మహేశ్ భట్ (జననం 20 సెప్టెంబరు 1948) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతడు ముఖ్యంగా హిందీ సినిమాకు పనిచేశాడు. 1984లో ఇతడు దర్శకత్వం వహించిన సారాంశ్ అనే సినిమా 14వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ సినిమా ఆ యేడాది ఉత్తమ విదేశీ చిత్రం క్యాటగరీకి ఆస్కార్ అవార్డు కొరకు భారత దేశ ప్రభుత్వం చేత ప్రతిపాదించబడింది.[2] 1986లో వచ్చిన నామ్‌ ఇతని మొట్టమొదటి వాణిజ్య సినిమా. 1987లో ఇతడు కబ్జా అనే సినిమాతో ఇతడు నిర్మాతగా మారాడు. ఇతడు తన సోదరుడు ముఖేష్ భట్‌తో కలిసి "విశేష్ ఫిల్మ్‌స్" బ్యానర్‌పై సినిమాలు తీశాడు.

మహేశ్ భట్
મહેશ ભટ્ટ
మహేశ్ భట్
జననం (1948-09-20) 1948 సెప్టెంబరు 20 (వయసు 76)[1]
బాంబే, బాంబే స్టేట్, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు, నిర్మాత, సినిమా రచయిత
జీవిత భాగస్వామికిరణ్ భట్
సోనీ రజ్దాన్
పిల్లలుపూజా భట్ (జ. 1972)
రాహుల్ భట్ (జ. 1982)
షాహీన్ భట్ (జ. 1988)
ఆలియా భట్ (జ. 1993)
తల్లిదండ్రులునానాభాయ్ భట్
సిరీన్ మహమ్మదాలీ

ఇతడు డాడీ, స్వయం, ఆషికీ, దిల్ హై కీ మాన్‌ తా నహీ, సడక్, సర్, గుమ్రా, క్రిమినల్, హమ్‌ హై రాహీ ప్యార్ కే, జిస్మ్‌, మర్డర్, వో లమ్హే వంటి అనేక హిట్ చిత్రాలను తీశాడు.

ప్రారంభ జీవితం, కుటుంబం

మార్చు

మహేశ్ భట్ నానాభాయ్ భట్, సిరీన్ మహమ్మదాలీ దంపతులకు 1948 సెప్టెంబరు 20న జన్మించాడు.[3] ఇతని తండ్రి గుజరాతీ బ్రాహ్మణుడు. తల్లి దావూదీ బొహ్రా తెగకు చెందిన షియా ముస్లీము.[4][5][6]

ఇతడు బొంబాయి మాతుంగాలోని డాన్‌బాస్కో స్కూలులో చదివాడు. చదువుకునే రోజులలోనే ఇతడు వేసవి సెలవులలో ధనార్జనకోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. సినిమా దర్శకుడు రాజ్ ఖోస్లా వద్ద సహాయకుడిగా పనిచేశాడు. ఇతడు తన మొదటి భార్య కిరణ్ భట్(అసలు పేరు లొరైన్ బ్రైట్) తన విద్యార్థి దశలోనే తొలిసారి కలుసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిగిన అనుభావాల ప్రేరణతోనే ఆషికీ అనే సినిమా తీశాడు.[7] వీరికి పూజా భట్, రాహుల్ భట్ అనే సంతానం కలిగారు. కానీ వీరి వివాహం కొంత కాలానికి విచ్చిన్నమైంది. తరువాత ఇతడు నటి సోనీ రజ్దాన్‌తో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు.[7]

