కంభంపాటి హరిబాబు

విశాఖపట్నం నుండి 16వ లోక్ సభ సభ్యులు. భారతీయ జనతా పార్టీ.

కంభంపాటి హరిబాబు భారతీయ జనతాపార్టీ రాజకీయ నాయకుడు. అతడు భారతదేశ 16వ లోక్‌సభ సభ్యుడు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.[1] అతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రశాఖ అధ్యక్షునిగా ఉన్నాడు.[2] 2021 జూలై 6 నుండి మిజోరం రాష్ట్ర గవర్నరుగా అధికారంలో ఉన్న అతడు[3][4] 2024 డిసెంబరు చివరి వారంలో ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యాడు.[5]

కంభంపాటి హరిబాబు
కంభంపాటి హరిబాబు

హరిబాబు చిత్రపటం.


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 డిసెంబరు 25
ముందు శ్రీధరన్ పిళ్లై

పదవీ కాలం
2021 నవంబరు 6 – 2024 డిసెంబరు 24

వ్యక్తిగత వివరాలు

జననం 1953 జూన్ 15
తిమ్మసముద్రం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జయశ్రీ
నివాసం రాజ్ భవన్
పూర్వ విద్యార్థి ఆంధ్రవిశ్వవిద్యాలయం
మతం హిందూ
వెబ్‌సైటు KambhampatiHariBabu.in

ప్రారంభ జీవితం

మార్చు

హరిబాబు ప్రకాశం జిల్లా లోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించాడు. అతడు విశాఖపట్నం లోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో బి.టెక్ చేసాడు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేసాడు. తరువాత ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేసి 1993 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు. తరువాత క్రియాశీల రాజకీయాలలోనికి ప్రవేశించాడు.[6][7]

రాజకీయ జీవితం

మార్చు

హరిబాబు ఆంధ్ర రాష్ట్రం కోసం జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ఉద్యమంలో అతడు తెన్నేటి విశ్వనాధం, సర్దార్ గౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడు గార్లతోకలసి విద్యార్థినాయకునిగా పాల్గొన్నాడు. అతడు 1972-73 మధ్య కాలంలో ఆంధ్రవిద్యాలయం లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల యూనియన్ కు సెక్రటరీగా ఉన్నాడు. 1974-75 కాలంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అధ్వర్యలో జరిగిన లోక్‌ సంఘర్ష సమితి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంలో అరెస్టు కాబడ్డాడు. విశాఖపట్నం సెంట్రల్ జైలు, ముషీరాబాదు జైలు లలో 6 నెలలు శిక్ష అనుభవించా\దు. అతడు 1977 లో జనతాపార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా తన సేవలనందించాడు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసాడు.[8]

1991-1993 కాలంలో హరిబాబు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా పనిచేసాడు. తరువాత 1993-2003 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగాడు.

1999లో విశాఖపట్నం-1 నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. 2003 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ ప్లోర్ లీడర్ గా కొనసాగాడు. 2014 మార్చిలో బి.జె.పి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.[8][9] అతడు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.

అభివృద్ధి పనులు

మార్చు

హరిబాబు ఎం.పి.లాడ్స్ నిధులనుపయోగించి ఆరోగ్యం, విద్య, త్రాగునీరు ల కొరకు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేసాడు.[10] దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాలకు, ఎంపి నిధులను పారదర్శకతతోఖర్చు చేసాడు.[11] ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు మరుగుదొడ్లు, ఫర్నిచర్ అందించడం, జి.వి.ఎం.సి అద్వర్యంలో లేని ప్రాంతాలలో త్రాగునీరు అందించడం ముఖ్యమైనవి.[12]

అతడు ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, "ఒన్ ఎం.పి- ఒన్-ఐడియా" కాంటెస్టును నిర్వహించాడు.[13]

గవర్నర్‌

మార్చు

కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమిస్తూ 2021 జూన్ 6న రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.[14][15][16] ఆ తరువాత, 2024 డిసెంబరు 24న అతడు ఒడిశా గవర్నర్‌గా బదిలీ అయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "Constituencywise-All Candidates". Archived from the original on 17 May 2014. Retrieved 17 May 2014.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-21. Retrieved 2018-04-24.
  3. "Ahead of cabinet reshuffle, Thaawarchand Gehlot appointed as Karnataka Governor, Sreedharan Pillai as Goa Governor". The Indian Express (in ఇంగ్లీష్). 2021-07-06. Retrieved 2021-07-06.
  4. "5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు". Eenadu. 24 December 2024. Archived from the original on 24 December 2024. Retrieved 24 December 2024.
  5. "New governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు". EENADU. Retrieved 2024-12-25.
  6. http://timesofindia.indiatimes.com/home/lok-sabha-elections-2014/news/Vizags-non-local-localite/articleshow/34016778.cms
  7. http://timesofindia.indiatimes.com/home/lok-sabha-elections-2014/news/Election-Results-Professor-teaches-a-political-lesson-to-Vijayamma/articleshow/35224165.cms?intenttarget=no
  8. 8.0 8.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-21. Retrieved 2018-04-24.
  9. Sakshi (13 March 2014). "సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  10. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/haribabu-spells-out-thrust-areas-for-lad-funds/article7568689.ece
  11. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/move-to-bring-transparency-in-mplads-spending/article6258321.ece
  12. https://grin.news/in-south-india-a-little-furniture-toilets-makes-all-the-difference-in-schools-ea458c43c71c#.wn3q7wmu0
  13. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/an-idea-can-win-you-a-cash-prize/article6670215.ece
  14. EENADU (6 July 2021). "మిజోరం గవర్నర్‌గా [[కంభంపాటి]] హరిబాబు". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021. {{cite news}}: URL–wikilink conflict (help)
  15. BBC News తెలుగు. "మిజోరం గవర్నర్‌గా [[కంభంపాటి]] హరిబాబు, దత్తాత్రేయ హరియాణాకు." Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021. {{cite news}}: URL–wikilink conflict (help)
  16. Sakshi (7 July 2021). "ప్రొఫెసర్‌ స్థాయి నుంచి గవర్నర్‌ గా." Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.