నరకం
స్వరూపం
ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలు చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెపుతున్నాయి. ఈ విధమైన బోహదేహం రెండు రకాలు. ఒకటి సూక్ష్మ దేహం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ధ్వలోకాలకు చేరుతుంది. రెండవది యాతనా దేహం. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహంచేత, సుకృత, దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది.
నరకాలలో రకాలు
మహాభాగవతంలో యాతనా దేహం అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలుచేసే 28 నరకాల వర్ణన వున్నది.