సినిమా రంగం

మార్చు

ఇతడు 1974లో తన 26వ యేట "మంజిలే ఔర్ భీ హై" అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించాడు. 1979లో ఇతడు దర్శకత్వం వహించిన "లహూ కే దో రంగ్" అనే సినిమా రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను గెలుచుకుంది.[8] ఈ సినిమాకు హెలెన్ తన మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఉత్తమ సహాయనటి విభాగంలో గెలుచుకోగా, మధుకర్ షిండేకు ఉత్తమ కళాదర్శకుడు విభాగంలో అవార్డు లభించింది.ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మామూలు విజయం సాధించింది.[9] ఇతడు తన జీవితం నుండి ప్రేరణ పొంది 1982లో తీసిన సినిమా "అర్థ్"కు విమర్శకులనుండి ప్రశంసలు వచ్చాయి. తరువాత ఇతడు తన వ్యక్తిగత జీవితంలోని అనేక అంశాలను తీసుకుని సినిమాలు తీశాడు. "జనమ్‌" (1985), "సారాంశ్" (1984), "ఆషియానా" (1986) అటువంటి సినిమాలే.

 
"వన్స్ అపాన్ ఎ టైమ్‌"(2010) సినిమా విజయోత్సవ సభలో కంగనా రనౌత్ తో కలిసి మహేశ్ భట్

1990లో ఇతడు తీసిన "ఆషికీ" సంగీత ప్రధానమైన శృంగార సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రాహుల్ రాయ్, అనూ అగర్వాల్, దీపక్ తిజోరీలు ప్రధాన పాత్రలను పోషించగా నదీమ్-శ్రావణ్‌ల సంగీతం ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించడానికి దోహదపడింది. ఈ సినిమా తర్వాత ఈ జంటకు సంగీత దర్శకులుగా మంచి గుర్తింపు లభించింది. ఇతడు తన కుమార్తె పూజాభట్‌ను "దిల్ హై కీ మాన్తా నహీ" సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం చేశాడు. 1991లో విడుదలైన ఈ సినిమాలో పూజాభట్ అమీర్ ఖాన్ సరసన నటించింది. ఈ సినిమాలోని పాటలకు, సంగీతానికి మంచి ప్రశంసలు లభించాయి.అదే సంవత్సరం ఇతని దర్శకత్వంలో వచ్చిన "సాథీ" సినిమా ఆదిత్య పంచోలీ సినీ జీవితంలో అతిపెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. 1993లో ఇతడు దర్శకత్వం వహించిన "సర్" కూడా మంచి ఫలితాన్ని సాధించింది.


1995లో ఇతడు అప్పుడే భారతదేశంలో కొత్తగా వచ్చిన మాధ్యమం టెలివిజన్ వైపు తన దృష్టిని సారించాడు. ఆ ఏడాది అశోక్ బ్యాంకర్ వ్రాసిన "ఎ మౌత్‌ఫుల్ స్కై" అనే ఇంగ్లీషు సీరియల్‌కు, శోభా డే వ్రాసిన "స్వాభిమాన్" అనే హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించాడు. 1997లో కభీ కభీ అనే సీరియల్‌ను తీశాడు. ఇతడు హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేసి హిందీ సినిమాలను తీశాడు. ఉదాహరణకు "ది ఫ్యుగిటివ్" అనే సినిమాను క్రిమినల్ అనే పేరుతో కాపీ చేశాడు. అలాగే ఎన్నో హాలీవుడ్ సినిమాలలోని సన్నివేశాలను తన సినిమాలలో వాడుకున్నాడు. .

