Jump to content

రోహిణి ఖాదిల్కర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:


== కెరీర్ ==
== కెరీర్ ==

=== చెస్ అంబాసిడర్ ===
ఆమె 56 సందర్భాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ విదేశాలకు వెళ్ళింది, అలా అనేక దేశాలను సందర్శించింది. ప్రతి సందర్భంలోనూ ఆమె చెస్ అంబాసిడర్‌గా భారత ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడింది. ఆమె పర్యటనలలో అప్పటి కమ్యూనిస్ట్ దేశాలైన [[పోలాండ్]], యుఎస్‌ఎస్‌ఆర్, [[యుగోస్లేవియా]] పర్యటనలు కూడా ఉన్నాయి. వీటిని ఆ సమయంలో ప్రధాని [[ఇందిరా గాంధీ]] ప్రోత్సహించింది.


=== వార్తాపత్రిక వృత్తి ===
=== వార్తాపత్రిక వృత్తి ===

07:57, 3 ఏప్రిల్ 2023 నాటి కూర్పు

రోహిణి ఖాదిల్కర్
లుజర్న్1982లో రోహిణి ఖాదిల్కర్
దేశంభారతదేశం
పుట్టిన తేది(1963-04-01)1963 ఏప్రిల్ 1
ముంబై
టైటిల్ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (1981)
ఫిడే రేటింగ్2215 ఇన్‌యాక్టివ్
అత్యున్నత రేటింగ్2220 (జూలై 1987)[1]

రోహిణి ఖాదిల్కర్ (జననం 1963 ఏప్రిల్ 1) ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ బిరుదును కలిగి ఉన్న భారతీయ చెస్ క్రీడాకారిణి. ఆమె భారతీయ మహిళల ఛాంపియన్‌షిప్‌ను ఐదుసార్లు, ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌ను రెండుసార్లు గెలుచుకుంది.[2] 1980లో అర్జున అవార్డు అందుకున్న మొదటి మహిళా చెస్ క్రీడాకారిణి ఆమె.

వ్యక్తిగతం

వీరు ముగ్గురు సోదరీమణులు వాసంతి ఖాదిల్కర్, జయశ్రీ ఖాదిల్కర్, రోహిణి ఖాదిల్కర్. ఈ ముగ్గురూ భారతదేశ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లలో ఆధిపత్యం చెలాయించడంతో పాటు మొదటి దశాబ్దంలోనే అన్ని టైటిళ్లను గెలుచుకున్నందుకు గుర్తింపు పొందారు.[3] ముగ్గురు ఖాదీల్కర్ సోదరీమణులలో ఆమె చిన్నది. వీరంతా చెస్‌లో రాణించారు.

వీరి తండ్రి, నీల్కాంత్ ఖాదిల్కర్ (1934-2019) మరాఠీ భాషలో ముంబైకి చెందిన ప్రసిద్ధ పాత్రికేయుడు.[4] ఆయన స్థాపించిన నవ కాల్ వార్తాపత్రికను నడపడంలో సహాయం చేస్తున్నారు. మరాఠీ నాటక రచయిత కృష్ణాజీ ప్రభాకర్ ఖాదిల్కర్ (1872-1948) ఈ సోదరీమణులకు ముత్తాత.

కెరీర్

చెస్ అంబాసిడర్

ఆమె 56 సందర్భాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ విదేశాలకు వెళ్ళింది, అలా అనేక దేశాలను సందర్శించింది. ప్రతి సందర్భంలోనూ ఆమె చెస్ అంబాసిడర్‌గా భారత ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడింది. ఆమె పర్యటనలలో అప్పటి కమ్యూనిస్ట్ దేశాలైన పోలాండ్, యుఎస్‌ఎస్‌ఆర్, యుగోస్లేవియా పర్యటనలు కూడా ఉన్నాయి. వీటిని ఆ సమయంలో ప్రధాని ఇందిరా గాంధీ ప్రోత్సహించింది.

వార్తాపత్రిక వృత్తి

1993లో రోహిణి ఖాదిల్కర్ చెస్ నుండి రిటైర్ అయ్యి ప్రింటింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరింది. ఇందులో గోల్డ్ మెడల్ సంపాదించింది. అగ్ఫా-గేవార్ట్(Agfa-Gevaert) ద్వారా ప్రింటింగ్ డిప్లొమా పొందింది.[5]

ఆమె మహారాష్ట్రలో సాయంత్రం వార్తాపత్రికకు మొదటి మహిళా సంపాదకురాలు. ఆమె నవ కాల్ వార్తాపత్రికకు సహాయ సంపాదకురాలు కూడా. 1998 డిసెంబర్ 16 నుండి సంధ్యాకాల్(Sandhyakal ) పత్రికకు సంపాదకురాలు.

గుర్తింపు

1977లో చదరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆమె ఛత్రపతి అవార్డును గెలుచుకుంది. ఆ తరువాత ఆమెకు క్రీడలలో భారతదేశపు అత్యున్నత పురస్కారం అర్జున అవార్డు లభించింది. ఆమె చదరంగంలో రాణించడంతో మహారాష్ట్ర కన్య(Maharashtra Kanya) గా కూడా ప్రకటించబడింది.[6]

మూలాలు

  1. Khadilkar, Rohini FIDE rating history, 1979-2001 at OlimpBase.org
  2. Menon, Ajay (3 June 2012). "Anand's win fires former chess whiz from Girgaon". Hindustan Times. Mumbai. Archived from the original on 8 August 2014. Retrieved 5 August 2014.
  3. Menon, Ajay (3 June 2012). "Anand's win fires former chess whiz from Girgaon". Hindustan Times. Mumbai. Archived from the original on 8 August 2014. Retrieved 5 August 2014.
  4. "Senior journalist Nilkanth Khadilkar dies at 86". 22 November 2019.
  5. "Cornered Sports: At The Age Of 13, This Indian Was The First Female In The World To Compete In The Men's Chess Championship". Cornered Zone (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-04-06.
  6. "Cornered Sports: At The Age Of 13, This Indian Was The First Female In The World To Compete In The Men's Chess Championship". Cornered Zone (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-04-06.