ ఫెర్గూసన్‌తో సహా కొందరు దీన్ని వ్యతిరేకించారు. [21] [22] ]

ఇవి కూడా చూండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Fieldhouse 1996, p. 132 Quote: "In the later nineteenth century, there was a series of disastrous crop failures in India leading not only to starvation but to epidemics. Most were regional, but the death toll could be huge. Thus, to take only some of the worst famines for which the death rate is known, some 800,000 died in the North West Provinces, Punjab, and Rajasthan in 1837–38; perhaps 2 million in the same region in 1860–61; nearly a million in different areas in 1866–67; 4.3 million in widely spread areas in 1876–78, an additional 1.2 million in the North West Provinces and Kashmir in 1877–78; and, worst of all, over 5 million in a famine that affected a large population of India in 1896–97. In 1899–1900 more than a million were thought to have died, conditions being worse because of the shortage of food following the famines only two years earlier. Thereafter the only major loss of life through famine was in 1943 under exceptional wartime conditions.(p. 132)"
  2. Dyson, Tim (2018). A Population History of India: From the First Modern People to the Present Day. Oxford University Press. pp. 137–. ISBN 978-0-19-882905-8. Quote: "Estimating the number of people who died as a result of a famine is not straightforward. Assumptions are required, and often they are not specified in detail and can be influenced by political considerations. However, for the 1876‒78 famine, towards the low end of the range Visaria and Visaria mention official estimates for British administered provinces which suggest that there were about 5.6 million ‘excess’ deaths. Towards the high end of the range, the campaigner William Digby—who witnessed the crisis in Madras Presidency—put the figure at 9.4 million for India. Between these numbers, a careful estimate by Arup Maharatna is that there were around 8.2 million deaths. (p. 137)"
  3. Marshall, Michael. "A freak 1870s climate event caused drought across three continents". New Scientist.
  4. S. Guha, Environment and Ethnicity in India, 1200-1991 2006. p.116
  5. Mike Davis, 2001. Late Victorian Holocausts: El Nino Famines and the Making of the Third World. Verso, London.
  6. Imperial Gazetteer of India vol. III 1907, p. 488
  7. Hall-Matthews 1996, p. 217
  8. Imperial Gazetteer of India vol. III 1907, p. 488
  9. Hall-Matthews 2008, p. 5
  10. Arnold 1994, pp. 7–8
  11. Arnold 1994, pp. 7–8
  12. 12.0 12.1 Mike Davis, Late Victorian Holocausts, El Niño Famines and the Making of the Third World, Verso, 2001; calories for Buchenwald diet: 1750; Temple wage: 1627. Both involved hard labour (p.39); Temple's remark on financial considerations p.40
  13. Arnold 1994, pp. 7–8
  14. Imperial Gazetteer of India vol. III 1907, p. 489
  15. Imperial Gazetteer of India vol. III 1907, p. 489
  16. Imperial Gazetteer of India vol. III 1907, p. 489
  17. Prasad, S Narendra (5 August 2014). "A devastating famine". No. Bangalore. Deccan Herald. Retrieved 19 January 2015.
  18. .....panchalakshna tirumugavilasam, a satire published in 1899, composed by Villiappa Pillai, one of the court poets of Sivagangai. This narrative piece full of humour and biting irony deals in ca.4500 lines with the conditions of the people suffering in the great famine of 1876... God Sunderesvara of Madurai pleads his helplessness in solving the problems of inhabitants hit by the famine..Kamil Zvelebil (1974). Tamil Literature. Otto Harrassowitz Verlag. pp. 218–. ISBN 978-3-447-01582-0. Retrieved 1 January 2013.
  19. "இந்தவாரம் கலாரசிகன்". Dina Mani (in Tamil). 20 June 2010. Retrieved 17 August 2010.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  20. Hall-Matthews 2008, p. 24
  21. Jones, Adam (2016-12-16). "Chapter 2: State and Empire". Genocide: A Comprehensive Introduction (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781317533856.
  22. Powell, Christopher (2011-06-15). Barbaric Civilization: A Critical Sociology of Genocide (in ఇంగ్లీష్). McGill-Queen's Press - MQUP. pp. 238–245. ISBN 9780773585560.