1999లో "కార్టూస్" అనే సినిమాకు చివరిసారి దర్శకత్వం వహించాడు. తరువాత ఇతడు దుష్మన్, రాజ్, మర్డర్, గాంగ్‌స్టర్, వో లమ్హే వంటి పాతిక సినిమాలకు కథలను, స్క్రీన్‌ప్లేలను అందించాడు. ఇతడు తన సోదరుడు ముఖేష్ భట్‌తో కలిసి విశేష్ ఫిల్మ్‌స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మించాడు. ఇతడు నాటకరంగంలో కూడా ప్రవేశించి "ది లాస్ట్ సాల్యూట్", "ట్రయల్ ఆఫ్ ఎర్రర్స్", "అర్థ్" (తన సినిమాకు నాటకీకరణ) అనే మూడు నాటకాలకు నిర్మాతగా పనిచేశాడు.[10][11][12],[13] [14][15][16] [17]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఇతడు లోరైన్ బ్రైట్ అనే ఆవిడను ప్రేమించి తన 20వ యేట వివాహం చేసుకున్నాడు. బ్రైట్ తన పేరును కిరణ్ భట్‌గా మార్చుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కుమార్తె పూజాభట్ నటిగా రాణించి ప్రస్తుతం నిర్మాతగా పనిచేస్తున్నది. కుమారుడు రాహుల్ భట్ సినిమా నటుడు. మహేశ్ భట్, కిరణ్ భట్‌ల వైవాహిక జీవితం చాలా రోజులు కొనసాగలేదు. ప్రముఖ నటి పర్వీన్ బాబీతో ఇతనికి ఏర్పడిన సంబంధాల కారణంగా మహేశ్ కిరణ్‌లు విడిపోయారు.[7] మహేశ్ భట్ తర్వాత 1986లో నటి సోనీ రజ్దాన్‌ను వివాహం చేసుకున్నాడు.[7][18]ఈ జంటకు షాహీన్ భట్, ఆలియా భట్ అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. సినిమా నటుడు ఇమ్రాన్ హష్మీ ఇతని మేనల్లుడు.

1970లో ఇతడు ఓషో అనుయాయిగా మారాడు. తరువాత ఇతడు తత్త్వవేత్త యు.జి.కృష్ణమూర్తి మార్గనిర్దేశకత్వంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు.[7] ఇతడు 1992లో కృష్ణమూర్తి జీవిత చరిత్రను "యు.జి.కృష్ణమూర్తి, ఎ లైఫ్" అనే పేరుతో వ్రాశాడు. [19] ఇది కాక యు.జి.కృష్ణమూర్తితో సంభాషణల ఆధారంగా వెలువడిన అనేక గ్రంథాలకు ఇతడు సంపాదకుడిగా పనిచేశాడు. తాజాగా ఇతడు వ్రాసిన "ఎ టేస్ట్ ఆఫ్ లైఫ్: ద లాస్ట్ డేస్ ఆఫ్ యు.జి.కృష్ణమూర్తి" జూన్ 2009లో ప్రచురితమయ్యింది.[20]

విశేషాలు

మార్చు

మహేశ్ భట్ ఒక దర్శకుడిగా, నిర్మాతగా ఎందరో నటీనటులను వెండితెరకు పరిచయం చేశాడు. వారందరికీ తరువాతి కాలంలో నటీనటులుగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఇతడు పరిచయం చేసిన నటీనటులలో అనుపమ్‌ ఖేర్‌, రాహుల్ రాయ్, అనూ అగర్వాల్, దీపక్ తిజోరి, పూజాభట్, అతుల్ అగ్నిహోత్రి, సోనాలి బెంద్రే, సమీర్ సోని, శరద్ కపూర్, సుస్మితా సేన్, ముకుల్ దేవ్, అశుతోష్ రాణా, మనోజ్ బాజ్‌పాయ్, అఫ్తాబ్ శివ్‌దాసాని, డీనో మోరియా, బిపాషా బసు, అపర్ణా తిలక్, ఇమ్రాన్ హష్మీ, మల్లికా శెరావత్, కునాల్ ఖేము, షినే అహూజా, కంగనా రనౌత్ మొదలైన వారున్నారు.[21]

ఇతడు అనేక మంది నటీనటులకు, సంగీత దర్శకులకు మంచి అవకాశాలను ఇచ్చాడు. ఇతని సినిమాలలో పనిచేసిన తర్వాత వారికి మంచి మంచి అవకాశాలు వచ్చి పేరుప్రఖ్యాతులు లభించాయి. అలా ఇతడు బ్రేక్ త్రూ ఇచ్చిన వాళ్లలో సంజయ్ దత్, కుమార్ గౌరవ్, ఆదిత్య పంచోళి, అమీర్ ఖాన్, జుహీ చావ్లా, పరేష్ రావెల్ వంటి నటీనటులే కాక నదీమ్-శ్రవణ్, అనూ మాలిక్ వంటి సంగీత దర్శకులు, అతీఫ్ అస్లాం వంటి గాయకులు ఉన్నారు.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు నిర్మాత రచయిత నటీనటులు Notes
1974 మంజిలే ఔర్ భీ హై  Y కబీర్ బేడి, ప్రేమా నారాయణ్, గుల్షన్ అరోరా
1977 విశ్వాస్‌ఘాత్  Y సంజీవ్ కుమార్, షబానా అజ్మీ, కబీర్ బేడి
1978 నయా దౌర్  Y రిషి కపూర్, భావనా భట్, డానీ డెంజోంగ్ప
1979 లహూ కే దో రంగ్  Y వినోద్ ఖన్నా, షబానా అజ్మీ, డానీ డెంజోంగ్ప, హెలెన్ రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను దక్కించుకుంది. హెలెన్ ఉత్తమ సహాయనటి అవార్డు గెలుచుకుంది.
1980 అభిమన్యు  Y
1982 అర్థ్  Y  Y షబానా అజ్మీ, కుల్ భూషణ్ ఖర్బందా, స్మితా పాటిల్, రోహిణీ హట్టంగడి, రాజ్ కిరణ్ ఉత్తమ సంభాషణల రచయిత క్యాటగరీలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.
షబానా అజ్మీ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకుంది.[22]
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాలలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ప్రతిపాదించబడింది.
ఈ సినిమా తమిళంలో పునర్మించబడింది.
1984 సారాంశ్  Y  Y అనుపమ్‌ ఖేర్‌, రోహిణీ హట్టంగడి, సోనీ రజ్దాన్ ఉత్తమ కథగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
వసంత్ దేవ్ ఉత్తమ గీతరచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
భారత ప్రభుత్వం తరఫున ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడింది.[23]
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాలలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు పరిశీలించబడింది.
1985 జనమ్‌  Y  Y కుమార్ గౌరవ్, అనుపమ్‌ ఖేర్, షేర్‌నాజ్ పటేల్, కీతూ గిద్వాని ఈ సినిమా "ఆత్మకథ" పేరుతో తెలుగులో రీమేక్ చేయబడింది.
1986 ఆషియానా  Y మార్క్ జుబైర్, దీప్తి నావల్, సోనీ రజ్దాన్
1986 నామ్‌  Y సంజయ్ దత్, కుమార్ గౌరవ్, నూతన్, పూనమ్‌ ధిల్లాన్, అమృతా సింగ్
1987 ఆజ్  Y కుమార్ గౌరవ్, అనామికా పాల్, స్మితా పాటిల్, రాజ్ బబ్బర్
1987 కాష్  Y  Y జాకీ ష్రాఫ్, డింపుల్ కపాడియా, అనుపమ్‌ ఖేర్‌
1987 ఠికానా  Y అనిల్ కపూర్, స్మితా పాటిల్, అమృతా సింగ్, సురేష్ ఒబెరాయ్, రోహిణీ హట్టంగడి
1988 సియాసత్  Y నీలమ్‌ కొఠారీ
1988 కబ్జా  Y సంజయ్ దత్, రాజ్ బబ్బర్, అమృతా సింగ్ ఆన్ ది వాటర్‌ఫ్రంట్ సినిమా ఆధారంగా నిర్మించబడింది.
1989 డాడీ  Y అనుపమ్‌ ఖేర్‌, పూజా భట్, సోనీ రజ్దాన్, మనోహర్ సింగ్ అనుపమ్‌ ఖేర్‌కు ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది.[24]
1990 అవార్గి  Y అనిల్ కపూర్, గోవిందా, మీనాక్షి శేషాద్రి, అనుపమ్‌ ఖేర్‌
1990 జుర్మ్  Y వినోద్ ఖన్నా, మీనాక్షి శేషాద్రి, సంగీతా బిజలానీ, షఫీ ఇనామ్‌దార్
1990 ఆషికీ  Y రాహుల్ రాయ్, అనూ అగర్వాల్, రీమా లాగూ 4 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను గెలుచుకుంది
ఉత్తమ దర్శకుడు విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కొరకౌ నామినేట్ చేయబడింది.
1991 స్వయం  Y వహీదా రెహమాన్, సదాశివ్ అమ్రాపూర్‌కర్, రోహిణీ హట్టంగడి, అనుపమ్‌ ఖేర్‌, పరేష్ రావెల్, సోనీ రజ్దాన్
1991 సాథి  Y ఆదిత్య పంచోలి, మొహ్‌సీన్ ఖాన్, వర్ష ఉస్‌గావ్‌కర్, పరేష్ రావెల్, అనుపమ్‌ ఖేర్‌
1991 దిల్ హై కే మాంతా నహీ  Y అమీర్ ఖాన్, పూజా భట్, అనుపమ్‌ ఖేర్‌ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాలలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కొరకు నామినేట్ చేయబడింది.
ఇట్ హేపెండ్ వన్ నైట్ అనే సినిమా ఆధారంగా నిర్మించబడింది.
కాదల్ రోజావేపేరుతో తమిళంలో రీమేక్ చేయబడింది.
1991 సడక్  Y సంజయ్ దత్, పూజా భట్, సదాశివ్ అమ్రాపూర్‌కర్ సదాశివ్ అమ్రాపూర్‌కర్‌కు ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ లభించింది.
అప్పు పేరుతో తమిళంలో పునర్నిర్మించబడింది.
1992 సాత్వా ఆస్మాన్  Y వివేక్ ముష్రాన్, పూజా భట్
1992 జునూన్  Y రాహుల్ రాయ్, పూజా భట్, అవినాష్ వర్ధన్, రాకేష్ బేడి ఏన్ అమెరికన్ వేర్‌వూల్ఫ్ ఇన్ లండన్ సినిమా ఆధారంగ నిర్మించబడింది.
1992 మార్గ్  Y వినోద్ ఖన్నా, హేమా మాలిని, డింపుల్ కపాడియా, అనుపమ్‌ ఖేర్‌, పరేష్ రావెల్ మొదట్లో ప్రేమ్‌ ధరం అనే పేరు పెట్టారు.
1993 ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయే  Y పూజా భట్, రాహుల్ రాయ్, పూజా బేడి టెలివిజన్ సినిమా
1993 గునాహ్  Y సన్నీ డియోల్, డింపుల్ కపాడియా
1993 సర్  Y నసీరుద్దీన్ షా, పూజా భట్, అతుల్ అగ్నిహోత్రి, పరేష్ రావెల్ గ్యాంగ్ మాస్టర్ పేరుతో తెలుగులో పునర్మించబడింది.
1993 హమ్‌ హై ప్యార్ కే  Y అమీర్ ఖాన్, జుహీ చావ్లా, కునాల్ ఖేము ఉత్తమ చిత్రంతో సహా 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది.
హౌస్ బోట్ సినిమా ఆధారంగా నిర్మించబడింది.
1993 గుమ్రాహ్  Y శ్రీదేవి, సంజయ్ దత్, అనుపమ్‌ ఖేర్‌, రాహుల్ రాయ్, సోనీ రజ్దాన్
1993 తాడిపార్  Y మిధున్ చక్రవర్తి, పూజా భట్, అనుపమ్‌ ఖేర్‌
1994 ది జంటిల్‌మాన్  Y  Y చిరంజీవి, జుహీ చావ్లా, పరేష్ రావెల్ తమిళ సినిమా జెంటిల్ మేన్‌కు రీమేక్.
1994 నారాజ్  Y మిధున్ చక్రవర్తి, పూజా భట్, అతుల్ అగ్నిహోత్రి, సోనాలి బెంద్రే
1995 మిలన్  Y జాకీ ష్రాఫ్, మనీషా కోయిరాలా, పరేష్ రావెల్
1995 నాజయాజ్  Y నసీరుద్దీన్ షా, అజయ్ దేవ్‌గణ్, జుహీ చావ్లా
1995 క్రిమినల్  Y అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం
"ది ఫ్యుగిటివ్" అనే సినిమా ఆధారంగా తీయబడింది.
1996 పాపా కెహ్‌తే హై  Y  Y జుగల్ హన్స్‌రాజ్, మయూరి కాంగో, అనుపమ్‌ ఖేర్‌
1996 చాహత్  Y షారుఖ్ ఖాన్, పూజా భట్, నసీరుద్దీన్ షా, అనుపమ్‌ ఖేర్‌, రమ్యకృష్ణ
1996 దస్తక్  Y సుస్మితా సేన్, ముకుల్ దేవ్, శరద్ కపూర్, మనోజ్ బాజ్‌పాయ్
1997 తమన్నా  Y  Y పరేష్ రావెల్, పూజా భట్, శరద్ కపూర్, మనోజ్ బాజ్‌పాయ్
1998 డూప్లికేట్  Y షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా, సోనాలి బెంద్రే ది హోల్ టౌన్స్ టాకింగ్ సినిమా ఆధారంగా నిర్మించబడింది
1998 అంగారే  Y అక్షయ్ కుమార్, అక్కినేని నాగార్జున, పూజా భట్, సోనాలి బెంద్రే, పరేష్ రావెల్ స్టేట్ ఆఫ్ గ్రేస్ సినిమా ఆధారంగా నిర్మించబడింది
1998 దుష్మన్[25]  Y కాజల్, సంజయ్ దత్, అశుతోష్ రాణా ఐ ఫార్ ఏన్ ఐ సినిమా ఆధారంగా నిర్మించబడింది
1999 జఖ్మ్  Y  Y అజయ్ దేవ్‌గణ్, అక్కినేని నాగార్జున, పూజా భట్, సోనాలి బెంద్రే, కునాల్ ఖేమూ ఉత్తమ కథ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు
అజయ్ దేవ్‌గణ్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
నర్గీస్‌దత్ ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం
1999 యే హై ముంబై మేరీ జాన్  Y సైఫ్ అలీ ఖాన్, ట్వింకిల్ ఖన్నా ముందు మిస్టర్ ఆషిక్ అని పేరు పెట్టారు.
1999 కార్టూస్  Y సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మనీషా కోయిరాలా పాయింట్ ఆఫ్ నో రిటర్న్ సినిమా ఆధారంగా నిర్మించబడింది
1999 సంఘర్ష్  Y అక్షయ్ కుమార్, ప్రీతీ జింటా, అశుతోష్ రాణా ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ సినిమా ఆధారంగా నిర్మించబడింది.
2001 కసూర్  Y అఫ్తాబ్ శివ్‌దాసాని, లీసా రే, అశుతోష్ రాణా జాగ్‌డ్ ఎడ్జ్ సినిమా ఆధారంగా నిర్మించబడింది.
2001 యే జిందగీ కా సఫర్  Y జిమ్మీ షేర్‌గిల్, అమీషా పటేల్
2002 రాజ్  Y  Y బిపాషా బసు, డినో మోరియా, అశుతోష్ రాణా వాట్ లైస్ బినీత్ సినిమా ఆధారంగా నిర్మించబడింది.
2002 గునాహ్  Y డినో మోరియా, బిపాషా బసు, అశుతోష్ రాణా, ఇర్ఫాన్ ఖాన్
2003 సాయ  Y జాన్ అబ్రహాం, తారాశర్మ,మహిమా చౌదరి డ్రాగన్‌ఫ్లై సినిమా ఆధారంగా నిర్మించబడింది.
2003 ఫుట్‌పాత్  Y  Y అఫ్తాబ్ శివ్‌దాసాని, ఇమ్రాన్ హష్మీ, రాహుల్ దేవ్, బిపాషా బసు, ఇర్ఫాన్ ఖాన్ స్టేట్ ఆఫ్ గ్రేస్ సినిమా ఆధారంగా నిరించబడింది.
2003 జిస్మ్  Y జాన్ అబ్రహాం, బిపాషా బసు బాడీ హీట్ సినిమా ఆధారంగా నిరించబడింది.
2003 ఇంతెహా  Y విద్యా మాల్వాదె, ఆస్మిత్ పటేల్, నౌహీద్ సిరుసి ఫియర్ సినిమా ఆధారంగా నిరించబడింది.
2004 మర్డర్  Y మల్లికా శెరావత్, ఇమ్రాన్ హష్మీ, ఆస్మిత్ పటేల్ అన్‌ఫెయిత్‌ఫుల్ సినిమా ఆధారంగా నిరించబడింది.
2005 రోగ్  Y ఇర్ఫాన్ ఖాన్, ఇలీన్ హమన్ లారాసినిమా ఆధారంగా నిరించబడింది.
2005 జహర్  Y శర్మిష్ఠా శెట్టి, ఇమ్రాన్ హష్మి, ఉదితా గోస్వామి ఔట్ ఆఫ్ టైమ్‌ సినిమా ఆధారంగా నిరించబడింది.
2005 నజర్  Y మీరా, ఆస్మిత్ పటేల్, కోయల్ పురి
2005 కలియుగ్  Y కునాల్ ఖేము, ఇమ్రాన్ హష్మీ, స్మైలీ సూరి, అమృతా సింగ్, దీపల్ షా, అశుతోష్ రాణా
2006 గ్యాంగ్‌స్టర్  Y  Y కంగనా రనౌత్, ఇమ్రాన్ హష్మీ, షైనీ అహూజా
2006 వో లమ్హే  Y  Y కంగనా రనౌత్, షైనీ అహూజా
2009 రాజ్ - ద మిస్టరీ కంటిన్యూస్  Y కంగనా రనౌత్, ఇమ్రాన్ హష్మీ, అధ్యయన్ సుమన్
2009 తుమ్‌ మిలే  Y ఇమ్రాన్ హష్మీ, సోహ అలీ ఖాన్
2011 మర్డర్ 2  Y  Y ఇమ్రాన్ హష్మీ, జాక్లిన్ ఫెర్నాండెజ్, ప్రశాంత్ నారాయణ్ ది ఛేజర్ సినిమా ఆధారంగా నిరించబడింది.
2012 జిస్మ్ 2  Y  Y సన్నీ లియోన్, రణ్‌దీప్ హూదా, అరుణోదయ్ సింగ్
2012 రాజ్ 3డి  Y బిపాషా బసు, ఇమ్రాన్ హష్మీ, ఈషా గుప్తా
2013 మర్డర్ 3  Y  Y రణ్‌దీప్ హూదా, అదితి రావ్ హైదరీ, సారా లోరెన్ ది హిడెన్ ఫేస్ అనే సినిమాకు రీమేక్.
2015 మిష్టర్ X  Y ఇమ్రాన్ హష్మీ, అమైర దస్తూర్, అరుణోదయ్ సింగ్
2015 హమారీ అధూరీ కహానీ  Y  Y విద్యా బాలన్, ఇమ్రాన్ హష్మీ, రాజ్‌కుమార్ రావ్
2016 లవ్ గేమ్స్  Y పత్రలేఖ, గౌరవ్ అరోరా, తారా అలీషా బెర్రీ
2016 రాజ్ రీబూట్  Y ఇమ్రాన్ హష్మీ, కృతి కర్బంద, గౌరవ్ అరోరా, సుజనా ముఖర్జీ

టెలివిజన్

మార్చు
సంవత్సరం షో నెట్‌వర్క్ దర్శకుడు నిర్మాత వివరాలు
1995-1997 స్వాభిమాన్ డి.డి.నేషనల్  Y
1995 ఎ మౌత్‌ఫుల్ ఆఫ్ స్కై డి.డి.నేషనల్  Y
1997 కభీ కభీ స్టార్ ప్లస్  Y
2014 నుండి ఉడాన్ కలర్స్ టి.వి.  Y
2016 నుండి నామ్‌కరణ్ స్టార్ ప్లస్  Y  Y [26][27][28]
2017నుండి తూ ఆషికీ కలర్స్ టి.వి.  Y [29]

మూలాలు

మార్చు
  1. Sawhney, Anubha (18 January 2003). "The Saraansh of Mahesh Bhatt's life". Times Of India. Retrieved 17 February 2012.
  2. "14th Moscow International Film Festival (1985)". MIFF. Archived from the original on 16 మార్చి 2013. Retrieved 17 ఏప్రిల్ 2018.
  3. [1]
  4. "Purnima". Internet Movie Database. Retrieved 29 May 2014.
  5. "I have great reverence for women: Mahesh Bhatt". 01/18/2014. Archived from the original on 2014-02-01. Retrieved 2018-04-17.
  6. "Mahesh Bhatt's article about Ramzan, Ramadan". Archived from the original on 4 నవంబరు 2014. Retrieved 14 December 2013.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 Sawhney, Anubha (18 January 2003). "The Saraansh of Mahesh Bhatt's life". Times Of India. Retrieved 17 February 2012.
  8. "Lahu Ke Do Rang Awards". IMDB. Retrieved 21 February 2012.
  9. "Box Office 1979". Boxofficeindia.com. Archived from the original on 20 అక్టోబరు 2013. Retrieved 17 ఏప్రిల్ 2018.
  10. Kalsi, Jyoti (25 January 2011). "Mahesh Bhatt talks about 'The Last Salute'". Gulf News. Retrieved 5 April 2011.
  11. "Review: Now, communalism and counter-insurgency ops on stage". Zee News. 30 March 2013. Archived from the original on 14 ఏప్రిల్ 2013. Retrieved 1 April 2013.
  12. "Imran Zahid gets applaud in Mahesh Bhatt's 'Trial of Error'". The India Awaaz. 30 March 2013. Archived from the original on 19 మార్చి 2014. Retrieved 1 April 2013.
  13. Madhur Tankha (29 July 2013). "Arth stages a comeback". The Hindu. Retrieved 1 August 2013.
  14. "Mahesh's next on Iraqi journalist". Archived from the original on 2013-11-04. Retrieved 21 June 2013.
  15. Uday Bhatia (19 January 2012). "A footwear-flinging Iraqi journalist inspires a new play, says Time Out". Time Out. Archived from the original on 19 March 2014. Retrieved 22 June 2013.
  16. Mahesh Bhatt (14 May 2011). "Footprints of dissent, First Person-Mahesh Bhatt". The Hindu. Retrieved 21 June 2013.
  17. Rana Siddiqui Zaman (3 June 2011). "Shoe act hits the stage". The Hindu. Archived from the original on 10 ఆగస్టు 2011. Retrieved 21 June 2013.
  18. Suparn Verma (19 March 1998). "The return of Razdan". Rediff.com. Retrieved 17 February 2012.
  19. Mahesh Bhatt (1992). U.G. Krishnamurti, A Life. Viking.
  20. Mahesh Bhatt (2009). A taste of Life: The last Days of U.G. Krishnamurti. He considers himself as an alcoholic in one of the TV show with Rohit Roy, but eventually, he overcomes the alcoholism. Penguin Group India. ISBN 0-14-306716-8.
  21. "Anupam Kher's 'People' With Mahesh Bhatt Interview". YouTube. Republic. Retrieved 7 August 2017.
  22. "30th National Film Awards – 1983". Directorate of Film Festivals. Archived from the original (PDF) on 3 అక్టోబరు 2015. Retrieved 13 January 2013.
  23. "List of Indian Submissions for the Academy Award for Best Foreign Language Film". Film Federation of India. Archived from the original on 16 మే 2017. Retrieved 29 March 2013.
  24. "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 2 అక్టోబరు 2013. Retrieved 29 January 2012.
  25. India (9 October 2015). "'Dushman' will bring Indians, Pakistanis closer: Mahesh Bhatt". The Indian Express. Retrieved 11 October 2015.
  26. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-02. Retrieved 2018-04-17.
  27. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-14. Retrieved 2018-04-17.
  28. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-02. Retrieved 2018-04-17.
  29. Mahesh, Shweta. "Mahesh Bhatt brings Aashiqui 2 on Colors as Tu Aashiquii - watch promo" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-08-27.

బయటి లింకులు

మార్చు